MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Gold price Hike: గోల్డ్ మార్కెట్‌లో కలకలం.. రికార్డు స్థాయికి చేరిన ధరలు!

Gold price Hike: గోల్డ్ మార్కెట్‌లో కలకలం.. రికార్డు స్థాయికి చేరిన ధరలు!

Gold price Hike: బంగారం మళ్లీ భగ్గుమంటోంది.10 గ్రాముల ధర రూ.1.55 లక్షలు దాటేసింది. ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న ధరలకు మరింత పెరుగుదల తోడవటంతో కొనుగోలుదారుల్లో ఆందోళన పెరుగుతోంది. పండుగలు, వివాహాల సీజన్ ‍తో బంగారం కొనాలనుకునేవారికి భారంగా మారుతోంది.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 13 2026, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బ్రేక్ లేకుండా పెరుగుతున్న గోల్డ్
Image Credit : chatgpt

బ్రేక్ లేకుండా పెరుగుతున్న గోల్డ్

ఆగస్టు 13న హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130గా కొనసాగుతోంది. బుధవారంతో పోలిస్తే రూ.270 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,200 వద్ద ఉంది. ఇందులోనూ రూ.250 పెరుగుదల నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధర కిలోకు సుమారు రూ.2.60 లక్షల స్థాయిలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలు బంగారం ఎందుకు పెరుగుతోంది?
Image Credit : Getty

అసలు బంగారం ఎందుకు పెరుగుతోంది?

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే. దేశీయంగా ధరలు స్వల్పంగా పెరిగినా.. అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలే బంగారం తదుపరి దిశను నిర్ణయించే అవకాశం ఉంది. సాధారణంగా డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడం బంగారానికి ప్రతికూలంగా పనిచేస్తాయి. ఎందుకంటే బంగారం ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వదు. మరోవైపు బాండ్లపై రాబడులు పెరిగితే పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయంగా అమెరికా బాండ్లు ఆకర్షణీయంగా మారతాయి. అలాగే డాలర్ బలపడితే ఇతర కరెన్సీల్లో బంగారం ఖరీదుగా మారుతుంది. దీంతో గోల్డ్‌పై ఒత్తిడి రావచ్చు.

కానీ ప్రస్తుతం మార్కెట్‌లో మరో అంశం ఈ ప్రభావాన్ని బ్యాలెన్స్ చేస్తోంది. అదే అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై ఉన్న అంచనాలు. అమెరికాలో జూలై CPI డేటా మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వచ్చింది. హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం ఏడాది ప్రాతిపదికన 3.4 శాతంగా, కోర్ CPI 2.5 శాతంగా నమోదైంది. ఈ డేటా ఊహించినంత వేడిగా లేకపోవడంతో వెంటనే సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయం కొంత తగ్గింది.

34
అంతర్జాతీయ మార్కెట్‌లో ఏం జరుగుతోంది?
Image Credit : Getty

అంతర్జాతీయ మార్కెట్‌లో ఏం జరుగుతోంది?

అంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు డాలర్, బాండ్ యీల్డ్స్ బంగారంపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు ఫెడ్ పాలసీపై మారుతున్న అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారాన్ని సేఫ్-హేవెన్ ఆస్తిగా నిలబెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ తాజాగా 4,400 డాలర్ల స్థాయిని దాటినట్లు మార్కెట్ రిపోర్టులు సూచిస్తున్నాయి. జూలై అమెరికా CPI డేటా తర్వాత సెప్టెంబర్ ఫెడ్ రేటు పెంపు భయాలు తగ్గాయి.

44
మరి దేశీయంగా ధరలు ఇంకా పెరుగుతాయా?
Image Credit : iSTOCK

మరి దేశీయంగా ధరలు ఇంకా పెరుగుతాయా?

మొత్తానికి.. బంగారం ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1.55 లక్షలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఫెడ్ రేటు అంచనాలు, అమెరికా CPI, డాలర్, బాండ్ యీల్డ్స్‌తో పాటు భౌగోళిక రాజకీయ పరిణామాలు పసిడి మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఏ దిశలో వెళ్తాయన్నది తెలుసుకోవాలంటే.. అమెరికా నుంచి వచ్చే ప్రతి కీలక ఆర్థిక డేటాపై గోల్డ్ మార్కెట్ ఎలా స్పందిస్తుందో గమనించాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
Gold Price Hike: బ్రేకుల్లేకుండా పసిడి ధరలకు రెక్కలు..అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్ తో పైపైకి
Recommended image2
Gold Price Hike: నిన్న రూ.3 వేలు.. ఇవాళ మరో రూ.వెయ్యి...సామాన్యులపై బంగారం బాదుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved