- Home
- Business
- Tamarind Seed Business: మీ వీధిలోకి కూడా చింత కాయలు కొనడానికి వస్తున్నారా.? ఇంతకీ వాటితో ఏం చేస్తారో తెలుసా.?
Tamarind Seed Business: మీ వీధిలోకి కూడా చింత కాయలు కొనడానికి వస్తున్నారా.? ఇంతకీ వాటితో ఏం చేస్తారో తెలుసా.?
చింత గింజలు కొంటాం.. అంటూ వీధుల్లో తిరిగే వారిని చూసే ఉంటాం. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది తరచూ కనిపించే దృశ్యమే అయితే చింత గింజలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు.? అసలు వాటితో ఏం చేస్తారని ఎప్పుడైనా సందేహం వచ్చిందా.?
- FB
- TW
- Linkdin
Follow Us
)
చింత గింజలకు ఫుడ్ డిమాండ్
వేటికి పనికి రాని చింత గింజలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారన్న సందేహం రావడం సర్వసాధారణం. కానీ వాస్తవానికి వీటి గింజలు ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగపడే విలువైన పదార్థాలుగా మారుతున్నాయి.
ఫార్మా కంపెనీలు నుంచి పట్టువస్త్రాల పరిశ్రమ వరకు ఎన్నో రంగాల్లో చింతగింజల పొడికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే వీటికి డిమాండ్ పెరుగుతోంది.
ఆరోగ్యానికి అద్భుతమైన చింతగింజలు
చింతగింజల పొడిలో ఉన్న ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యలపై పరిష్కారాన్ని అందిస్తాయి. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులకు ఇది ఒక ఇంటి చిట్కా ఔషధంగా పనిచేస్తుంది.
చింతగింజల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, రిజర్వెట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని అందించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయి. నరాల బలానికి ఇది సహాయపడుతుంది.
చింతగింజల ప్రాసెసింగ్
దక్షిణ భారతదేశంలో చింతగింజల ప్రాసెసింగ్‌కు కేంద్రబిందువుగా ఏపీలోని పుంగనూరు నిలుస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసే చింతకాయల నుంచి గింజలు వేరు చేసి, మిషన్ల ద్వారా పొడి చేసి వాటిని ఎగుమతి చేస్తారు.
పుంగనూరులోని 12 మిషన్ల ద్వారా రోజుకు సుమారు 200 టన్నుల చింతగింజలు ప్రాసెస్ అవుతున్నాయి. హిందూపురం, గుజరాత్, మధురై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఆ గింజలను పొడి చేసి వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తారు.
ఏయే రంగాల్లో ఉపయోగిస్తారు.?
ఫార్మాస్యూటికల్ పరిశ్రమ: ఔషధాల తయారీకి.
టెక్స్‌టైల్ రంగం: పట్టువస్త్రాలకు గంజి వేయడానికి.
రంగుల పరిశ్రమ: ప్రకృతిసిద్ధమైన రంగుల తయారీలో.
పేపర్, ఫ్లైవుడ్, ప్లాస్టిక్ పరిశ్రమలు: స్ట్రక్చర్ స్టెబిలైజర్‌గా.
జూట్ పరిశ్రమ: మృదుత్వం కోసం.
మస్కట్ కాయిల్స్ తయారీ: గింజల పొడిని బైండర్‌గా ఉపయోగిస్తారు.
పెరుగుతోన్న ధరలు
ఇంతకు ముందు చింతగింజలు కిలోకి రూ.30-35 మధ్య పలికేవి. కానీ ఈ ఏడాది మార్కెట్ పరిస్థితుల వల్ల ధరలు రూ.40-44 మధ్యకు చేరుకున్నాయి. చింతపండు ధరల పెరుగుదల వల్ల గింజల ధరలు కూడా స్వయంగా పెరిగాయి.
గింజలను వేరుచేసే యంత్రాల అధిక స్థిరీకరణ పుంగనూరులో ఉండటంతో అక్కడే ఎక్కువ శాతం వ్యాపారం జరుగుతోంది. ఈ రంగం వేల మందికి ఉపాధిని కల్పిస్తోంది.