MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Gold Rate: షాకిస్తున్న బంగారం, వెండి రేట్లు, 2రోజుల్లో రూ.11,500 జంప్

Gold Rate: షాకిస్తున్న బంగారం, వెండి రేట్లు, 2రోజుల్లో రూ.11,500 జంప్

Gold Rate: బంగారం, వెండి రేట్లు హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ పోరుతో గోల్డ్ ధరలు షాక్ ఇస్తున్నాయి. కేవలంరెండు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారంపై దాదాపు రూ. 11,500కుపై ఎగిసి రూ. 1,73,080 వద్దకు చేరింది. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 02 2026, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ పోరుతో గోల్డ్ ధరల్లో భారీ పెరుగుదల
Image Credit : Asianet News

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ పోరుతో గోల్డ్ ధరల్లో భారీ పెరుగుదల

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలర్ మారకం విలువలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు ఇవన్నీ కలిసి బంగారాన్ని మళ్లీ సురక్షిత ఆశ్రయంగా నిలబెట్టాయి. మార్కెట్లలో అస్థిరత పెరిగినప్పుడల్లా ఇన్వెస్టర్లు ముందుగా చూసేది గోల్డ్ వైపే. అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఖర్చులు పెంచుతూ దేశీయ ధరలపై ఒత్తిడి
Image Credit : Getty

ఖర్చులు పెంచుతూ దేశీయ ధరలపై ఒత్తిడి

గ్లోబల్ ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5,320 డాలర్లను దాటింది. కేవలం ఒక్కరోజు క్రితం ఇది 5,200 డాలర్ల వద్ద ఉండగా, మరికొద్ది రోజుల కిందట 4,700 డాలర్ల స్థాయిలోనే కనిపించింది. అక్కడి నుంచి ఆగకుండా ఎగబాకుతూ ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకుంది. వెండి కూడా అదే దిశగా కదులుతోంది. సిల్వర్ ధర 92.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే సుమారు రూ.91 వద్ద ఉండటం దిగుమతి ఖర్చులను పెంచుతూ దేశీయ ధరలపై ఒత్తిడి పెంచుతోంది.

Related Articles

Related image1
Gold Nose Pin: ముక్కుకు అతికించుకునే ముక్కు పుడకలు ఇవిగో
Related image2
Gold Earrings: లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి
35
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ. 4,370
Image Credit : Getty

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ. 4,370

అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పెరుగుదల భారత్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 4,370 పెరిగి రూ. 1,73,080 వద్దకు చేరింది. అంతకుముందు రోజు కూడా రూ. 7,140 పెరగడంతో రెండు రోజుల్లోనే దాదాపు రూ. 11,500 పైగా నమోదైంది.

45
వెండిపై కిలోకు రూ. 30 వేలు పెరుగుదల
Image Credit : Getty

వెండిపై కిలోకు రూ. 30 వేలు పెరుగుదల

22 క్యారెట్ల గోల్డ్ కూడా గణనీయంగా ఎగబాకింది. తులానికి రూ. 4,000 పెరిగి ప్రస్తుతం రూ. 1,58,650 వద్ద ఉంది. గత సెషన్‌లో రూ. 6,550 పెరిగిన నేపథ్యంలో మొత్తం రెండు రోజుల్లోనే భారీ పెరుగుదల కనిపిస్తోంది. వెండి ధరలు అయితే మరింత వేగంగా పరుగులు పెడుతున్నాయి. కిలోకు మరో రూ. 5,000 జోడై ప్రస్తుతం రూ. 3.25 లక్షల మార్క్‌ను తాకింది. ముందటి రోజు రూ. 25,000 పెరగడంతో రెండు రోజుల్లోనే రూ. 30,000 వరకూ ఎగబాకింది.

55
కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి
Image Credit : Asianet News

కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి

ఈ ధరల పెరుగుదల పెళ్లిళ్లు లేదా శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలకు ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. అయితే దీర్ఘకాల పెట్టుబడిదారులు మాత్రం దీన్ని భవిష్యత్ లాభాల అవకాశంగా చూస్తున్నారు. గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, కరెన్సీ మార్పిడి విలువలు, జియోపాలిటికల్ పరిణామాలు ఎలా మారుతాయన్నదే రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల దిశను నిర్ణయించనుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Gold Nose Pin: ముక్కుకు అతికించుకునే ముక్కు పుడకలు ఇవిగో
Recommended image2
Gold Earrings: లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved