MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.499, రూ.799 అంటూ ధరలను 9తోనే ఎందుకు ముగిస్తారు? ఇందులో ఎంత సైకాల‌జీ ఉందో తెలుసా?

రూ.499, రూ.799 అంటూ ధరలను 9తోనే ఎందుకు ముగిస్తారు? ఇందులో ఎంత సైకాల‌జీ ఉందో తెలుసా?

Price: షాపింగ్‌ చేసేటప్పుడు చాలా ప్రొడ‌క్ట్‌ ధరలు రూ.499, రూ.799, రూ.999 ఇలా 9 లేదా 99తో ముగియడం మీరు గమనించే ఉంటారు. అయితే వ్యాపారులు ఇలా ఎందుకు ధరలు నిర్ణయిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.? దీని వెన‌కాల పెద్ద సైకాల‌జీ దాగి ఉంది. అదేంటంటే..

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 13 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.499 అని ఎందుకు పెడతారు?
Image Credit : Gemini AI

రూ.499 అని ఎందుకు పెడతారు?

రూ.500కి బదులుగా రూ.499 ధరను చూస్తే కేవలం ఒక్క రూపాయి మాత్రమే తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మన మెదడు ఈ రెండు ధరలను ఒకే విధంగా చూడదు. రూ.500 కంటే రూ.499 తక్కువ ధరగా అనిపిస్తుంది. దీనినే మార్కెటింగ్‌లో ‘చార్మ్ ప్రైసింగ్’ (Charm Pricing) అంటారు. ధర చివరలో 9, 99 వంటి అంకెలను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి మరింత చౌకగా ఉందనే భావనను వినియోగదారుల్లో కలిగించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు రూ.799 ధర ఉన్న వస్తువు, రూ.800 కంటే తక్కువ ధరలో ఉందనే భావన కలిగిస్తుంది. వాస్తవానికి తేడా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అయినా, ధరను చూసే విధానంలో మాత్రం మార్పు వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
‘లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్’ అంటే ఏంటి.?
Image Credit : Gemini AI

‘లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్’ అంటే ఏంటి.?

9తో ముగిసే ధరల వెనుక మరో మానసిక అంశం ‘లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్’. అంటే మనం ధరను చూసేటప్పుడు మొదటి అంకెపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రూ.499 ధరను చూసినప్పుడు మన మెదడు మొదట ‘4’ను గుర్తిస్తుంది. అదే రూ.500 అయితే మొదటి అంకె ‘5’ అవుతుంది. దీంతో రూ.499 ధర రూ.500 కంటే గణనీయంగా తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇదే విధంగా రూ.999 ధర కూడా రూ.1,000 కంటే తక్కువగా అనిపిస్తుంది. ఈ చిన్న తేడాను ఉపయోగించుకుని వ్యాపారులు ఉత్పత్తుల ధరలను వినియోగదారులకు ఆకర్షణీయంగా చూపిస్తారు.

Related Articles

Related image1
Highway: ఇక‌పై ఆ దేశాల‌కు కారులో వెళ్లిపోవ‌చ్చు.. 1360 కి.మీల భారీ ర‌హ‌దారి నిర్మాణం
Related image2
ఈ అగ్గిపుల్ల‌ను ఎన్నిసార్లు వెలిగించినా వెలుగుతూనే ఉంటుంది.. బెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్
35
అసలీ విధానం ఎలా మొదలైంది.?
Image Credit : Asianet News

అసలీ విధానం ఎలా మొదలైంది.?

9 లేదా 99తో ధరలను ముగించే పద్ధతి కొత్తది కాదు. దీని మూలాలు 1900ల ప్రారంభంలోనే ఉన్నాయని చెబుతారు. ఆ సమయంలో కొన్ని దుకాణాల్లో ప్రొడక్ట్ ల ధరను పూర్తి మొత్తంగా కాకుండా 99 సెంట్లకు ముగించేలా పెట్టేవారు. ఉదాహరణకు ఒక వస్తువు ధర ఒక డాలర్‌ కాకుండా 99 సెంట్లుగా ఉండేది. దీనివల్ల కస్టమర్‌కు చిల్లర ఇవ్వడానికి క్యాష్‌ రిజిస్టర్‌ను తెరవాల్సి వచ్చేది. దీంతో ఉద్యోగులు డబ్బును తీసుకుని లావాదేవీ నమోదు చేయకుండా తమ వద్దే ఉంచుకునే అవకాశాన్ని తగ్గించవచ్చని వ్యాపారులు భావించేవారు. తర్వాత కాలక్రమేణా ఈ పద్ధతి కేవలం నగదు లావాదేవీల కోసం ఉపయోగించే విధానం కాకుండా మార్కెటింగ్ వ్యూహంగా కూడా మారింది.

45
9తో ముగిసే ధర అంటే నిజంగా తక్కువ ధరేనా?
Image Credit : Getty

9తో ముగిసే ధర అంటే నిజంగా తక్కువ ధరేనా?

ఇందులో నిజం లేదు రూ.499 అని ధర ఉన్నంత మాత్రాన అది రూ.500 వస్తువు కంటే మంచి డీల్‌ అని చెప్పలేం. ధర చివర్లో 9 ఉండటం వల్ల ఉత్పత్తి నిజంగా చౌకగా మారదు. కొన్ని పరిశోధనల్లో 9తో ముగిసే ధరలు వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ధరలతో ఉన్న వస్తువులు సగటున మరింత ఎక్కువ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉందని పరిశోధనలు సూచించాయి. అందుకే కేవలం రూ.999, రూ.499, రూ.799 వంటి ధరలను చూసి వెంటనే మంచి ఆఫర్‌ అని భావించకూడదు. ఇతర దుకాణాల్లో అదే ఉత్పత్తి ధర ఎంత ఉంది? డిస్కౌంట్‌ నిజంగా ఎంత? ఉత్పత్తి నాణ్యత ఎలా ఉంది? వంటి అంశాలను కూడా పరిశీలించాలి.

55
5, 7, 9తో పాటు ఇతర అంకెలను కూడా ఎందుకు ఉపయోగిస్తారు?
Image Credit : Google

5, 7, 9తో పాటు ఇతర అంకెలను కూడా ఎందుకు ఉపయోగిస్తారు?

వ్యాపారులు కేవలం 9తోనే ధరలను ముగించరు. కొన్ని ఉత్పత్తులకు 5, 7 వంటి అంకెలతో కూడా ధరలను నిర్ణయిస్తారు. ఇలా చేయడం ద్వారా ఉత్పత్తి ధరను ఒక నిర్దిష్ట స్థాయిలో ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తారు. మరోవైపు, కొన్ని లగ్జరీ ఉత్పత్తులకు పూర్తి సంఖ్యలు లేదా ఇతర రకాల ధరలను ఉపయోగిస్తారు. దీని ద్వారా ప్రొడ‌క్ట్‌ ఖరీదైనదిగా, నాణ్యమైనదిగా, ప్రత్యేకమైనదిగా కనిపించేలా చేయవచ్చు. అంటే ధర నిర్ణయించే విధానం ప్రొడ‌క్ట్‌ రకం, టార్గెట్‌ కస్టమర్లు, మార్కెట్ పరిస్థితులు, బ్రాండ్ ఇమేజ్‌ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

మొత్తంగా చూస్తే.. రూ.499, రూ.799, రూ.999 వంటి ధరలు కేవలం ఒక్క రూపాయి తగ్గించి చూపించేందుకు మాత్రమే కాదు. వినియోగదారుల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సైకాలజికల్ ప్రైసింగ్‌ వ్యూహం. కాబట్టి షాపింగ్‌ చేసేటప్పుడు ధర చివర్లో 9 ఉందని మాత్రమే అట్రాక్ట్ కాకుండా, అసలు ఉత్పత్తి ధర, నాణ్యత, ఇతర చోట్ల ధరలను కూడా పోల్చి చూడటం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
వైరల్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold price Hike: గోల్డ్ మార్కెట్‌లో కలకలం.. రికార్డు స్థాయికి చేరిన ధరలు!
Recommended image2
Independence Day: 1947 vs 2026.. ఉద్యోగాల వేట ఎలా మారింది? ఏఐ దెబ్బకు ఏ ఉద్యోగాలు పోతున్నాయి?
Recommended image3
Cars Under 5 Lakhs: రూ.5 లక్షల లోపు కారు కొనాలనుకుంటే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవిగో
Related Stories
Recommended image1
Highway: ఇక‌పై ఆ దేశాల‌కు కారులో వెళ్లిపోవ‌చ్చు.. 1360 కి.మీల భారీ ర‌హ‌దారి నిర్మాణం
Recommended image2
ఈ అగ్గిపుల్ల‌ను ఎన్నిసార్లు వెలిగించినా వెలుగుతూనే ఉంటుంది.. బెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved