MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • LIC: ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. రోజుకు రూ.45 కడితే చాలు.. రూ.25 లక్షలు మీ సొంతం

LIC: ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. రోజుకు రూ.45 కడితే చాలు.. రూ.25 లక్షలు మీ సొంతం

LIC Policy : ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ ద్వారా రోజుకు రూ.45 ఆదా చేస్తూ మెచ్యూరిటీ సమయానికి రూ.25 లక్షల భారీ ఫండ్‌ను పొందవచ్చు. ఎలాగో ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 26 2026, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ ప్రత్యేకత ఏంటో తెలుసా?
Image Credit : chatgpt

ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ ప్రత్యేకత ఏంటో తెలుసా?

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన భారతీయ జీవిత బీమా సంస్థ అందించే పాలసీలు ఎల్లప్పుడూ సురక్షితమైనవిగా, మంచి రాబడినిచ్చేవిగా పేరుగాంచాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి అవసరాలకు తగినట్టు ఎల్‌ఐసీ వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తోంది. ఈ క్రమంలోనే మార్కెట్లో ఎన్నో ప్రత్యేకమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి.

తక్కువ మొత్తంలో డబ్బును పొదుపు చేస్తూ భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఫండ్‌ను కూడబెట్టుకోవడానికి ఈ ప్లాన్‌లు బాగా ఉపయోగపడతాయి. అలాంటి అద్భుతమైన స్కీమ్‌లలో 'ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ' ఒకటి. ఈ పాలసీ ద్వారా మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షల వరకు సులభంగా పొందవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాలసీ విశేషాలు.. కనీస అర్హతలు ఇవే
Image Credit : Asianet News

పాలసీ విశేషాలు.. కనీస అర్హతలు ఇవే

తక్కువ ప్రీమియం చెల్లిస్తూ భారీ మొత్తంలో డబ్బును కూడబెట్టాలనుకునే వారికి ఈ ప్లాన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది సాధారణ టర్మ్ పాలసీ లాగే పనిచేస్తుంది. మీ పాలసీ ఎంత కాలం ఉంటే, మీరు అంతే కాలం పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా అనేక రకమైన మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో కనీస బీమా మొత్తం రూ. లక్ష నుంచి ప్రారంభమవుతుంది. అయితే, గరిష్ఠ పరిమితికి సంబంధించి ఎలాంటి పరిమితి లేదు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి పెట్టుబడి మొత్తాన్ని ఎంచుకోవచ్చు.

35
రోజుకు రూ.45 ఆదా చేస్తే చాలు
Image Credit : Asianet News

రోజుకు రూ.45 ఆదా చేస్తే చాలు

ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో నెలకు సుమారు రూ.1,358 చొప్పున జమ చేయడం ద్వారా రూ.25 లక్షల భారీ మొత్తాన్ని పొందవచ్చు. దీన్ని బట్టి చూస్తే, మీరు రోజుకు కేవలం రూ.45 మాత్రమే ఆదా చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ పాలసీని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్‌గా పరిగణించాలి.

ఈ పాలసీ కాలపరిమితి 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉదాహరణకు, మీరు రోజుకు రూ.45 చొప్పున ఆదా చేస్తూ 35 సంవత్సరాల పాటు ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ పూర్తి అయిన తర్వాత మీకు రూ.25 లక్షల నికర మొత్తం చేతికి అందుతుంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే మీరు దాచే మొత్తం ఏడాదికి సుమారు రూ.16,300 అవుతుంది.

45
డబుల్ బోనస్ లాభాలు.. టోటల్ అమౌంట్ లెక్కలు ఇవే
Image Credit : Asianet News

డబుల్ బోనస్ లాభాలు.. టోటల్ అమౌంట్ లెక్కలు ఇవే

మీరు ఈ ఎల్‌ఐసీ పాలసీలో ప్రతి ఏటా రూ.16,300 చొప్పున 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, మొత్తం కాలానికి మీరు జమ చేసే అసలు మొత్తం రూ.5,70,500 అవుతుంది. ఇక పాలసీ నిబంధనల ప్రకారం.. ఇందులో బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు ఉంటుంది.

దీనికి అదనంగా మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత రివిజనరీ బోనస్ కింద రూ.8.60 లక్షలు, ఫైనల్ బోనస్ కింద రూ.11.50 లక్షలు కలుపుకుని చెల్లిస్తారు. ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో రెండు సార్లు బోనస్ లభిస్తుంది. అయితే దీనికోసం మీ పాలసీ కనీసం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.

55
అదనపు ప్రయోజనాలు ఏమిటి?
Image Credit : ISTOCK

అదనపు ప్రయోజనాలు ఏమిటి?

ఈ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకునే వారికి ఎలాంటి పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభించవు. అయితే, దీనిలో అదనంగా నాలుగు రకాల రైడర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసబిలిటీ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్ వంటివి ఉన్నాయి. ఇక డెత్ బెనిఫిట్ విషయానికొస్తే.. పాలసీదారుడు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే, నామినీకి పాలసీ బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 125 శాతం డెత్ బెనిఫిట్ నేరుగా అందుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Price: రూ. 4 లక్షల నుంచి రూ. 2 లక్షల కంటే తక్కువకు.. వెండి ధర ఎందుకు తగ్గుతోంది?
Recommended image2
Gold Silver Price: దీపావళికి ముందే పసిడి షాక్.. తగ్గుదలకు బ్రేక్, మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
Recommended image3
Tea Seller: టీ కొట్టుతో నెలకు రూ.9లక్షల సంపాదన.. ఈ ఓనర్ బిజినెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు
Related Stories
Recommended image1
IRCTC Jyotirlinga Yatra: ఒక్క టికెట్‌తో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image2
Bullet Train India: సముద్రం అడుగున దూసుకెళ్లే బుల్లెట్ రైలు.. రూట్ మ్యాప్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved