- Home
- Jobs
- SSC CGL 2026 : నిరుద్యోగులకు గడ్ న్యూస్.. 12,000 పైగా ప్రభత్వ ఉద్యోగాలు .. జీతం చూస్తే మైండ్ బ్లాకే
SSC CGL 2026 : నిరుద్యోగులకు గడ్ న్యూస్.. 12,000 పైగా ప్రభత్వ ఉద్యోగాలు .. జీతం చూస్తే మైండ్ బ్లాకే
SSC CGL 2026: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 12,256 గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి SSC CGL 2026 నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు మీకోసం.

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో బంపర్ ఆఫర్
డిగ్రీ పూర్తి చేసి, లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రతి ఏటా నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) 2026 ఎగ్జామ్ అధికారిక నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న బిగ్గెస్ట్ జాబ్ అలర్ట్స్‌లో ఇది ఒకటి. దీని ద్వారా దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు, ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు.
12 వేలకు పైగా ఖాళీలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 12,256 ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం ప్రకటించిన ఈ ఖాళీలు తాత్కాలికమైనవని, భవిష్యత్తులో ఇవి ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉందని ఎస్‌ఎస్‌సీ స్పష్టం చేసింది.
కేటగిరీల వారీగా, పోస్టుల వారీగా పూర్తి వివరాలను త్వరలోనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), ఇన్‌స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వంటి క్రేజీ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.
ఆన్‌లైన్ అప్లికేషన్: ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మే 21, 2026 నుండి ప్రారంభమైంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తే సర్వర్ డౌన్ అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం బెస్ట్. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 22, 2026 రాత్రి 11 గంటల వరకు వుంటుంది. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జూన్ 23, 2026 రాత్రి 11 గంటల వరకు. అప్లికేషన్ కరెక్షన్ విండో జూన్ 29 నుండి జూలై 1, 2026 వరకు వుంటుంది. టైర్-I పరీక్ష (CBT) ఆగస్టు – సెప్టెంబర్ 2026 మధ్య, టైర్-II పరీక్ష (CBT) డిసెంబర్ 2026 వుంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది?
ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వాలంటే రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్షలను క్లియర్ చేయాల్సి ఉంటుంది.
• టైర్-I పరీక్ష: ఇది మొదటి దశ. ఆగస్టు లేదా సెప్టెంబర్ 2026లో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇది క్వాలిఫైయింగ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది.
• టైర్-II పరీక్ష: టైర్-I లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డిసెంబర్ 2026లో టైర్-II ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
స్మార్ట్‌గా అప్లై చేసుకోండిలా..
ఎస్‌ఎస్‌సీ పోర్టల్ ద్వారా కేవలం ఆన్‌లైన్ మోడ్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్‌గా ఇలా పూర్తి చేయండి:
1. మొదట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
2. హోమ్‌పేజీలో కనిపించే 'SSC CGL 2026' అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
3. మీరు గతంలో ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోకపోతే, మొదట ‘వన్-టైమ్ రిజిస్ట్రేషన్’ పూర్తి చేయాల్సి ఉంటుంది.
4. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయండి.
5. మీ లేటెస్ట్ ఫొటో, సిగ్నేచర్ స్కాన్ చేసిన కాపీలను అడిగిన సైజులో అప్‌లోడ్ చేయండి.
6. చివరగా ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్, కార్డ్ లేదా యూపీఐ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్‌మిట్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఒక ప్రింటౌట్ తీసి పెట్టుకోండి.
అప్లై చేసే ముందు ఇవి గమనించండి
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే, దరఖాస్తు చేసుకునే ముందే మీ వయోపరిమితి, నిర్దిష్ట పోస్టులకు కావలసిన ప్రత్యేక విద్యార్హతలు, పరీక్ష నిబంధనలను నోటిఫికేషన్ పిడిఎఫ్ చూసి క్షుణ్ణంగా చదువుకోవాలని ఎస్‌ఎస్‌సీ సూచించింది. రూల్స్ కరెక్ట్‌గా ఫాలో అవ్వకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

