MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Traffic Jam to Crores: ట్రాఫిక్ జామ్‌లో రూ. 2.9 కోట్ల బిజినెస్.. యువకుడి మైండ్ బ్లోయింగ్ ఐడియా !

Traffic Jam to Crores: ట్రాఫిక్ జామ్‌లో రూ. 2.9 కోట్ల బిజినెస్.. యువకుడి మైండ్ బ్లోయింగ్ ఐడియా !

Traffic Jam to Crores: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వినూత్న ఆలోచనతో థానేకు చెందిన గౌరవ్ లొంధే కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు. ట్రాఫిక్ సమస్యే పెట్టుబడిగా ఎలా మారింది? అసలు ట్రాఫిక్ తో ఎలా వ్యాపారం చేస్తున్నాడు? ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2026, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిజినెస్ అంటే ఇతనిదే బాస్.. ట్రాఫిక్ సమస్యే పెట్టుబడి
Image Credit : Gemini

బిజినెస్ అంటే ఇతనిదే బాస్.. ట్రాఫిక్ సమస్యే పెట్టుబడి

ట్రాఫిక్ జామ్ అంటే సాధారణంగా అందరికీ విసుగు వస్తుంది. గంటల తరబడి సిగ్నల్స్ దగ్గర వాహనాలు నిలిచిపోతే చిరాకు పడుతుంటారు. కానీ, మహారాష్ట్రలోని థానేకు చెందిన గౌరవ్ లొంధే అనే యువకుడు మాత్రం ఈ ట్రాఫిక్ సమస్యలోనే సరికొత్త వ్యాపార అవకాశాన్ని వెతుక్కున్నాడు. 

ఆపదలో అవకాశం అంటే ఇదేనేమో అనేలా.. తన అద్భుతమైన బిజినెస్ ఐడియాతో కోట్లు సంపాదిస్తున్నాడు. ఎటువంటి భారీ పెట్టుబడులు లేకుండా, కేవలం ఒక చిన్న ఆలోచనతో ఏకంగా రూ. 2.9 కోట్ల విలువైన బిజినెస్ మోడల్‌ను క్రియేట్ చేసి దేశంలోని పెద్ద పెద్ద బిజినెస్‌మెన్ల దృష్టిని ఆకర్షించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్యాప్టివ్ కస్టమర్ స్ట్రాటజీ తో వ్యాపారం
Image Credit : Getty

క్యాప్టివ్ కస్టమర్ స్ట్రాటజీ తో వ్యాపారం

గౌరవ్ తన చుట్టూ ఉన్న పరిస్థితులను చాలా నిశితంగా గమనించాడు. థానేలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోజులో జనాలు కనీసం 20 నుంచి 25 నిమిషాల పాటు చిక్కుకుపోతుంటారు. ముఖ్యంగా ఏసీ కార్లలో ప్రయాణించే వారికి ఆ సమయంలో ఆకలి వేసినా, బయటకు వచ్చి తినే ఆప్షన్ ఉండదు. ఇలాంటి వారిని బిజినెస్ లాంగ్వేజ్‌లో ‘క్యాప్టివ్ కస్టమర్స్’ అంటారు. అంటే వారు అక్కడి నుంచి కదల్లేరు, ప్రత్యామ్నాయం లేదు. సరిగ్గా ఈ పాయింట్‌నే గౌరవ్ క్యాష్ చేసుకున్నాడు. ఆకలితో ఉన్న డ్రైవర్లు, ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. కేవలం రూ. 20లకే వేడివేడి వడా పావ్ అమ్మడం ప్రారంభించాడు.

35
గౌరవ్ బిజినెస్ కు హర్ష్ గోయెంకా సలాం
Image Credit : stockphoto

గౌరవ్ బిజినెస్ కు హర్ష్ గోయెంకా సలాం

ఈ వినూత్న స్టార్టప్ ఐడియా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దాదాపు రూ. 35,000 కోట్ల వాల్యుయేషన్ ఉన్న ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా సైతం గౌరవ్ లొంధే వ్యాపార శైలికి ఫిదా అయిపోయారు. గౌరవ్ వడా పావ్ అమ్ముతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "ఇది కదా అసలైన ఆంట్రప్రెన్యూర్‌షిప్ అంటే!" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. పెద్ద చదువులు, కోట్లాది రూపాయల ఫండింగ్ లేకపోయినా విజయం సాధించవచ్చని గౌరవ్ నిరూపించాడని ఆయన కొనియాడారు.

45
జీరో కాస్ట్ బిజినెస్ మోడల్
Image Credit : Gemini

జీరో కాస్ట్ బిజినెస్ మోడల్

ఈ బిజినెస్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం దీని ఖర్చు. గౌరవ్ ఎక్కడా ఎలాంటి షాపును అద్దెకు తీసుకోలేదు, అంటే ఇక్కడ 'జీరో రెంట్'. రోడ్డుపై ఉండే సిగ్నల్ పాయింటే అతనికి బెస్ట్ లొకేషన్ అయింది. అలాగే మార్కెటింగ్ కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. రోడ్డుపై ఉండే ట్రాఫిక్, జనాలే అతని బ్రాండ్‌కు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌గా మారారు, కాబట్టి 'జీరో మార్కెటింగ్'. ఇక వడా పావ్‌లను నిల్వ ఉంచే అవసరం లేకుండా, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారు చేసి విక్రయిస్తున్నాడు, దీంతో జీరో స్టోరేజ్ ఖర్చులతో ఈ మోడల్ నడుస్తోంది.

55
రూ. 2.9 కోట్ల బిజినెస్ సామ్రాజ్యం
Image Credit : Instagram / coach.varun

రూ. 2.9 కోట్ల బిజినెస్ సామ్రాజ్యం

ఈ సింపుల్ బిజినెస్ వెనుక ఉన్న మ్యాథ్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఒక సిగ్నల్ పాయింట్ వద్ద రోజుకు సగటున రూ. 8,000 వరకు వడా పావ్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదే ఫార్ములాతో గౌరవ్ గనుక థానే నగరంలోని కేవలం 10 సిగ్నల్ పాయింట్లను కవర్ చేయగలిగితే, రోజుకు రూ. 80,000 ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఏడాదికి ఏకంగా రూ. 2 కోట్ల 90 లక్షల టర్నోవర్ సాధించవచ్చు. ఎలాంటి ఎంబీఏ డిగ్రీలు, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్స్ లేకుండానే ఈ సరికొత్త భారత్ యువ ఆంట్రప్రెన్యుయర్ అద్భుతం సృష్టించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Recommended image2
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Recommended image3
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Related Stories
Recommended image1
Salary Management: జీతం పడిన వెంటనే ఈ 8 పనులు చేస్తే లైఫ్ సెట్.. ఆర్థిక కష్టాలే రావు
Recommended image2
India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved