MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Automobile
  • Bikes
  • Water Powered Scooter: పెట్రోల్ తో పనిలేదు.. ఛార్జింగ్ అవసరం లేదు.. నీటితో నడిచే క్రేజీ స్కూటర్ వచ్చేసింది !

Water Powered Scooter: పెట్రోల్ తో పనిలేదు.. ఛార్జింగ్ అవసరం లేదు.. నీటితో నడిచే క్రేజీ స్కూటర్ వచ్చేసింది !

Water Powered Scooter: ఇకపై పెట్రోల్ తో పనిలేదు.. ఛార్జింగ్ అవసరం లేదు.. నీటితో నడిచే క్రేజీ స్కూటర్ వచ్చేసింది. జాయ్ ఇ-బైక్ సరికొత్త నీటితో నడిచే హైడ్రోజన్ స్కూటర్ ప్రోటోటైప్‌ను తెచ్చింది. డిస్టిల్డ్ వాటర్‌తో ఇది 55 కిమీ మైలేజ్ ఇస్తుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 09 2026, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నీటితో నడిచే జాయ్ ఈ బైక్ సూపర్ స్కూటర్
Image Credit : Gemini

నీటితో నడిచే జాయ్ ఈ బైక్ సూపర్ స్కూటర్

పెట్రోల్ రేట్లు చూస్తేనేమో మండిపోతున్నాయి, పోనీ ఈవీ స్కూటర్లు కొందామంటే గంటల తరబడి ఛార్జింగ్ పెట్టాలి. ఇలాంటి టైంలో అస్సలు పెట్రోల్ అవసరం లేకుండా, కేవలం నీటితో నడిచే స్కూటర్ వస్తే ఎలా ఉంటుంది? వినడానికే క్రేజీగా ఉంది కదా.. ఇప్పుడు ఇది నిజం కాబోతోంది.

ప్రముఖ టూవీలర్ బ్రాండ్ జాయ్ ఈ బైక్ సరికొత్త టెక్నాలజీతో నీటి ద్వారా నడిచే ఒక అద్భుతమైన స్కూటర్ ప్రోటోటైప్‌ను మన ముందుకు తెచ్చింది. భవిష్యత్తులో కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడమే లక్ష్యంగా ఈ వినూత్న ప్రయోగాన్ని చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలు నీటితో స్కూటర్ ఎలా నడుస్తుంది?
Image Credit : Gemini

అసలు నీటితో స్కూటర్ ఎలా నడుస్తుంది?

చాలామందికి నీళ్లతో బైక్ నడవడం ఏంటి అనే డౌట్ రావచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇందులో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని వాడారు. మనం పోసే డిస్టిల్డ్ వాటర్ అంటే కల్తీ లేని స్వచ్ఛమైన నీటి నుంచి హైడ్రోజన్ మాలిక్యూల్స్‌ను ఈ సరికొత్త టెక్నాలజీ వేరు చేస్తుంది. అలా సేకరించిన హైడ్రోజన్ ద్వారా ఫ్యూయల్ సెల్స్ విద్యుత్‌ను తయారు చేస్తాయి. ఆ కరెంట్‌తోనే స్కూటర్ మోటార్ రన్ అవుతుంది. అంటే దీని వల్ల ఎలాంటి హానికరమైన పొగ గానీ, కర్బన ఉద్గారాలు గానీ రావు. పర్యావరణానికి ఇది వంద శాతం సేఫ్ అని కంపెనీ పెర్కొంటోంది.

Related Articles

Related image1
Telangana First Airport: నిజాం కాలంలోనే నైట్ ల్యాండింగ్.. తెలంగాణ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ ఏదో తెలుసా?
Related image2
Best Beer in India: ఇండియాలో బెస్ట్ బీర్ ఏది? బీర్ లవర్స్ టాప్ 5 ఫేవరెట్స్ ఇవే !
35
మైలేజ్, స్పీడ్ సంగతులేంటి?
Image Credit : our own

మైలేజ్, స్పీడ్ సంగతులేంటి?

ఈ కాన్సెప్ట్ స్కూటర్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది సిటీ రౌండ్స్‌కు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఈ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఒక్కసారి హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే చాలు.. ఏకంగా 55 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చు. సిటీలో చిన్న చిన్న పనులకు, ఆఫీసులకు వెళ్లేవారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ కానుంది.

45
ఈ స్కూటర్‌లో ఉన్న ఆ మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఏంటి?
Image Credit : our own

ఈ స్కూటర్‌లో ఉన్న ఆ మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఏంటి?

ఈ స్కూటర్‌లో అన్నిటికంటే హైలైట్ ఫీచర్ ఏంటో తెలుసా? దీనికి సైకిల్‌లాగా పెడల్స్ అమర్చారు. ఒకవేళ మీరు లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు మధ్యలో హైడ్రోజన్ ఇంధనం అయిపోయినా లేదా బ్యాటరీ పవర్ పూర్తిగా డౌన్ అయినా అస్సలు కంగారు పడాల్సిన పనిలేదు. వెంటనే పెడల్స్ సహాయంతో సైకిల్‌లా తొక్కుకుంటూ మీ గమ్యస్థానానికి ఈజీగా చేరుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో రైడర్లకు ఇది ఊరటనిచ్చే ఫీచర్ అని చెప్పాలి.

55
మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుంది? ధర ఎంత?
Image Credit : X/joy_ebike

మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుంది? ధర ఎంత?

ఈ సరికొత్త హైడ్రోజన్ వెహికల్ ప్రోటోటైప్‌ను ప్రతిష్ఠాత్మక 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో'లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరాద్ చేతుల మీదుగా గ్రాండ్‌గా ఆవిష్కరించారు. జాయ్ ఈ-బైక్ టీమ్ తయారు చేసిన ఈ కాన్సెప్ట్ మోడల్‌ను చూసి టెక్ లవర్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆల్రెడీ మార్కెట్లో మిహోస్, గ్లోబ్, వోల్ఫ్, జెన్ నెక్స్ట్ నాను లాంటి 10కి పైగా క్రేజీ ఈవీ మోడళ్లను సక్సెస్‌ఫుల్‌గా అమ్ముతున్న ఈ సంస్థ, ఇప్పుడు హైడ్రోజన్ రేసులో నిలిచింది.

అయితే, ఇది ప్రస్తుతం కేవలం టెక్నాలజీ సామర్థ్యాన్ని చూపించే కాన్సెప్ట్ మోడల్ మాత్రమే. దీని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మొదటి ఫేజ్ ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభమైంది. ఇది ఇంకా కమర్షియల్ అమ్మకాలకు అందుబాటులోకి రాలేదు. అందువల్ల దీని ధర ఎంత ఉంటుంది, మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే అధికారిక వివరాలను కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. టెస్టులన్నీ పూర్తయ్యాక త్వరలోనే మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
రివోల్ట్ నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ బైక్.. రివ‌ర్స్ మోడ్‌, బ్లూటుత్ క‌నెక్టివిటీతో పాటు మ‌రెన్నో ఫీచ‌ర్లు
Recommended image2
Ather: అవును, ఈ స్కూటీ మీతో మాట్లాడుతుంది.. వాయిస్ కంట్రోల్ ఫీచ‌ర్ ఎలా ప‌ని చేస్తుందంటే.?
Recommended image3
ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మంట‌ల్లో కాలితే ఇన్సూరెన్స్ డ‌బ్బులు వ‌స్తాయా.? ఎలాంటి సంద‌ర్భాల్లో రిజ‌క్ట్ అవుతుంది
Related Stories
Recommended image1
Telangana First Airport: నిజాం కాలంలోనే నైట్ ల్యాండింగ్.. తెలంగాణ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ ఏదో తెలుసా?
Recommended image2
Best Beer in India: ఇండియాలో బెస్ట్ బీర్ ఏది? బీర్ లవర్స్ టాప్ 5 ఫేవరెట్స్ ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved