MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Gold Price Hike: శ్రావణమాసం వేళ పసిడి షాక్..రూ.1.50 లక్షలు దాటేయడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన

Gold Price Hike: శ్రావణమాసం వేళ పసిడి షాక్..రూ.1.50 లక్షలు దాటేయడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన

Gold Price Hike: మార్కెట్ నిపుణులు చెప్పిందే జరిగింది. బంగారం ధరలు రూ.1.50లక్షలు దాటేసింది. మూడురోజులుగా పెరుగుతూ కంగారు పెట్టిన పసిడి...ఇవాళ మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి...గోల్డ్ కొనాలంటే ఇక బిత్తర చూపులు చూడాల్సిందే.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 08 2026, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శ్రావణమాసం వేళ పసిడి షాక్..
Image Credit : chatgpt

శ్రావణమాసం వేళ పసిడి షాక్..

వచ్చేది శ్రావణమాసం. దేశ వ్యాప్తంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాలు, నోములు, ప్రత్యేక పూజలు చేస్తారు. కాసు బంగారమైనా కొనాలనేది సంప్రదాయం.దానికి తోడు అంతర్జాతీయ పరిస్థితులు, ఇవన్నీ కలిసి బంగారం మార్కెట్లపై ప్రభావం చూపించింది. ఇప్పటికే నార్త్ లో శ్రావణమాసం మొదలైపోయింది. ఎంత ధరలు పెరిగినా కూడా బంగారం కొనకమానరు. ఇప్పుడు సౌత్ లో ఈనెల 13 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో పసిడి ధరలు చాలా పెద్ద షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1.50లక్షలు దాటేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.1,52,350కు చేరిన పసిడి
Image Credit : Getty

రూ.1,52,350కు చేరిన పసిడి

ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తాజా ధరలు గమనిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,090 పెరిగి రూ.1,52,350కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1000 పెరిగి రూ.1,39,650 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరలు కూడా పెరుగుదలనే నమోదు చేశాయి. కిలో వెండి రూ.2.50లక్షలకు చేరిపోయింది.

35
మార్కెట్లలో అనిశ్చితి
Image Credit : ChatGPT

మార్కెట్లలో అనిశ్చితి

అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుతం బంగారం మార్కెట్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధికి సంబంధించిన పరిణామాలు మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం. అక్కడ నౌకా రాకపోకలపై ఆంక్షలు లేదా అంతరాయం ఏర్పడుతుందనే భయాలు పెరిగితే చమురు ధరలతో పాటు ప్రపంచ మార్కెట్లలో కూడా ఒత్తిడి పెరగవచ్చు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సాధారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. అందుకే అంతర్జాతీయంగా పసిడి ధరలకు సపోర్ట్ లభిస్తోంది.

45
హర్మూజ్‌పై ఏం జరుగుతోంది?
Image Credit : X

హర్మూజ్‌పై ఏం జరుగుతోంది?

హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణాను సాధారణ స్థితికి తీసుకురావడంపై ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. అయితే అమెరికా ఆంక్షలు, ఇరాన్ వైఖరి వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఒకవేళ ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గి, హర్మూజ్ మార్గంలో రవాణా పూర్తిగా సాధారణ స్థితికి వస్తే ప్రపంచ మార్కెట్లలో కొంత ఊరట కనిపించవచ్చు. అదే సమయంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే బంగారానికి సేఫ్-హేవన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

55
కొనాలా.. ఆగాలా?
Image Credit : X

కొనాలా.. ఆగాలా?

హర్మూజ్ మీదుగా నౌకా రాకపోకలు గతంతో పోలిస్తే పెరిగినప్పటికీ, ఆ మార్గం పూర్తిగా స్థిరపడిందనే నమ్మకం మార్కెట్లకు ఇంకా రాలేదు. ఇదే అనిశ్చితి పసిడి ధరలకు సపోర్ట్ గా మారుతోంది.

ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో ఉండటంతో ఒక్కసారిగా భారీ మొత్తంలో కొనుగోలు చేయడం కంటే అవసరాన్ని బట్టి కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ పరిశీలకులు సూచిస్తున్నారు. మరోవైపు శ్రావణ మాసం డిమాండ్, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు రాబోయే రోజుల్లో పసిడి ధరల దిశను నిర్ణయించవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Recommended image2
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
Recommended image3
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Related Stories
Recommended image1
Gold Price Hike: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి
Recommended image2
Gold Price Hike: ఆగస్టులో ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. కొద్దిరేజులుగా బేజారెత్తిపోతున్న కొనుగోలుదారులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved