MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • IRCTC Jyotirlinga Yatra: ఒక్క టికెట్‌తో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ

IRCTC Jyotirlinga Yatra: ఒక్క టికెట్‌తో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ

IRCTC Jyotirlinga Yatra: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 10 రాత్రులు, 11 రోజులు సాగే ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభం కానుంది? ఏ ప్రాంతాలు సందర్శిస్తాము? పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 26 2026, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర విశేషాలు
Image Credit : chatgpt

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర విశేషాలు

ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని ముందుకు తెచ్చింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ లిమిటెడ్ 'సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర' పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

ఈ యాత్రను భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ టూర్ కోడ్ SCZBG68గా అధికారులు నిర్ణయించారు. ఈ ప్యాకేజీ ద్వారా ప్రయాణికులు దేశంలోని ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను సులభంగా దర్శించుకోవచ్చు. ఈ టూర్ మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యాత్ర నవంబర్ 10వ తేదీన ప్రారంభమవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి?
Image Credit : GEMINI

ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి?

ఈ టూర్‌లో భాగంగా మొత్తం ఏడు ముఖ్యమైన జ్యోతిర్లింగాలను సందర్శించవచ్చు. ఉజ్జయినిలోని మహాకలేశ్వర్, ఓంకారేశ్వర్, ద్వారకలోని నాగేశ్వర్, సోమనాథ్‌లోని సోమనాథ్ జ్యోతిర్లింగాలు ఈ టూర్‌లో ఉన్నాయి. అలాగే పూణేలో భీమశంకర్, నాసిక్‌లో త్రయంబకేశ్వర్, ఛత్రపతి శంభాజీనగర్ లోని గ్రిహ్నేశ్వర్ జ్యోతిర్లింగాలను ఈ టూర్‌లో కవర్ చేస్తారు.

వీటితో పాటు ద్వారకాధీష్ మందిర్, బేట్ ద్వారక, ఓజార్‌లోని శ్రీ విఘ్నహర్ అష్టవినాయక గణపతి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. భీమశంకర్ ఆలయంలో నిర్మాణ పనుల కారణంగా ఈ ఏడాది జూన్ 15 నుంచి ఉదయం 7:00 గంటల నుంచి 11:00 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు ఐఆర్‌సీటీసీ తెలిపింది.

35
రైలు బోర్డింగ్, డీ-బోర్డింగ్ స్టేషన్లు ఇవే
Image Credit : Gemini

రైలు బోర్డింగ్, డీ-బోర్డింగ్ స్టేషన్లు ఇవే

ఈ టూర్ కోసం ప్రయాణికులు సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, ధర్మాబాద్, ముద్ఖేడ్ జంక్షన్, హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణా జంక్షన్లలో రైలు ఎక్కవచ్చు. యాత్ర ముగిసిన తర్వాత తిరిగి ఇదే మార్గంలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు చేరుకోవడానికి దిగే సౌకర్యం కల్పించారు. ఈ రైలులో మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్‌లో 237 సీట్లు, 3ఏసీ క్లాస్‌లో 416 సీట్లు, 2ఏసీ క్లాస్‌లో 52 సీట్లు ఉన్నాయి.

45
టూర్ ప్యాకేజీ ధరల వివరాలు ఇవే
Image Credit : Gemini

టూర్ ప్యాకేజీ ధరల వివరాలు ఇవే

రైలు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ రైలు పథకం కింద సుమారు 33 శాతం రాయితీని అందిస్తోంది. ఈ రాయితీని మినహాయించి జీఎస్టీతో కలిపి ఒక్కో వ్యక్తికి ధరలు నిర్ణయించారు. ఎకానమీ (SL) కేటగిరీలో పెద్దలకు రూ. 18,000, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ. 16,700గా ఉంది. స్టాండర్డ్ (3AC) కేటగిరీలో పెద్దలకు రూ. 27,400, పిల్లలకు రూ. 25,900 చెల్లించాలి. కంఫర్ట్ (2AC) కేటగిరీలో పెద్దలకు రూ. 35,500, పిల్లలకు రూ. 33,600గా ధరను ఖరారు చేశారు. సింగిల్‌గా బుక్ చేసుకునే ప్రయాణికులు ఇతర ప్రయాణికులతో షేరింగ్ ప్రాతిపదికన గదిని పంచుకోవాల్సి ఉంటుంది.

55
ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి?
Image Credit : chatgpt

ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి?

ఈ టూర్ ప్యాకేజీ ఎంచుకున్న ప్రయాణికులకు రైలు ప్రయాణం, రాత్రి బస, వాష్ అండ్ చేంజ్ కోసం వసతి, రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఎకానమీ క్లాస్‌లో నాన్-ఏసీ వసతి, నాన్-ఏసీ వాహనాలు ఇస్తారు. స్టాండర్డ్, కంఫర్ట్ క్లాస్‌లలో ఏసీ రూమ్‌లు, తగిన సదుపాయాలు అందిస్తారు.

ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ప్రెషెట్ మెనూ ప్రకారం అందిస్తారు. అంతేకాకుండా ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్, రైలులో భద్రత, టూర్ మేనేజర్ల సేవలు, అన్ని వర్తింపజేసే పన్నులు ఈ ప్యాకేజీ కింద లభిస్తాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఆలయాల దర్శన రుసుములు, బోటింగ్, వ్యక్తిగత ఖర్చులు ఇందులో ఉండవు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
తెలంగాణ
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vizag Beach: విశాఖపట్నం వెళితే ఈ బీచ్ చూడకుండా రాకండి.. కొండలు, కొబ్బరితోటలతో నిండిన గంగవరం బీచ్
Recommended image2
Gandhi: కరెన్సీ నోటుపై ఉండే గాంధీ ఫోటోను ఎవరు, ఎప్పుడు తీశారో తెలుసా?
Recommended image3
వేరే బ్ల‌డ్ గ్రూప్ ర‌క్తం ఎక్కిస్తే ఏమ‌వుతుంది.? ప్రాణాల‌కే ప్ర‌మాదమా.?
Related Stories
Recommended image1
LIC: ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లు కడితే చాలు జీవితాంతం అకౌంట్‌లోకి డబ్బులు
Recommended image2
Bullet Train India: సముద్రం అడుగున దూసుకెళ్లే బుల్లెట్ రైలు.. రూట్ మ్యాప్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved