- Home
- Business
- Best Mileage Scooter: రూ.74 వేలకే 62 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఈ సూపర్ స్కూటర్ ఫీచర్స్ అద్భుతం
Best Mileage Scooter: రూ.74 వేలకే 62 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఈ సూపర్ స్కూటర్ ఫీచర్స్ అద్భుతం
లోకల్ తిరగడానికి బెస్ట్ మైలేజ్ స్కూటర్ కోసం చూస్తున్నారా? టీవీఎస్ అందిస్తోంది స్కూటీ జెస్ట్ 110. స్టైలిష్ డిజైన్ తో సిటీలో తిరగడానికి కంఫర్ట్‌బుల్‌గా ఉండేలా టీవీఎస్ కంపెనీ ఈ స్కూటర్ ని తయారు చేసింది. దీని ఫీచర్స్, మైలేజ్, ధర తెలుసుకుందామా?

టీవీఎస్ కంపెనీ నుంచి చాలా రకాల బెస్ట్ వెహికల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. వివిధ వర్గాల ప్రజలకు అవసరమైన వెహికల్స్ ని టీవీఎస్ అందించింది. మహిళలకు, యువతకు, ఫ్యామిలీ మెన్ కి, పెద్ద వాళ్లకు ఇలా రకరకాల కేటగిరీల్లో డిఫెరెంట్ మోడల్స్ తీసుకొచ్చింది.
ఇప్పుడు రిలీజ్ చేసిన స్కూటీ జెస్ట్ 110 స్కూటర్ మాత్రం సిటీలో తిరగడానికి బాగుంటుంది. తేలికైన, స్టైలిష్ డిజైన్ తో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ ఇది. మీరు స్టూడెంట్ అయినా, ఉద్యోగం చేసేవారైనా, సింపుల్‌గా రైడ్ చేయాలనుకుంటే ఈ స్కూటర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని డిజైన్, కంఫర్టబుల్ సీటు వల్ల జర్నీ చాలా సాఫీగా సాగుతుంది.
టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 స్కూటర్
స్కూటీ జెస్ట్ 110లో 109.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 7,500 rpm వద్ద 7.8 PS పవర్, 5,500 rpm వద్ద 8.8 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 62 kmpl. ట్రాఫిక్‌లో వెళ్లడానికి కూడా ఇది చాలా బాగుంటుంది.
ఇది కూడా చదవండి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ షురూ.. ధర రూ.79,999 మాత్రమే
స్కూటీ జెస్ట్ 110 స్పెసిఫికేషన్లు
స్కూటీ జెస్ట్ 110 స్టైలిష్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్కూటర్ డిఫరెంట్ కలర్స్ లో లభిస్తుంది. దీనిలో 19 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ ఇంకా కంఫర్టబుల్ రైడ్ కోసం బ్యాలెన్స్డ్ సస్పెన్షన్ కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి రూ.100 ఖర్చుతో 500 కి.మీ ప్రయాణించొచ్చు: అల్ట్రావైలెట్ టెస్సెరక్ట్ EV ఫీచర్స్ అదుర్స్
టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 ధర
దీని సీటు ఎత్తు 760 mm మాత్రమే. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.74,000 (ఎక్స్-షోరూమ్). ఇంకా ఇది 62 కి.మీ. మైలేజ్ కూడా ఇస్తుంది.