MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • 90 శాతం మందికి ఇది తెలియ‌దు.. CNG కొట్టిచ్చేప్పుడు ప్ర‌యాణికుల‌ను ఎందుకు దిగ‌మంటారు.?

90 శాతం మందికి ఇది తెలియ‌దు.. CNG కొట్టిచ్చేప్పుడు ప్ర‌యాణికుల‌ను ఎందుకు దిగ‌మంటారు.?

CNG Filling: సీఎన్‌జీ బంక్‌లకు వెళ్లినప్పుడు ఒక విషయం గ‌మ‌నించే ఉంటారు. గ్యాస్ నింపే సమయంలో డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న వారందరినీ బయటకు దిగమంటారు. చాలా మందికి ఇది సాధారణ నిబంధనలా అనిపించినా, దీని వెనుక కీలకమైన భద్రతా కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 16 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అధిక ఒత్తిడితో నిల్వ ఉండే గ్యాస్
Image Credit : Gemini AI

అధిక ఒత్తిడితో నిల్వ ఉండే గ్యాస్

పెట్రోల్‌, డీజిల్‌లా కాకుండా సీఎన్‌జీని చాలా ఎక్కువ ప్రెజర్‌తో సిలిండర్లలో నిల్వ చేస్తారు. సాధారణంగా ఈ ఒత్తిడి 200 నుంచి 250 బార్ వరకు ఉంటుంది. ఫిల్లింగ్ సమయంలో కూడా అదే అధిక ఒత్తిడితో గ్యాస్‌ను వాహనం సిలిండర్‌లోకి పంపిస్తారు. ఈ ప్రక్రియలో హోస్‌, నాజిల్‌, వాల్వ్‌ లేదా కనెక్షన్‌లో చిన్న లోపం వచ్చినా గ్యాస్ వేగంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వాహనంలో ప్రయాణికులు ఉంటే వారిని బయటకు తీసుకురావడం కష్టమవుతుంది. అందుకే ముందుగానే అందరినీ వాహనం బయటకు వెళ్ల‌మంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గ్యాస్ లీక్‌, అగ్నిప్రమాదాల భయం
Image Credit : X

గ్యాస్ లీక్‌, అగ్నిప్రమాదాల భయం

సీఎన్‌జీ చాలా త్వరగా మంట అంటుకునే ఇంధనం. చిన్న లీక్‌ జరిగినా గ్యాస్ గాలిలో కలిసిపోతుంది. అదే సమయంలో చిన్న స్పార్క్‌ వచ్చినా అగ్నిప్రమాదం జరిగే ప్రమాదం ఉంటుంది. కార్‌లో కూర్చున్నవారు అనుకోకుండా మొబైల్ వాడటం, ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేయడం లేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కారణంగా స్పార్క్ రావడం వంటి పరిస్థితులు ప్రమాదాన్ని పెంచవచ్చు. అందుకే సీఎన్‌జీ స్టేషన్లలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని కూడా నిరోధిస్తారు. ఫిల్లింగ్ సమయంలో ఇంజిన్‌ను పూర్తిగా ఆఫ్ చేయడం కూడా ఇదే కారణంతో తప్పనిసరి చేశారు.

35
స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రమాదమే
Image Credit : Getty

స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రమాదమే

చాలామంది పట్టించుకోని మరో విషయం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. కార్ సీట్లపై కదలికల వల్ల శరీరంలో చిన్న స్థాయిలో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏర్పడుతుంది. సాధారణంగా ఇది ప్రమాదకరం కాదు. కానీ కంప్రెస్డ్ గ్యాస్ ఉన్న ప్రాంతంలో చిన్న స్పార్క్ కూడా రిస్క్‌గా మారొచ్చు. అందుకే ప్రయాణికులను వాహనం బయట నిలబెట్టడం ద్వారా అలాంటి అవకాశాలను తగ్గిస్తారు. ఇది ముందస్తు జాగ్రత్త చర్యగా భావిస్తారు.

ఆరోగ్య సమస్యలు రాకుండా తీసుకునే జాగ్రత్త

సహజంగా సీఎన్‌జీకి వాసన ఉండదు. కానీ లీక్‌ను గుర్తించేందుకు ప్రత్యేక రసాయనం కలుపుతారు. ఆ వాసన బలంగా ఉంటుంది. ఎక్కువగా పీల్చితే తలనొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు. గ్యాస్ నింపే సమయంలో వాహనం బయట ఉండడం వల్ల అలాంటి ఆరోగ్య సమస్యల అవకాశాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ఇది మరింత అవసరమైన జాగ్రత్తగా భావిస్తారు.

45
భారత్‌లో అమలవుతున్న కఠిన భద్రతా నిబంధనలు
Image Credit : Google

భారత్‌లో అమలవుతున్న కఠిన భద్రతా నిబంధనలు

భారత్‌లో సీఎన్‌జీ స్టేషన్ల కోసం ప్రత్యేక సేఫ్టీ గైడ్‌లైన్స్ అమల్లో ఉన్నాయి. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO), పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) వంటి సంస్థలు భద్రతా ప్రమాణాలను రూపొందించాయి. ఈ నిబంధనల ప్రకారం.. ఫిల్లింగ్ సమయంలో ఇంజిన్ తప్పనిసరిగా ఆఫ్‌లో ఉండాలి, ప్రయాణికులు వాహనం బయటకు రావాలి, నాజిల్‌ సరిగా కనెక్ట్ అయ్యిందో పరిశీలించాలి, స్మోకింగ్‌, మొబైల్ వాడకం నిషేధం. ఓవర్ ఫిల్లింగ్ చేయకూడదు, శిక్షణ పొందిన సిబ్బంది మాత్రమే గ్యాస్ నింపాలి.

55
సీఎన్‌జీ వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Image Credit : Google

సీఎన్‌జీ వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

సీఎన్‌జీ వాహనాలు ఖర్చు తగ్గిస్తాయి. కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. కానీ భద్రతా నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఎప్పుడూ ఆథరైజ్డ్ స్టేషన్‌లలో మాత్రమే గ్యాస్ నింపించాలి. సిలిండర్ టెస్టింగ్ గడువు పూర్తైందో లేదో పరిశీలించాలి. అదనంగా గ్యాస్ నింపమని ఒత్తిడి చేయకూడదు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే సీఎన్‌జీ ఫిల్లింగ్ సమయంలో కారులోనుంచి దిగమని చెప్పినప్పుడు దాన్ని ఇబ్బందిగా కాకుండా భద్రత కోసం తీసుకునే జాగ్రత్తగా భావించడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
AC Water: అసలు ఏసీలో నుంచి నీళ్లు ఎందుకొస్తాయి.. ఆ నీటిని తాగొచ్చా.?
Recommended image2
పాత పెయింట్ బ‌కెట్ల‌ను బాత్‌రూమ్‌కే ప‌రిమితం చేస్తున్నారా.? ఇలా చేస్తే మీ ఇంటికి కొత్త లుక్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved