MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Business
  • Top 10 Strongest Currencies : డాలర్ కాదు.. ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏది?

Top 10 Strongest Currencies : డాలర్ కాదు.. ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏది?

Top 10 Strongest Currencies : కువైట్ దీనార్ ముందు అమెరికా డాలర్ ఎందుకు వెనకబడింది? ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏది? టాప్ 10 కరెన్సీల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 20 2026, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఒక్క నోటుతో లక్షాధికారి అవ్వొచ్చు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ డీటెయిల్స్ ఇవే
Image Credit : Pixabay

ఒక్క నోటుతో లక్షాధికారి అవ్వొచ్చు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ డీటెయిల్స్ ఇవే

అంతర్జాతీయ మార్కెట్‌లో ఏ వస్తువు కొనాలన్నా, దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు జరగాలన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది అమెరికా డాలర్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తి డాలర్‌కు ఉందని అందరూ భావిస్తారు. భారత రూపాయి విలువతో పోల్చినప్పుడు డాలర్ ఎప్పుడూ పైచేయి సాధిస్తూనే ఉంటుంది. తాజా గణాంకాల ప్రకారం, భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 92.50 నుండి 93.14 రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది. అయితే, డాలర్‌ కంటే కూడా అత్యంత బలమైన కరెన్సీలు ప్రపంచంలో చాలా ఉన్నాయని మీకు తెలుసా? ప్రపంచంలోని టాప్ 10 అత్యంత బలమైన కరెన్సీల జాబితాను చూస్తే అమెరికా డాలర్ పదో స్థానంలో నిలవడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అగ్రస్థానంలో కువైట్ దీనార్.. ఎందుకంత పవర్?
Image Credit : Gemini

అగ్రస్థానంలో కువైట్ దీనార్.. ఎందుకంత పవర్?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత బలమైన కరెన్సీగా కువైట్ దీనార్ మొదటి స్థానంలో నిలిచింది. ఒక కువైట్ దీనార్ విలువ ఏకంగా 3.26 అమెరికా డాలర్లతో సమానం. అంటే డాలర్ కంటే దీనార్ మూడు రెట్లు ఎక్కువ విలువ కలిగి ఉంది. కువైట్ దేశం వద్ద ఉన్న అపారమైన చమురు నిల్వలు, బలమైన విదేశీ మారక నిల్వలు ఆ కరెన్సీకి ఈ స్థాయి బలాన్ని ఇచ్చాయి. ప్రపంచ చమురు ఎగుమతుల్లో కువైట్ కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత స్థిరంగా ఉండటం దీనికి ప్రధాన కారణం.

36
మిడిల్ ఈస్ట్ దేశాల హవా
Image Credit : ANI

మిడిల్ ఈస్ట్ దేశాల హవా

ప్రపంచ కరెన్సీ మార్కెట్‌లో మిడిల్ ఈస్ట్ దేశాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి మూడు స్థానాల్లోనూ అరబ్ దేశాల కరెన్సీలే ఉన్నాయి. కువైట్ తర్వాత బహ్రెయిన్ దీనార్ రెండో స్థానంలో నిలిచింది. ఒక బహ్రెయిన్ దీనార్ విలువ 2.65 అమెరికా డాలర్లకు సమానం. ఇక మూడో స్థానంలో ఒమన్ రియాల్ ఉంది. దీని విలువ 2.60 అమెరికా డాలర్లుగా ఉంది. ఈ దేశాల్లో ఉన్న చమురు, సహజ వాయువు నిల్వలే వీటి కరెన్సీలు అంతర్జాతీయ స్థాయిలో బలంగా ఉండటానికి కారణం.

46
డాలర్ కంటే ముందే ఉన్న ఇతర దేశాలు
Image Credit : our own

డాలర్ కంటే ముందే ఉన్న ఇతర దేశాలు

కేవలం కువైట్, బహ్రెయిన్ మాత్రమే కాదు, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా కరెన్సీలు కూడా డాలర్‌తో పోలిస్తే మెరుగైన స్థానంలోనే ఉన్నాయి. ఒక ఖతార్ రియాల్ విలువ 0.27 డాలర్లు, సౌదీ రియాల్ విలువ 0.27 డాలర్లు, ఎమిరాటీ దిర్హామ్ విలువ 0.27 డాలర్లుగా ఉంది. అయితే, వాల్యూ పరంగా ఇవి డాలర్ కంటే తక్కువగా కనిపించినా, మార్కెట్ స్థిరత్వం, ఆర్ధిక వ్యవస్థ పరంగా డాలర్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. ముఖ్యంగా ఒమన్ రియాల్ 2.60 డాలర్లతో అత్యంత బలమైన జాబితాలో టాప్ 3లో కొనసాగుతోంది.

56
అమెరికా డాలర్ 10వ స్థానంలో ఎందుకు?
Image Credit : our own

అమెరికా డాలర్ 10వ స్థానంలో ఎందుకు?

వ్యాపార పరంగా డాలర్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కరెన్సీ. ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో దాదాపు 85 శాతం లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. అందుకే దీనిని గ్లోబల్ కరెన్సీ అంటారు. కానీ, ఒక యూనిట్ కరెన్సీ విలువను లెక్కించినప్పుడు డాలర్ టాప్ 10 జాబితాలో చివరన అంటే 10వ స్థానంలో ఉంది. కువైట్, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాల కరెన్సీల విలువ డాలర్ కంటే చాలా ఎక్కువ. అయినప్పటికీ, అంతర్జాతీయ చెల్లింపుల్లో డాలర్ కు ఉన్న ఆధిపత్యం వేరు.

66
ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఇదే
Image Credit : our own

ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఇదే

ఒకవైపు కువైట్ దీనార్ అత్యంత బలంగా ఉంటే, మరోవైపు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీగా ఇరాన్ రియాల్ నిలిచింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికా డాలర్ విలువ ఇరాన్ రియాల్స్‌లో చూస్తే సుమారు 3,71,992 రియాల్స్‌గా ఉంది. దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఆర్ధిక ఆంక్షలు ఆ దేశ కరెన్సీని ఇంతగా దిగజార్చాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌
Recommended image2
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Recommended image3
యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి.? అసలేం జరుగుతోంది.?
Related Stories
Recommended image1
Unmarried Men: బ్రహ్మచారులకు హెచ్చరిక.. పెళ్లి చేసుకోకపోతే ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం
Recommended image2
Top 10 Unsolved Mysteries : దేవుడా.. ఇన్ని వింతలా? సైన్స్‌కు కూడా అందని ఆ 10 రహస్యాలు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved