MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Salary Management: జీతం పడిన వెంటనే ఈ 8 పనులు చేస్తే లైఫ్ సెట్.. ఆర్థిక కష్టాలే రావు

Salary Management: జీతం పడిన వెంటనే ఈ 8 పనులు చేస్తే లైఫ్ సెట్.. ఆర్థిక కష్టాలే రావు

Salary Management: జీతం పడిన వెంటనే కొన్ని పనులు చేస్తే లైఫ్ సెట్ అవుతుందనీ, ఆర్థిక కష్టాలే రావని నిపుణులు చెబుతున్నారు. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, బిల్లుల చెల్లింపులు వంటి ఈ 8 సూత్రాలు పాటిస్తే మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2026, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అకౌంట్‌లో జీతం పడగానే చేయాల్సిన పనులు ఇవే
Image Credit : Gemini

అకౌంట్‌లో జీతం పడగానే చేయాల్సిన పనులు ఇవే

నెలంతా ఆఫీసులో కష్టపడి పనిచేశాక, ఒకటో తారీఖున బ్యాంక్ అకౌంట్‌లో జీతం క్రెడిట్ అయిన మెసేజ్ చూడగానే వచ్చే ఆనందం వేరు. కానీ, ఆ కిక్ ఎన్నాళ్లు ఉంటుంది? చాలా మందికి వారం తిరిగే సరికి సగం జీతం మాయం అయిపోతుంది. నెల చివర వచ్చేసరికి జేబు పూర్తిగా ఖాళీ అవుతుంది. ఈ పరిస్థితి మారాలంటే, జీతం పడిన వెంటనే కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు చేయాలి. ఈ రోజుల్లో మనీ మేనేజ్‌మెంట్ పక్కాగా తెలిసి ఉండాలి. జీతం పడగానే మీరు కచ్చితంగా చేయాల్సిన ఆ 8 ముఖ్యమైన పనులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ముందుగా మీకే పే చేసుకోండి.. ఇదే సెకండ్ ఇన్‌కమ్
Image Credit : stockPhoto

ముందుగా మీకే పే చేసుకోండి.. ఇదే సెకండ్ ఇన్‌కమ్

జీతం అకౌంట్‌లో పడగానే ముందుగా కనీసం 10% నుంచి 20% మొత్తాన్ని సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం పక్కన పెట్టేయండి. 'ఖర్చు చేయగా మిగిలిన దాన్ని సేవ్ చేయడం కాదు.. ముందు సేవ్ చేసి మిగిలిన దాన్ని మాత్రమే ఖర్చు చేయాలి' అనేది ఇక్కడ అసలైన సూత్రం. సంపదను నిర్మించుకోవడానికి ఇది తొలి అడుగు లాంటిది.

అలాగే కేవలం ఒకే జీతం మీద ఆధారపడటం ఈ రోజుల్లో రిస్క్. సైడ్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ ప్రొడక్ట్స్ లేదా మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా సెకండ్ ఇన్‌కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీ రెగ్యులర్ ఆదాయం ఆగిపోయినా మీ లైఫ్ స్టైల్‌కు ఏమాత్రం ప్రాబ్లం ఉండదు.

Related Articles

Related image1
Earth Facts: ఒక్క సెకండ్ లో భూమిపై ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
Related image2
India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
36
బిల్స్ అన్నీ వెంటనే కట్టేయండి.. అప్పులు తగ్గించండి
Image Credit : Getty

బిల్స్ అన్నీ వెంటనే కట్టేయండి.. అప్పులు తగ్గించండి

సాలరీ రాగానే ముందుగా చేయాల్సిన మరో ముఖ్యమైన పని బిల్స్ క్లియర్ చేయడం. కరెంట్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, ఇంటి అద్దె, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు లాంటివి ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే కట్టేయండి. ఇలా చేయడం వల్ల లేట్ ఫీజుల భారం తప్పుతుంది. మీ సిబిల్ స్కోర్ కూడా దెబ్బతినకుండా సేఫ్‌గా ఉంటుంది. దీనివల్ల నెలంతా ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా ఉండొచ్చు.

అలాగే క్రెడిట్ కార్డ్ అప్పులు, పర్సనల్ లోన్స్, బై నౌ పే లేటర్ బకాయిలు లాంటి ఎక్కువ వడ్డీ ఉండే అప్పులను ముందుగా తీర్చేయండి.

46
ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం
Image Credit : PR

ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం

లైఫ్‌లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎవరికీ తెలియదు. ఉద్యోగం పోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, కుటుంబంలో అత్యవసర పరిస్థితులు లేదా బిజినెస్ నష్టాలు ఎదురైనప్పుడు ఎవరి ముందు చెయ్యి చాపకుండా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా ఉండాలి. మీ నెలవారీ ఖర్చులకు కనీసం ఆరు నెలలకు సరిపడా డబ్బును ఎమర్జెన్సీ ఫండ్‌గా పక్కన పెట్టుకోండి.

అలాగే, మీకు కచ్చితంగా రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ఉండాలి. హాస్పిటల్ ఖర్చులను కవర్ చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే.. మీ తర్వాత మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీ సేవింగ్స్ అన్నీ జీరో కాకుండా ఇవి బాగా కాపాడతాయి.

56
స్కిల్స్ పెంచుకోండి.. సాలరీ డే రివ్యూ చేసుకోండి
Image Credit : Getty

స్కిల్స్ పెంచుకోండి.. సాలరీ డే రివ్యూ చేసుకోండి

మీ కెరీర్‌లో స్పీడ్‌గా ఎదగాలంటే ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ అప్‌డేట్ అవ్వాలి. దీనికోసం మీ జీతంలో కొంత డబ్బును కేటాయించండి. మంచి బుక్స్ చదవడం, ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకోవడం, సర్టిఫికేషన్స్ లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌లో జాయిన్ అవ్వడం చేయండి. మీ మీద మీరు పెట్టుకునే డబ్బే అత్యుత్తమ ఇన్వెస్ట్‌మెంట్ అని గుర్తుంచుకోండి.

అలాగే సాలరీ వచ్చిన ప్రతిసారీ ఒకసారి రివ్యూ చేసుకోండి. "ఎంత సంపాదించాను? ఎంత సేవ్ చేశాను? ఎక్కడ ఎక్కువ ఖర్చు చేశాను?" అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈ రివ్యూ లేకపోతే ఫైనాన్షియల్ ఇంప్రూవ్‌మెంట్ అస్సలు ఉండదు.

66
పర్ఫెక్ట్ సాలరీ బడ్జెట్ ప్లాన్ ఇలా ఉండాలి..
Image Credit : Gemini AI

పర్ఫెక్ట్ సాలరీ బడ్జెట్ ప్లాన్ ఇలా ఉండాలి..

మొత్తం జీతాన్ని ఎలా కేటాయించాలో ఇక్కడ ఒక బెస్ట్ ఉదాహరణ చూద్దాం. ఈ ప్లాన్ ఫాలో అయితే మీ ఫైనాన్షియల్ లైఫ్ సెట్ అయినట్టే..

  • ఇన్వెస్ట్‌మెంట్స్/సేవింగ్స్ కోసం: 20%
  • బిల్స్, ఈఎంఐలు కట్టడానికి: 40%
  • రోజువారీ ఖర్చులకు: 25%
  • ఎమర్జెన్సీ ఫండ్ కోసం: 5%
  • కొత్త స్కిల్స్ డెవలప్‌మెంట్ కోసం: 5%
  • ఫన్, ఎంటర్టైన్మెంట్ కోసం: 5%

ఈ విధంగా మీ సాలరీని విభజించుకోండి. ఈ 8 సింపుల్ అలవాట్లను మీరు పక్కాగా పాటిస్తే కేవలం 5 సంవత్సరాల్లోనే మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. జీతం ఎంత వస్తుంది అన్నది ముఖ్యం కాదు, వచ్చిన జీతాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నదే మీ ఆర్థిక భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes Farm : కోళ్ల ఫారం లాగే పాముల ఫారం.. లక్షల నాగుపాములు పెంచే ఈ ఒక్క విలేేజ్ ఆదాయం ఎంతో తెలుసా?
Recommended image2
Earth Facts: ఒక్క సెకండ్ లో భూమిపై ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
Recommended image3
India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Related Stories
Recommended image1
Earth Facts: ఒక్క సెకండ్ లో భూమిపై ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
Recommended image2
India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved