Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Amazon Sale: అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ నడుస్తోంది. ఇందులో శాంసంగ్, ఎల్జీ, బాష్, హైయర్ లాంటి టాప్ బ్రాండ్ల టాప్-లోడ్ వాషింగ్ మెషీన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్నారు. వాషింగ్ మెషీన్ కొనడానికి ఇదే బెస్ట్ సమయం.

టాప్-లోడ్ వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్లు!
ఇంట్లోని పాత వాషింగ్ మెషీన్ మార్చాలనుకుంటే, శాంసంగ్, బాష్, ఎల్జీ, హైయర్ బ్రాండ్లలో బెస్ట్ టాప్-లోడ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 7 నుంచి 10 కిలోల కెపాసిటీ ఉన్న ఈ మెషీన్ల ధర రూ.17,990 నుంచి మొదలవుతుంది. ఇన్-బిల్ట్ హీటర్, ఇన్వర్టర్ మోటార్, క్విక్ వాష్ లేదా స్మార్ట్ వాషింగ్ లాంటి ఫీచర్లతో మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్‌ను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఇందులోనే మీకు అదిరిపోయే మోడల్స్ పై భారీ తగ్గింపులు దక్కుతున్నాయి.
హైయర్ 8 కిలోల 5-స్టార్ ఓషియానస్ వేవ్ డ్రమ్
తక్కువ బడ్జెట్‌లో వాషింగ్ మెషీన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని అసలు ధర రూ.29,000 కాగా, ఆఫర్‌లో రూ.17,990కే వస్తోంది. ఇందులో 15 నిమిషాల క్విక్-వాష్ ఫీచర్, 8 వాష్ ప్రోగ్రామ్‌లు, మ్యాజిక్ ఫిల్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
ఎల్జీ 7 కిలోల 5-స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్
ఎల్జీ బ్రాండ్ ఇష్టపడేవారికి ఈ టాప్-లోడ్ మోడల్ బాగా సెట్ అవుతుంది. దీని అసలు ధర రూ.27,490. కానీ సేల్‌లో రూ.18,990కే అమ్ముతున్నారు. టర్బోడ్రమ్ టెక్నాలజీ, ఆటో ప్రీవాష్, స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రమ్, ఎల్ఈడీ డిస్‌ప్లే లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
బాష్ 8 కిలోల 5-స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్
కాస్త బడ్జెట్ పెంచుకుంటే ఈ బాష్ మోడల్ తీసుకోవచ్చు. దీని అసలు ధర రూ.26,490 కాగా, ఆఫర్‌లో రూ.19,090కే ఇస్తున్నారు. పవర్‌వేవ్ వాష్, డ్యూయల్ లింట్ ఫిల్టర్, 5-ఫిన్ పల్సేటర్‌తో కూడిన వేరియోడ్రమ్, వాటర్ సేవింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా అమేజాన్‌లో రూ.750 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
శాంసంగ్ స్మార్ట్ ఛాయిస్ 8 కిలోల 5-స్టార్ ఎకోబబుల్
శాంసంగ్ బ్రాండ్‌లో రూ.27,000 అసలు ధర ఉన్న ఈ మోడల్, డిస్కౌంట్ పోనూ రూ.19,489కే వస్తోంది. ఇందులో ఎకోబబుల్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్వర్టర్ మోటార్, సాఫ్ట్-క్లోజింగ్ డోర్ లాంటి ఫీచర్లు ఇచ్చారు. దీనిపై అదనంగా రూ.1,000 విలువైన కూపన్ ఆఫర్ కూడా ఉంది.
శాంసంగ్ 8 కిలోల 5-స్టార్ హైజీన్ స్టీమ్
మీకు మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కావాలంటే ఈ మోడల్ చూడొచ్చు. దీని అసలు ధర రూ.30,990 కాగా, సేల్‌లో రూ.21,990కే కొనుక్కోవచ్చు. ఇందులో ఇన్-బిల్ట్ హీటర్, స్టెయిన్ వాష్, ఎకోబబుల్, క్విక్ వాష్, డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ ఉన్నాయి. దీనికి కూడా రూ.1,000 కూపన్ ఆఫర్ వర్తిస్తుంది.
శాంసంగ్ స్మార్ట్ ఛాయిస్ 10 కిలోల 5-స్టార్ ఏఐ వాష్
పెద్ద కుటుంబాలకు ఈ 10 కిలోల కెపాసిటీ ఉన్న మోడల్ బాగా సరిపోతుంది. దీని అసలు ధర రూ.33,990. కానీ ఇప్పుడు డిస్కౌంట్‌లో రూ.24,990కే లభిస్తోంది. ఇందులో ఏఐ వాష్, ఏఐ ఎనర్జీ మోడ్, వైఫై కనెక్టివిటీ, ఎకోబబుల్ టెక్నాలజీ, వైబ్రేషన్ తగ్గించే ఏఐ వీఆర్టీ+, సాఫ్ట్-క్లోజింగ్ డోర్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

