- Home
- Careers
- Constable Recruitment: 9 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. అప్లై చేసుకోండిలా!
Constable Recruitment: 9 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. అప్లై చేసుకోండిలా!
CRPF Constable Recruitment 2026: పదవ తరగతి అర్హతతో సీఆర్‌పీఎఫ్‌లో 9195 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలా అప్లై చేసుకోవాలి? లాస్ట్ డేట్ ఎప్పుడు? పరీక్ష విధానం ఏమిటి? సహా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. సీఆర్‌పీఎఫ్ నుంచి భారీ కానిస్టేబుల్ నోటిఫికేషన్
కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలనే కల ఉన్న యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. టెక్నికల్, ట్రేడ్స్‌మన్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం టెన్త్ క్లాస్ పాసైతే చాలు, కేంద్ర బలగాలలో భాగస్వాములు కావచ్చు.
సీఆర్‌పీఎఫ్ జాబ్స్: ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి?
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9195 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా రెండు విభాగాలు ఉన్నాయి..
• కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్, టెక్నికల్): 9175 పోస్టులు
• కానిస్టేబుల్ (పయనీర్ వింగ్): 20 పోస్టులు
డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, మోచి, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, కుక్, వాటర్ క్యారియర్, బార్బర్ వంటి వివిధ రకాల ట్రేడ్స్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అర్హతలు ఏమిటి?
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి పాసై ఉండాలి.
• డ్రైవర్ పోస్టులకు: 10వ తరగతితో పాటు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. వయస్సు 21 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
• ఇతర పోస్టులకు: టెన్త్ క్లాస్, సంబంధిత ట్రేడ్‌లో నైపుణ్యం ఉండాలి. వయస్సు 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).
సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
పోటీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి..
1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): ఇది ఆన్‌లైన్ పరీక్ష.
2. శారీరక సామర్థ్య పరీక్ష (PET) & ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST): ఎత్తు, ఛాతీ కొలతలు, పరుగు పందెం నిర్వహిస్తారు.
3. ట్రేడ్ టెస్ట్: అభ్యర్థులు ఎంచుకున్న ట్రేడ్‌లో వారి నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
4. మెడికల్ ఎగ్జామినేషన్: తుది ఎంపికకు ముందు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
సీఆర్‌పీఎఫ్ జాబ్స్ : ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది?
రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
• జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 25 ప్రశ్నలు
• జనరల్ నాలెడ్జ్ & అవేర్నెస్: 25 ప్రశ్నలు
• ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్: 25 ప్రశ్నలు
• ఇంగ్లీష్ లేదా హిందీ: 25 ప్రశ్నలు
అయితే, ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సమాధానం గుర్తించాలి.
సీఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ : ఎక్కడ అప్లై చేయాలి?
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
• దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 20
• చివరి తేదీ: మే 19
• ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ crpf.gov.in ను చూడండి.

