రూ.100 ఖర్చుతో 500 కి.మీ ప్రయాణించొచ్చు: అల్ట్రావైలెట్ టెస్సెరక్ట్ EV ఫీచర్స్ అదుర్స్
Ultraviolette Tesseract EV: మార్కెట్ లోకి రిలీజ్ అయిన 14 రోజుల్లో 50,000 బుకింగ్‌లతో అల్ట్రా వైలెట్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఆ కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ ఇంతలా బుకింగ్స్ అవడం విశేషం. ఈ స్కూటర్ విశేషాలు ఏంటో తెలుసుకుందామా?

అల్ట్రా వైలెట్ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘టెస్సెరక్ట్’ ప్రారంభించిన వెంటనే మార్కెట్ ను ఆకర్షించింది. ఈ స్కూటర్ బుకింగ్స్ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 50,000 బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. కేవలం 14 రోజుల్లోనే ఇన్ని బుకింగ్‌లు రావడానికి ఆ స్కూటర్ ప్రత్యేకతలే కారణం.
ఇంకో విషయం ఏంటంటే బుకింగ్స్ ప్రారంభించిన 48 గంటల్లో 20000 బుకింగ్‌లను సాధించింది. టెస్సెరక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.20 లక్షల ప్రారంభమవుతుంది.
ధరలో మార్పు?
ఈ వెహికల్ కు వచ్చిన డిమాండ్ తో కంపెనీ మొదటి 50 వేల బుకింగ్‌లకు, ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.20 లక్షలుగా నిర్ణయించింది. ఆ తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.45 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ కి డిమాండ్ పెరుగుతున్నందు వల్ల ఇప్పుడు దాని ధరలో కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ కొత్త స్కూటర్ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
బ్యాటరీ, మైలేజ్
ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేస్తే 261 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 20 హెచ్‌పి పవర్‌ను అందించే విధంగా ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఈ స్కూటర్ 0 నుండి 60 కిమీ వేగాన్ని 2.9 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 125 కిమీ. ఈ స్కూటర్ రూ.100 ఖర్చుతో 500 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.
అల్ట్రా వైలెట్ టెస్సెరక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ రాడార్, డాష్‌క్యామ్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యుద్ధ విమానాల ద్వారా ప్రేరణ పొంది రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
ఫీచర్లు
కొత్త టెస్సెరక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 7 అంగుళాల టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ ఉందిజ దీనితో పాటు 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 14 అంగుళాల వీల్స్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఓవర్‌టేక్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓలా, బజాజ్ చేతక్, ఏథర్, టి.వి.ఎస్ కంపెనీ ఈవీలకు అల్ట్రా వైలెట్ టెస్సెరక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ నిజమైన పోటీదారుగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి రూ.68,000కే 65 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్.. ఈఎంఐ కేవలం రూ.2,300