- Home
- Business
- 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్.. డెడ్ చీప్ ధరలకే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్. రోజుకు ఎంతంటే.?
84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్.. డెడ్ చీప్ ధరలకే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్. రోజుకు ఎంతంటే.?
Recharge plans: ప్రముఖ టెలికం రంగ సంస్థ జియో ఎప్పటికప్పుడు కొంగొత్త రీఛార్జ్ ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన కొన్ని ప్లాన్స్‌ను పరిచయం చేసింది.

రూ. 369 ప్లాన్
* ఈ ప్లాన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కాకుండా నార్మల్ కీప్యాడ్ ఫోన్ యూజర్లకు ఎంతో ఉపయోగపడుతుంది.
* ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
* అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.
* డేటా విషయానికొస్తే రోజుకు 0.5 జీబీ లభిస్తుంది.
* 28 రోజులపాటు 300 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు పొందొచ్చు.
* ఈ లెక్కన చూసుకుంటే ఈ ప్లాన్ ద్వారా మీరు రోజుకు కేవలం రూ. 4.39 మాత్రమే ఖర్చు చేస్తున్నారు.
* డేటా అవసరం లేని వారికి ఇది బెస్ట్ ప్లాన్‌గా చెప్పొచ్చు.
రూ.448 ప్లాన్
* ఈ ప్లాన్‌లో కూడా 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
* ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు.
* మొత్తం కాలానికి గాను 1000 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు పొందొచ్చు.
* ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అదనంగా జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ పొందొచ్చు.
* ఈ ప్లాన్‌లో మీరు రోజుకు కేవలం సుమారు రూ. 5.33 మాత్రమే చెల్లిస్తారు.
* డేటా అవసరం తక్కువగా ఉండి, కాలింగ్ ఎక్కువగా చేసేవారికి ఇది మంచి ఆప్షన్.
రూ. రూ.799 ప్లాన్
* ఈ ప్లాన్‌లో యూజర్లకు 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది.
* అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌లు పొందొచ్చు.
* ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అదనంగా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్, గూగుల్ జెమెనీ ప్రో సేవలు పొందొచ్చు.
* ఈ ప్లాన్‌లో మీరు రోజుకు రూ. 9.51 ఖర్చు చేస్తారు.
* డేటాతో పాటు కాల్స్ అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ బాగా సెట్ అవుతుంది.
రూ. రూ.859 ప్లాన్
* ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
* ఇందులో 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ లభిస్తుంది. మొత్తం 168 జీబీ పొందొచ్చు.
* అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు పొందొచ్చు.
* డేటా పూర్తయ్యాక కూడా 64Kbps వేగంతో ఇంటర్నెట్ పొందొచ్చు.
* ఈ ప్లాన్‌లో మీరు సగటున రోజుకు రూ. 10.22 చెల్లిస్తారు.

