MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Business
  • Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?

Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?

Old Gold: మీ దగ్గరున్న పాత బంగారం  ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా?  పాత బంగారాన్ని అమ్మి డబ్బు తీసుకుంటే మంచిదా? లేక  కొత్త నగలగా మార్చుకోవడం లాభమా అని ఆలోచిస్తున్నారా? ఏం చేస్తే మీ డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 26 2026, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
విపరీతంగా పెరిగిన బంగార రేటు
Image Credit : Asianet News

విపరీతంగా పెరిగిన బంగార రేటు

భారతీయ సంప్రదాయంలో బంగారమంటే ఎంతో క్రేజ్. తరతరాలుగా మనవాళ్లు బంగారు ఆభరణాలు కొని ధరిస్తారు. అలా ధరించడం ఎంతో గొప్పగా భావిస్తారు. కొంతమంది భారీగా కొని బీరువాలో దాచుకుంటున్నారు. ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది.  అందుకే చాలా మంది తమ దగ్గర ఉన్న పాత నగలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? కొంతమంది అమ్మేసి డబ్బుగా మార్చుకోవాలని ఆలోచిస్తే మరికొందరు  పాత బంగారాన్ని ఇచ్చి కొత్తవి తీసుకోవాలని అనుకుంటారు.   ఈ రెండింటిలో ఏది బెస్టో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అమ్మకపోవడమే మంచిది
Image Credit : X

అమ్మకపోవడమే మంచిది

మీ దగ్గరున్న పాత బంగారం అమ్మమ్మలు, నాన్నమ్మలు నాటిది కావచ్చు. దాన్ని కొనేముందు ఎవరైనా నాణ్యతను చెక్ చేస్తారు. ఇప్పుడు బంగార నాణ్యతను హాల్‌మార్క్ (Hallmark) నిర్ణక్ష్ిస్తుంది. కానీ  మీ దగ్గరున్న పాత నగలపై హాల్ మార్క్ ఉండదు. దీని వల్ల చాలా మంది వ్యాపారులు ఆ పాత నగలకు ధర కొంచెం తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల కొంత నష్టపోవడం జరుగుతుంది. 

ప్రస్తుతం మార్కెట్లో మీరు పాత బంగారాన్ని అమ్మి డబ్బులు తీసుకోవాలనుకుంటే దాదాపు 20 శాతం తక్కువ డబ్బు వస్తుంది. ఉదాహరణకు ఈరోజు రేటు ప్రకారం ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర ₹14,680 అనుకుందాం. మీరు 10 గ్రాముల బంగారాన్ని అమ్మితే, మీకు సుమారు ₹1.35 లక్షలు మాత్రమే చేతికి రావచ్చు.

33
పాతవి ఇచ్చి కొత్త నగలు తీసుకుంటే?
Image Credit : Getty

పాతవి ఇచ్చి కొత్త నగలు తీసుకుంటే?

 మీరు పాత బంగారాన్ని అమ్మకుండా వాటిని మార్చి కొత్త బంగారు నగలను తీసుకుంటే ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.  మీరు 10 గ్రాముల పాత బంగారాన్ని ఇచ్చి కొత్త నగలు తీసుకోవాలనుకుంటే, మీకు సుమారు ₹1.45 లక్షల విలువైన నగలు వస్తాయి. అంటే, ఇందులో కేవలం తరుగు కింద కొంత మాత్రమే కోత విధిస్తారు.

పాత బంగారాన్ని అమ్మడం లేదా కొత్త నగలు తీసుకోవడం అనేది మీరు వెళ్లే షాపు, ప్రాంతంపై కూడా ఆధారపడి ఉంటుంది. కొందరు తరుగు ఎక్కువగా తీస్తే, మరికొందరు తక్కువగా తీస్తారు. మీరు గతంలో బంగారం కొన్న షాపుకే వెళ్తే వాళ్లు తరుగును కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. మార్కెట్ నిపుణుల ప్రకారం, పాత బంగారాన్ని అమ్మి డబ్బులు తీసుకోవడం కన్నా, దాన్ని ఇచ్చి కొత్త నగలు కొనడమే ఎక్కువ లాభదాయకం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
బంగారం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
Elephant Bangles: చేతులకు ఏనుగు గాజుల అందం
Recommended image2
Best months for Car: కొత్త కారు తక్కువ ధరకు రావాలంటే ఈ నెలల్లో కొనడమే బెటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved