- Home
- Business
- బయట రెడ్ అలర్ట్ ఉన్నా ఈ స్లిమ్ కూలర్‌తో ఇంట్లో కూల్ కూల్.. ఇల్లు చిన్నదన్న టెన్షనే వద్దు
బయట రెడ్ అలర్ట్ ఉన్నా ఈ స్లిమ్ కూలర్‌తో ఇంట్లో కూల్ కూల్.. ఇల్లు చిన్నదన్న టెన్షనే వద్దు
Cooler: ఏసీలు కొనుగోలు చేయలేని వారు కూలర్లను కొంటారు. అయితే ఇంట్లో స్థలం సరిపోక కూలర్లతో ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. అలాంటి వారికి ఈ స్లిమ్ కూలర్ పర్‌ఫెక్ట్స్ ఛాయిస్‌గా చెప్పొచ్చు. ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

హైఫ్రెష్ టవర్ ఫ్యాన్
ఇది ఒక మోడర్న్ టవర్ ఫ్యాన్. ఇది సాధారణ ఫ్యాన్ మాత్రమే కాదు, కూలింగ్, హ్యూమిడిఫైయర్ ఫీచర్లతో 3-in-1 డివైస్‌గా పనిచేస్తుంది. ఇంట్లో వేడి తగ్గించడానికి సులభమైన పరిష్కారంగా ఇది ఉపయోగపడుతుంది.
4 మోడ్‌లు, 3 స్పీడ్‌లు
ఈ ఫ్యాన్‌లో 3 స్పీడ్‌లు ఉన్నాయి. లో (4.5 m/s), మిడ్ (6 m/s), హై (7.5 m/s). అలాగే ఇందులో మొత్తం 4 మోడ్‌లు ఉన్నాయి. కూలింగ్, నార్మల్, స్లీప్, నేచర్. మీ అవసరానికి అనుగుణంగా ఈ సెట్టింగ్స్ మార్చుకుని సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు.
నీరు + ఐస్ ప్యాక్‌తో తక్షణ చల్లదనం
ఈ ఫ్యాన్‌లో 4 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంది. అందులో నీరు, ఐస్ ప్యాక్‌లు వేసినప్పుడు గాలి చల్లగా మారుతుంది. ఇది గాలిని 2 నుంచి 10 డిగ్రీల వరకు చల్లబరచగలదు. 4 ఐస్ ప్యాక్‌లు అందిస్తారు, వీటితో కూలింగ్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
తక్కువ కరెంట్ వినియోగం
ఈ ఫ్యాన్ కేవలం 80W పవర్‌తో పనిచేస్తుంది. అంటే ఇది ఎయిర్ కండీషనర్‌తో పోలిస్తే చాలా తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. విద్యుత్ బిల్లు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
స్మార్ట్ ఫీచర్లు, సేఫ్టీ
ఇందులో రిమోట్ & టచ్ కంట్రోల్, 12 గంటల టైమర్ (ఆటో ఆఫ్), 70° ఆటో రోటేషన్, 26 అడుగుల వరకు గాలి విస్తరణ, 50dB కంటే తక్కువ శబ్దం వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే సేఫ్టీ కోసం వాటర్ లేకపోతే ఆటో ఆఫ్, యాంటీ-డంపింగ్ బేస్, బ్లేడ్‌లెస్ డిజైన్ (పిల్లలకు సురక్షితం), సులభమైన ఉపయోగం, మెయింటెనెన్స్. ఇక ఈ ఫ్యాన్‌ను ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. విండో లేదా పైప్ అవసరం లేదు. ప్లగ్ చేసి వెంటనే ఉపయోగించవచ్చు. క్లీన్ చేయడానికి కూడా డిటాచబుల్ పార్ట్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ డిజైన్ వల్ల ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు.

