Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!
2025లో అత్యధిక జీతం తీసుకునే టెక్ సీఈఓలు ఎవరో తెలుసా? ఎలాన్ మస్క్, టిమ్ కుక్ లే కాదు భారత సంతతి సీఈఓలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. వారి జీతాలెంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
- FB
- TW
- Linkdin
- GNFollow Us

టెక్ సీఈవోల శాలరీ
2025 టెక్ ఇయర్ గా చరిత్రలో నిలిచిపోనుంది... ఎందుకంటే ప్రపంచ గతిని మార్చే ఆవిష్కరణలు ఈ సంవత్సరంలోనే వచ్చాయి. ఈ టెక్ జమానాలో చాలా ముఖ్యమైనదిగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ (AI), ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాలతో పాటు ఎలక్ట్రానిక్స్ అభివృద్ధితో అగ్ర కంపెనీల సీఈఓలు ఊహించని జీతాలు అందుకుంటున్నారు. 'అనలిటిక్స్ ఇన్‌సైట్' డేటా ప్రకారం ఈ ఏడాది అత్యధిక జీతం తీసుకునే టెక్ సీఈఓల జాబితా ఇదిగో…
ఎలాన్ మస్క్ శాాలరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు...
గ్లోబల్ దిగ్గజ కంపెనీలు టెస్లా, స్పేస్‌ఎక్స్ ల అధినేత ఎలాన్ మస్క్ 2025 లో అత్యధిక జీతం తీసుకునే సీఈఓల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం ఆదాయం సుమారు 23.5 బిలియన్ డాలర్లు... అంటే ఇండియన్ రూపాయల్లో రూ.1.9 లక్షల కోట్లకు పైనే. ఆయన ఆదాయం రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు.... దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలోనూ ఆయన ఆగ్రస్థానంలో ఉన్నారు.
టిమ్ కుక్ శాలరీ ఎంత..?
ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన యాపిల్ కంపెనీని నడిపిస్తున్న టిమ్ కుక్ ఈ జాబితాలో కీలక స్థానంలో ఉన్నారు. ఆయన వార్షిక ఆదాయం, స్టాక్ ఆప్షన్‌లు సుమారు 770 మిలియన్ డాలర్ల వరకు ఉన్నాయని డేటా చెబుతోంది.
ఎన్విడియా ఆదాయం
ఎన్విడియా (NVIDIA) సీఈఓ జెన్సన్ హువాంగ్ AI విప్లవంతో భారీ లాభం పొందారు. ఆయన కంపెనీ చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో, ఆయన ఆదాయం సుమారు 561 మిలియన్ డాలర్లకు పెరిగింది.
మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవో ఆదాయం
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత్‌కు గర్వకారణంగా నిలుస్తున్నారు. సత్య నాదెళ్ల 309 మిలియన్ డాలర్లు, సుందర్ పిచాయ్ 280 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఈ జాబితాలో ఉన్నారు.
నెట్ ఫ్లిక్స్ సీఈవో ఆదాయమెంత..?
నెట్‌ఫ్లిక్స్ రీడ్ హేస్టింగ్స్ 453 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఈ జాబితాలో ఉన్నారు. టెక్, మీడియా రంగాల్లోని మార్పులు వీరికి భారీ విజయాన్ని అందించాయి. 2025 జాబితా టెక్ రంగం వేగవంతమైన వృద్ధిని చూపిస్తుంది.

