Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ షురూ.. ధర రూ.79,999 మాత్రమే
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మనదేశంలో S1 Gen 3 స్కూటర్ల డెలివరీని స్టార్ట్ చేసింది. ఈ స్కూటర్లు చాలా బ్యాటరీ ఆప్షన్లు, స్పీడ్ లిమిట్లతో దొరుకుతాయి. కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా ఉంటాయి.

ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో టాప్ కంపెనీ అయిన ఓలా (Ola), మనదేశంలో దాని కొత్త S1 Gen 3 స్కూటర్ల డెలివరీని స్టార్ట్ చేసింది. రూ.79,999 స్టార్టింగ్ ధరతో వచ్చిన ఈ బేసిక్ మోడల్లో 2kWh బ్యాటరీ ఉంది. 5.3kWh బ్యాటరీతో వచ్చే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.1,69,999గా ఉంది. ఓలా కంపెనీ S1 Gen 3లో నాలుగు రకాలు రిలీజ్ చేసింది.
S1 Gen 3 స్కూటర్లు 4kWh, 3kWh, 2kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తున్నాయి. S1 Pro+ మోడల్ అయితే 5.3kWh, 4kWh బ్యాటరీ ప్యాక్లతో దొరుకుతుంది. ఈ స్కూటర్లన్నీ 13kW మోటార్ తో పనిచేస్తాయి. మంచి బ్యాటరీ ప్యాకేజ్ ఉండటం వల్ల పర్ఫార్మెన్స్ బాగుంటుంది. S1 Pro+ మోడల్ స్కూటర్లు మాక్సిమం 141 kmph, 128 kmph స్పీడ్ తో వెళ్తాయి. 0 నుంచి 40 kmph స్పీడ్ ను కేవలం 2.1, 2.3 సెకన్లలో అందుకుంటాయి.
ఓలా S1 Gen 3 స్కూటర్లు వేరియంట్ బట్టి పర్ఫార్మెన్స్ ఉంటుంది. 5.3kWh వెర్షన్ 320 IDC-సర్టిఫైడ్ మోడల్ అయితే ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 320 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. 4kWh వేరియంట్ అయితే 242 కి.మీ. వరకు వెళ్లగలదు. ఇందులో హైపర్, స్పోర్ట్స్, నార్మల్, ఈకో అనే నాలుగు రైడింగ్ మోడ్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి రూ.68,000కే 65 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్.. ఈఎంఐ కేవలం రూ.2,300
11kW మిడ్ డ్రైవ్ మోటార్ తో పనిచేసే S1 Pro స్కూటర్ 4kWh, 3kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఇవి మాక్సిమం 125 kmph, 117 kmph స్పీడ్ తో ప్రయాణించగలవు. ఈ రెండు మోడల్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే 242 km, 176 km దూరం ప్రయాణించగలవు. S1 Pro మోడల్స్ పర్ఫార్మెన్స్, ఎఫిషియెన్సీ మధ్య బ్యాలెన్స్ కోరుకునే రైడర్ల కోసం డిజైన్ చేశారు. ఇవి రెండు 11kW మోటార్ తో పనిచేస్తాయి. ఇవి కేవలం 2.7 సెకన్లలో 0-40 kmph స్పీడ్ ను అందుకుంటాయి.
ఇక స్టాండర్డ్ S1 X వేరియంట్ విషయానికొస్తే ఈ మోడల్ 4kWh, 3kWh, 2kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఇవన్నీ 7kW మోటార్తో కనెక్ట్ అయి ఉంటాయి. కాన్ఫిగరేషన్ ను బట్టి ఇది వరుసగా 123 kmph, 115 kmph, 101 kmph మాక్సిమం స్పీడ్ తో ప్రయాణించగలవు. ఓలా కంపెనీ నుంచి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెషాలిటీ ఏంటంటే ఇవి వేర్వేరు పర్ఫార్మెన్స్, రేంజ్ ఆప్షన్లను కలిగి ఉంటాయి. కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా వీటిని ఉపయోగించుకోవడానికి వీలుంటుంది.
ఇది కూడా చదవండి రూ.100 ఖర్చుతో 500 కి.మీ ప్రయాణించొచ్చు: అల్ట్రావైలెట్ టెస్సెరక్ట్ EV ఫీచర్స్ అదుర్స్