Savings: రోజుకు రూ. 300 పక్కన పెడితే.. రూ. 40 లక్షలు సొంతం చేసుకోవచ్చు
Savings: సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. మనం చేసే చేసే చిన్న చిన్న పెట్టుబడులు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి ఒక బెస్ట్ సేవింగ్ స్కీమ్ పీపీఎఫ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏమిటి?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కేంద్ర ప్రభుత్వం మద్ధతు ఉన్న దీర్ఘకాలిక పొదుపు పథకం. ఇది పోస్టాఫీస్‌లతో పాటు కొన్ని బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంటుంది. భద్రత, స్థిరమైన వడ్డీ, పన్ను మినహాయింపులు వంటి మూడు కారణాల వల్ల పీపీఎఫ్‌ను సురక్షిత పెట్టుబడుల్లో అగ్రస్థానంలో నిలిచింది.
రోజుకు రూ.300 పొదుపు చేస్తే..
రోజుకు రూ.300 అంటే నెలకు సుమారు రూ.9,000, ఏడాదికి దాదాపు రూ.1.08 లక్షలు. అయితే పీపీఎఫ్‌లో ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ పరిమితిని పూర్తిగా వినియోగిస్తూ 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే… మొత్తం పెట్టుబడి: సుమారు రూ.22.5 లక్షలు అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7.1% వడ్డీ రేటుతో వచ్చే వడ్డీ: సుమారు రూ.18 లక్షలకు పైగా అవుతుంది. దీంతో మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 40 లక్షలు చేతికొస్తుంది. చిన్న మొత్తాన్ని రోజూ పొదుపు చేస్తూ వెళ్లితే పెద్ద కార్పస్ ఎలా తయారవుతుందో చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ.
పీపీఎఫ్ పథకం ప్రత్యేక లాభాలు
ఈ స్కీమ్‌లో పెట్టే డబ్బుకు మూడు విధాలుగా లాభం ఉంటుంది. పెట్టుబడి మొత్తానికి పన్ను మినహాయింపు, వడ్డీపై పన్ను ఉండదు, మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం కూడా పూర్తిగా పన్ను మినహాయింపు. అంటే మీరు పెట్టిన డబ్బు నుంచి చివరకు చేతికి వచ్చే రూపాయి వరకూ ట్యాక్స్ టెన్షన్ ఉండదు. అందుకే దీన్ని ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడుల్లో అత్యుత్తమ ఆప్షన్‌గా భావిస్తారు.
తక్కువ ఆదాయం ఉన్నవారికీ సరైన మార్గం
పీపీఎఫ్ ఖాతాను కేవలం రూ.500తో ప్రారంభించవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తం పెట్టలేని వారు కూడా నెలవారీగా పొదుపు చేస్తూ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఐదేళ్లు పూర్తైన తర్వాత కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. ఖాతా ప్రారంభమైన కొన్ని సంవత్సరాల తర్వాత లోన్ సదుపాయం కూడా లభిస్తుంది.
మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన భవిష్యత్
షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నా, ఊగిసలాట కూడా ఉంటుంది. కానీ పీపీఎఫ్‌లో అలాంటి రిస్క్ ఉండదు. ప్రభుత్వ హామీ, స్థిరమైన వడ్డీ, దీర్ఘకాలిక భద్రత కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. రోజుకు రూ.300 వంటి చిన్న పొదుపుతోనే రిటైర్మెంట్ సమయానికి లేదా పిల్లల భవిష్యత్తుకు భారీ మొత్తాన్ని సిద్ధం చేసుకోవచ్చు.
గమనిక: వడ్డీ రేట్లు కాలక్రమంలో మారవచ్చు. ఖాతా ప్రారంభించే ముందు సమీప పోస్టాఫీస్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో తాజా నిబంధనలు తెలుసుకోవడం మంచిది.

