- Home
- Automobile
- Cars
- Renault Duster 2026 : లుక్ అదిరింది.. ఫీచర్లు మతిపోగొడుతున్నాయి.. మైలేజ్ మాస్టర్ కొత్త రెనాల్ట్ డస్టర్
Renault Duster 2026 : లుక్ అదిరింది.. ఫీచర్లు మతిపోగొడుతున్నాయి.. మైలేజ్ మాస్టర్ కొత్త రెనాల్ట్ డస్టర్
Renault Duster 2026 : సరికొత్త రెనాల్ట్ డస్టర్ 2026 భారత్‌లో ఘనంగా విడుదలైంది. హైబ్రిడ్ ఇంజిన్, ఫైటర్-జెట్ ఇంటీరియర్, గూగుల్ టెక్నాలజీ, 7 ఏళ్ల వారంటీతో వచ్చిన ఈ ఎస్‌యూవీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రెనాల్ట్ డస్టర్ 2026 వచ్చేసింది: డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే !
భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన ఐకానిక్ ఎస్‌యూవీ డస్టర్ మళ్లీ వచ్చేసింది. సోమవారం రెనాల్ట్ (Renault) కంపెనీ తన కొత్త తరం డస్టర్ 2026ను అధికారికంగా విడుదల చేసింది. తన అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో కియా, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీనిచ్చేందుకు డస్టర్ సిద్ధమైంది.
తిరిగొచ్చిన ఎస్‌యూవీ రారాజు: రోడ్లపై ఇక డస్టర్ జాతరే !
రెనాల్ట్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ డస్టర్ న్యూ జనరేషన్ మోడల్‌ను చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఎంతో ఘనంగా ఆవిష్కరించింది. ఈ మెగా ఈవెంట్‌లో గ్యాంగ్ ఆఫ్ డస్టర్స్ కమ్యూనిటీతో పాటు దాదాపు 15,000 మందికి పైగా పాల్గొన్నారు. పాత డస్టర్ రఫ్-అండ్-టఫ్ ను కొనసాగిస్తూనే, ఆధునిక భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దీనిని పూర్తిగా కొత్త రూపంలో తీర్చిదిద్దారు.
మేడ్ ఫర్ ఇండియా.. 5 స్టార్ సేఫ్టీతో రెనాల్ట్ డస్టర్ 2026
కొత్త రెనాల్ట్ డస్టర్ 2026ను ప్రత్యేకంగా భారతీయ రోడ్లు, వినియోగదారుల కోసం తయారు చేశారు. ఇందులో 90 శాతం విడిభాగాలను స్థానికంగానే డిజైన్ చేయడం విశేషం. ఈ కారును రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (RGMP) పై ఆధారపడి నిర్మించారు. కఠినమైన పరిస్థితుల్లో కూడా తట్టుకునేలా దీనిని పరీక్షించారు. ప్రయాణికులకు అత్యుత్తమ భద్రత కల్పించేలా, 5 స్టార్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని ఇంజనీరింగ్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
రెనాల్ట్ డస్టర్ 2026 లో పవర్-ఫుల్ ఇంజిన్, హైబ్రిడ్ టెక్నాలజీ
ఇంజిన్ పనితీరు విషయంలో రెనాల్ట్ ఈసారి భారీ మార్పులే చేసింది. ఇందులో TCe 160, TCe 100 అనే రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్లను అందించారు. అయితే, ఇందులో ప్రధాన ఆకర్షణ భారతదేశంలో తొలిసారిగా పరిచయం చేస్తున్న E-Tech 160 స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్. ఇది 1.8 లీటర్ ఇంజిన్, 1.4 kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల సిటీ డ్రైవింగ్‌లో 80 శాతం వరకు ఎలక్ట్రిక్ మోడ్ (EV mode) లోనే ప్రయాణించవచ్చు. దీనివల్ల ఈ విభాగంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారుగా ఇది నిలవనుంది.
రెనాల్ట్ డస్టర్ 2026 లో ఫైటర్-జెట్ ఇన్‌స్పైర్డ్ ఇంటీరియర్
రెనాల్ట్ డస్టర్ 2026 క్యాబిన్ డిజైన్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దీనిని ఫైటర్ జెట్ నుండి ప్రేరణ పొంది, పూర్తిగా డ్రైవర్ సెంట్రిక్) విధానంలో రూపొందించారు.
• ప్రీమియం మౌంటెన్ జేడ్ లెదర్ సీట్లు.
• ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్‌రూఫ్.
• సాఫ్ట్-టచ్ డ్యాష్‌బోర్డ్.
ఇంటీరియర్‌లో ఉపయోగించిన పసుపు రంగు కుట్లు, కార్బన్ ఫినిష్ క్యాబిన్‌కు ఒక లగ్జరీ లుక్‌ని ఇస్తాయి.
రెనాల్ట్ డస్టర్ 2026 డిజైన్, టెక్నాలజీ వివరాలు ఇవే
డిజైన్ పరంగా చూస్తే, కొత్త డస్టర్ మునుపటి కంటే బోల్డ్, మస్క్యులర్‌గా కనిపిస్తుంది. ఇందులో 212 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో పాటు, 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ దీనికి కొత్త అందాన్ని తెచ్చాయి. మౌంటెన్ జేడ్ గ్రీన్ కలర్ దీనికి ప్రత్యేక ఆకర్షణ.
సాంకేతికత విషయానికి వస్తే, ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా Google built in ఫీచర్‌తో 25.65 సెం.మీ OpenR లింక్ మల్టీమీడియా సిస్టమ్‌ను అందించారు. గూగుల్ మ్యాప్స్, వాయిస్ అసిస్టెంట్, ప్లే స్టోర్ సేవలు నేరుగా ఇందులో లభిస్తాయి. భవిష్యత్తులో గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమిని అప్డేట్ కూడా రానుంది.
రెనాల్ట్ డస్టర్ 2026 వారంటీ, బుకింగ్ వివరాలు
కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి రెనాల్ట్ ఫరెవర్ ప్రోగ్రామ్ కింద 7 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం R Pass ద్వారా రూ. 21,000 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ధరలను మార్చి 2026 మధ్యలో ప్రకటిస్తారు. ఏప్రిల్ 2026 నుండి డెలివరీ మొదలవుతుంది. అయితే, హైబ్రిడ్ మోడల్ కోసం దీపావళి 2026 వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

