Recharge plan: జియో యూజర్లకు పండగే.. రూ. 550కే 15 ఓటీటీ యాప్‌లు
Recharge plan: రిలయన్స్ జియో తన జియో ఓటీటీ పాస్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఇప్పటికే ఉన్న ఓటీటీ పాస్‌లకు తోడు తాజాగా 3 నెలల (84 రోజులు), 1 సంవత్సరం (365 రోజులు) వ్యాలిడిటీతో రెండు కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రూ. 200, రూ. 550, రూ. 2000 ప్లాన్లలో ఏమేం ఉన్నాయి?
జియో ఇప్పటికే అందిస్తున్న రూ.200 OTT పాస్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 30GB హై-స్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న జియో యూజర్లకు ఈ ప్యాక్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. కొత్తగా తీసుకొచ్చిన రూ.550 OTT పాస్ 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 90GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5G ప్రయోజనం లభిస్తుంది. 3 నెలలు లేదా ఏడాది బేస్ ప్లాన్ ఉన్న జియో యూజర్లు ఈ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. అలాగే రూ.2000 OTT పాస్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 365GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5G సదుపాయం ఉంటుంది. ఏడాది బేస్ ప్లాన్ ఉన్న జియో వినియోగదారులకు ఈ ప్యాక్ అందుబాటులో ఉంటుంది.
15 ప్రీమియం OTT యాప్‌లు.. 1000కిపైగా లైవ్ టీవీ ఛానెళ్లు
ప్రతి జియో OTT పాస్‌తో నెలకు సుమారు రూ.1,500 విలువైన వినోద ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఈ ప్యాక్‌ల ద్వారా 15 ప్రీమియం OTT యాప్‌లతో పాటు JioTV ద్వారా 1,000కిపైగా లైవ్ టీవీ ఛానెళ్లను వీక్షించే అవకాశం ఉంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, పిల్లల కార్యక్రమాలు, వార్తలు ఇలా ఒకే ప్యాక్‌లో విభిన్న కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.
యూబ్యూట్ ప్రీమియం నుంచి అమెజాన్ ప్రైమ్ వరకు
ఈ OTT పాస్‌లలో యూట్యూబ్ ప్రీమియం కూడా లభిస్తుంది. దీంతో మొబైల్, టీవీ, ట్యాబ్లెట్‌లలో ప్రకటనలు లేకుండా వీడియోలు చూడటం, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ వంటి ఫీచర్లను ఉపయోగించవచ్చు.అలాగే జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ ద్వారా లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ ఒరిజినల్స్, హాలీవుడ్ సినిమాలు వీక్షించవచ్చు. రూ.550, రూ.2000 ప్లాన్‌లలో అమెజాన్ ప్రైమ్ లైట్, రూ.200 ప్లాన్‌లో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది. అదనంగా సోనీ లివ్, జీ5, Lionsgate Play, డిస్కవరీ+, సన్ NXT, ఫ్యాన్‌కోడ్, Hoichoi, Chaupal, Planet Marathi, Kanccha Lannka, TimesPlay, Tarang Plus వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌ల కంటెంట్‌ను కూడా JioTV ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
ఎక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు?
కొత్తగా ప్రవేశపెట్టిన రూ.550, రూ.2000 Jio OTT-Pass ప్లాన్‌లను MyJio యాప్, అధికారిక జియో వెబ్‌సైట్, అలాగే అధీకృత జియో రిటైల్ స్టోర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకే రీఛార్జ్‌తో డేటాతో పాటు పలు ప్రీమియం ఓటీటీ సేవలను పొందాలనుకునే వినియోగదారులకు ఈ కొత్త ప్లాన్‌లు మంచి ఎంపికగా చెప్పొచ్చు.

