MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Today Gold Rate: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్..ఇరాన్-అమెరికా టెన్షన్ ఎఫెక్ట్.. ఇదే సరైన సమయమా?

Today Gold Rate: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్..ఇరాన్-అమెరికా టెన్షన్ ఎఫెక్ట్.. ఇదే సరైన సమయమా?

Today Gold Rate: బంగారం మార్కెట్ మాత్రం మరోసారి షాకిచ్చింది. దీంతో పెట్టుబడిదారులంతా మళ్లీ సేఫ్ జోన్ కోసం బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈరోజు తులం బంగారం ఎంతంటే.. 

1 Min read
Author : Nandini Arava
Published : May 27 2026, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆర్ఠిక మార్కెట్లను కుదిపేస్తున్న మరోసారి యుద్ధ భయం
Image Credit : chatgpt

ఆర్ఠిక మార్కెట్లను కుదిపేస్తున్న మరోసారి యుద్ధ భయం

ప్రపంచవ్యాప్తంగా మరోసారి యుద్ధ భయం ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రభావం నేరుగా బంగారం, వెండి మార్కెట్‌పై పడుతోంది. సాధారణంగా ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటే పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బును ఉపసంహరించుకుని బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు వెళ్తారు. ప్రస్తుతం అదే ట్రెండ్ కనిపిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మార్కెట్‌లో స్వల్ప ఊరట
Image Credit : Asianet News

మార్కెట్‌లో స్వల్ప ఊరట

గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్నవారు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవాళ మాత్రం మార్కెట్‌లో స్వల్ప ఊరట కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, కొంతమంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల గోల్డ్ ధరల్లో మార్పు కనిపించింది.  తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‍లో బంగారం ధరలు ఒకేలా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారట్లపై రూ.600 తగ్గి రూ.1,58,290 వద్ద నమోదైంది. అదే 22 క్యారట్ల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,45,100కు చేరుకుంది. 

34
ఈ తగ్గుదల తాత్కాలికమేనా?
Image Credit : Asianet News

ఈ తగ్గుదల తాత్కాలికమేనా?

అయితే మార్కెట్ నిపుణులు చెబుతున్నదేమిటంటే…ఈ తగ్గుదల తాత్కాలికమే కావచ్చని. ఎందుకంటే అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఇంకా పూర్తిగా చల్లారలేదు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే బంగారం ధరలు మళ్లీ భారీగా ఎగిసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, డాలర్ ఇండెక్స్ మార్పులు కూడా గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. 

44
ఇదే సరైన కొనుగోలు అవకాశమా?
Image Credit : Getty

ఇదే సరైన కొనుగోలు అవకాశమా?

ఇప్పుడు కొనుగోలుదారుల్లో ఒకటే ప్రశ్న..ఇదే సరైన కొనుగోలు అవకాశమా? లేక ఇంకొన్ని రోజులు ఆగాలా? ప్రస్తుతం ధరలు కొద్దిగా తగ్గినా, మార్కెట్‌లో అస్థిరత మాత్రం కొనసాగుతూనే ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Home Loan : సిబిల్ స్కోర్ తక్కువున్నా హోమ్ లోన్ కావాలా? అయితే ఈ 7 టిప్స్ పాటించండి
Recommended image2
జనరల్ బోగీలు.. రైలు ముందు, వెనుకే ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే
Recommended image3
Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్
Related Stories
Recommended image1
Gold Rate Hike: హైదరాబాద్‌లో పసిడి రేట్ల జోరు.. మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్
Recommended image2
Gold Price Fall: కుప్పకూలిన బంగారం ధరలు..దుబాయ్ లో గ్రాము గోల్డ్ ఎంతో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved