MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Best Selling Cars: భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే.. నంబర్ 1 స్థానంలో టాటా పంచ్.. టాప్ 5 కార్లు ఇవే !

Best Selling Cars: భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే.. నంబర్ 1 స్థానంలో టాటా పంచ్.. టాప్ 5 కార్లు ఇవే !

Best Selling Cars India : జూన్ 2026 కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్ లేపింది. టాటా పంచ్ అత్యధిక అమ్మకాలతో టాప్ లో నిలిచింది. రెండో స్థానంలో కూడా టాటా కారే ఉండగా, తర్వాతి స్థానాల్లో మారుతి సుజుకి, మహీంద్రాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 09 2026, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ కార్లకు తిరుగులేదు బాస్.. జూన్ నెలలో రికార్డులు బద్దలు కొట్టిన బెస్ట్ కార్లు ఇవే!
Image Credit : Gemini

ఈ కార్లకు తిరుగులేదు బాస్.. జూన్ నెలలో రికార్డులు బద్దలు కొట్టిన బెస్ట్ కార్లు ఇవే!

భారతదేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో జూన్ 2026 నెలలో ఊహించని మార్పులు జరిగాయి. కార్ల అమ్మకాల రేసులో టాటా మోటార్స్ సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో టాటా పంచ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. జూన్ 2026లో ఈ మోడల్ ఏకంగా 21,006 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోయింది. పోయిన ఏడాది అంటే జూన్ 2025లో పంచ్ కేవలం 10,446 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 101 శాతం వృద్ధిని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మరోవైపు టాటా నెక్సాన్ కూడా గట్టి పోటీ ఇస్తూ సెకండ్ ప్లేస్ కొట్టేసింది. జూన్ 2026లో నెక్సాన్ 18,335 యూనిట్లు అమ్ముడైంది. జూన్ 2025లో ఈ సంఖ్య 11,602 యూనిట్లుగా ఉంది. దీని అమ్మకాలు కూడా 58 శాతం పెరిగాయి. మార్కెట్లో నెక్సాన్ బ్రాండ్ ఇమేజ్, సేఫ్టీ రేటింగ్, అలాగే ఇది పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ ఇలా అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండటం వల్ల జనాలు దీనికి బాగా ఫిదా అవుతున్నారు. ఈ రెండు కార్ల సక్సెస్‌తో జూన్ నెలలో టాటా మోటార్స్ మార్కెట్లో టాప్ గేర్‌లో దూసుకెళ్లింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మారుతి సుజుకి హవా: టాప్ 10లో ఆరు మోడల్స్
Image Credit : Asianet News

మారుతి సుజుకి హవా: టాప్ 10లో ఆరు మోడల్స్

ఎన్ని కొత్త బ్రాండ్లు వచ్చినా, మాస్ మార్కెట్లో మారుతి సుజుకి పట్టు ఏమాత్రం తగ్గలేదు. జూన్ 2026 సేల్స్ లిస్టులో అత్యధిక మోడల్స్‌తో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. టాప్ 10 కార్లలో ఏకంగా ఆరు మోడల్స్ మారుతి సుజుకి కంపెనీవే ఉన్నాయి. ఇందులో డిజైర్, వ్యాగన్ ఆర్, ఎర్టిగా, స్విఫ్ట్, ఫ్రాంక్స్, బలెనొ కార్లు మార్కెట్‌ను రూల్ చేస్తున్నాయి.

ఈ లిస్టులో మారుతి సుజుకి డిజైర్ ఇండియాలోనే మూడో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. జూన్ 2026లో ఈ కారు 17,899 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది జూన్ నెలలో జరిగిన 15,484 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 16 శాతం పెరిగింది. ప్రైవేట్ కస్టమర్లతో పాటు ఫ్లీట్ ఆపరేటర్లలో కూడా డిజైర్‌కు ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. అలాగే నాలుగో స్థానంలో ఉన్న మారుతి వ్యాగన్ ఆర్ 16,952 యూనిట్ల సేల్స్‌తో 31 శాతం వృద్ధిని సాధించింది. మార్కెట్లో ఎస్‌యూవీల ట్రెండ్ నడుస్తున్నా, వ్యాగన్ ఆర్ మాత్రం ఇప్పటికీ మోస్ట్ డిపెండబుల్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది.

35
ఫ్యామిలీ కార్లు, ఎస్‌యూవీల జోరు.. ఎర్టిగా, స్కోర్పియో హల్‌చల్
Image Credit : Mahindra Website

ఫ్యామిలీ కార్లు, ఎస్‌యూవీల జోరు.. ఎర్టిగా, స్కోర్పియో హల్‌చల్

కుటుంబ సమేతంగా ప్రయాణించేందుకు ఇష్టపడే వారికి మారుతి ఎర్టిగా బెస్ట్ ఛాయిస్‌గా మారింది. ఈ అఫర్డబుల్ 7 సీటర్ కారు జూన్ 2026లో 16,111 యూనిట్ల సేల్స్‌తో ఐదో స్థానంలో నిలిచింది. గతేడాది జూన్ సేల్స్ 14,151 యూనిట్లతో పోలిస్తే ఇది 14 శాతం గ్రోత్ చూపించింది. ఆ తర్వాత ఆరో స్థానంలో ఉన్న మారుతి స్విఫ్ట్ కారు 15,215 యూనిట్ల అమ్మకాలతో 15 శాతం వృద్ధిని నమోదు చేసింది.

మరోవైపు ఎస్‌యూవీ మార్కెట్లో మహీంద్రా కంపెనీ తన పట్టును మరింత పెంచుకుంది. మహీంద్రా కంపెనీకి చెందిన స్కోర్పియో కారు అత్యధికంగా అమ్ముడై ఏడో స్థానంలో నిలిచింది. జూన్ 2026లో స్కోర్పియో ఏకంగా 14,097 యూనిట్లు అమ్ముడైంది. ఇది గతేడాది కంటే 11 శాతం ఎక్కువ. అలాగే అడ్వెంచర్ ప్రియుల ఫేవరెట్ కార్ అయిన మహీంద్రా థార్ 10,669 యూనిట్ల సేల్స్‌తో 11వ స్థానాన్ని దక్కించుకుంది.

థార్ అమ్మకాల్లో 12 శాతం వృద్ధి కనిపించింది. వీటితో పాటు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఏకంగా 42 శాతం వృద్ధితో 10,063 యూనిట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ 9,244 యూనిట్లతో, బొలెరో 9,115 యూనిట్ల సేల్స్‌తో టాప్ 25లో నిలిచాయి.

45
హ్యుందాయ్, కియా, టొయోటా సేల్స్ రిపోర్ట్ ఇదే
Image Credit : Hyundai website

హ్యుందాయ్, కియా, టొయోటా సేల్స్ రిపోర్ట్ ఇదే

హ్యుందాయ్ కంపెనీ విషయానికి వస్తే, జూన్ 2026లో హ్యుందాయ్ వెన్యూ ఆ కంపెనీ తరపున బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. ఈ కారు 10,776 యూనిట్ల అమ్మకాలతో పదో స్థానంలో నిలిచింది. గతేడాది జూన్ సేల్స్ 6,858 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 57 శాతం భారీ వృద్ధిని సాధించింది. అలాగే హ్యుందాయ్ ఎక్స్టర్ కూడా 8,154 యూనిట్ల సేల్స్, 39 శాతం గ్రోత్‌తో లిస్టులో చోటు సంపాదించుకుంది. మైక్రో, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై హ్యుందాయ్ పెట్టిన ఫోకస్ బాగా వర్కౌట్ అవుతోందని ఈ నంబర్స్ చెప్తున్నాయి.

ఇక కియా కంపెనీ కూడా కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మళ్లీ పుంజుకుంది. కియా సెల్టోస్ 9,654 యూనిట్లతో ఏకంగా 85 శాతం భారీ వృద్ధిని సాధించి 17వ స్థానంలో నిలిచింది. కియా సోనెట్ కారు కూడా 9,231 యూనిట్ల అమ్మకాలతో 39 శాతం గ్రోత్ సాధించింది. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా 9,104 యూనిట్ల సేల్స్‌తో 22 శాతం పెరిగింది. హైబ్రిడ్ ఎస్‌యూవీలకు ఉన్న డిమాండ్ వల్లే హైరైడర్ ఇంతలా అమ్ముడవుతోంది. అయితే టొయోటా ఇన్నోవా + హైక్రాస్ కంబైన్డ్ సేల్స్ మాత్రం కొంచెం తగ్గాయి. జూన్ 2025లో 8,802 యూనిట్లు ఉన్న సేల్స్, జూన్ 2026 నాటికి 17 శాతం తగ్గి 7,332 యూనిట్లకు పడిపోయాయి. అయినప్పటికీ ప్రీమియం ఎమ్‌పీవీ సెగ్మెంట్లో ఇన్నోవా టాప్‌లోనే ఉంది.

55
మార్కెట్లో కీలక మార్పులు: కొన్ని కార్లు డౌన్, కొన్ని అప్
Image Credit : X/Kia_Worldwide

మార్కెట్లో కీలక మార్పులు: కొన్ని కార్లు డౌన్, కొన్ని అప్

ఈ జూన్ 2026 సేల్స్ రిపోర్ట్ ద్వారా భారత ఆటోమొబైల్ మార్కెట్ ట్రెండ్ స్పష్టంగా అర్థమవుతోంది. దేశంలో ప్రస్తుతం కాంపాక్ట్, సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. పంచ్, నెక్సాన్, ఫ్రాంక్స్, వెన్యూ, థార్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, బ్రెజ్జా, సోనెట్, హైరైడర్, గ్రాండ్ విటారా, ఎక్స్టర్ లాంటి కార్లు ఈ లిస్టులో మెజారిటీ వాటాను ఆక్రమించాయి.

అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ మారుతి సుజుకి బ్రెజ్జా అమ్మకాలు భారీగా పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే బ్రెజ్జా సేల్స్ 31 శాతం తగ్గి 9,939 యూనిట్లకు పరిమితమయ్యాయి. మారుతి ఆల్టో మాత్రం 106 శాతం ఊహించని గ్రోత్‌తో 10,388 యూనిట్లు అమ్ముడైంది. కొత్తగా వచ్చిన మారుతి సుజుకి విక్టోరిస్ 10,035 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. టాటా టియాగో కూడా 7,329 యూనిట్ల సేల్స్ (22 శాతం గ్రోత్) సాధించి 25వ స్థానంలో నిలిచింది. మొత్తానికి ఈ జూన్ నెలలో టాటా పంచ్, నెక్సాన్ జోడీ ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేశాయని చెప్పొచ్చు.

Best Selling Cars India June 2026 : టాప్ 10 లిస్ట్ 

  1. టాటా పంచ్
  2. టాటా నెక్సాన్
  3. మారుతి సుజకి డిజైర్
  4. మారుతి సుజుకి వాగన్ ఆర్
  5. మారుతి సుజుకి ఎర్టిగా
  6. మారుతి సుజుకి స్విఫ్ట్
  7. మహింద్రా స్కార్పియో
  8. మారుతి సుజుకి బలెనో
  9. మారుతి సుజుకి ఫ్రాంక్స్
  10. హుందాయ్ వెన్యూ

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tata Motors Festive Sale: పండుగ ఆఫర్ల మోత.. టాటా కార్ల పై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Recommended image2
Best SUVs Under 8 Lakhs: బెస్ట్ మైలేజ్, సేఫ్టీలో టాప్.. రూ. 8 లక్షల లోపు బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే
Recommended image3
ఏ కారు టైర్లలో ఎంత గాలి ఉండాలి? సరైన ప్రెషర్ ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
Water Powered Scooter: పెట్రోల్ తో పనిలేదు.. ఛార్జింగ్ అవసరం లేదు.. నీటితో నడిచే క్రేజీ స్కూటర్ వచ్చేసింది !
Recommended image2
Hidden Waterfall: బొగత కంటే క్రేజీ స్పాట్.. అడవిలో దాగున్న అద్భుత జలపాతం.. అడ్వెంచర్ లవర్స్‌కు పూనకాలే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved