- Home
- Entertainment
- Jobs: యాంకర్ సుమతో కలిసి పనిచేయాలని ఉందా.? మంచి జీతంతో పాటు పేరు, ప్రఖ్యాతలు కూడా
Jobs: యాంకర్ సుమతో కలిసి పనిచేయాలని ఉందా.? మంచి జీతంతో పాటు పేరు, ప్రఖ్యాతలు కూడా
Jobs: సినిమా ప్రమోషన్ ఏదైనా స్టేజ్‌పై యాంకర్ సుమ ఉండల్సిందే. తెలుగు వారికి సుమాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మరి ఇలాంటి క్రేజీ యాంకర్‌తో కలిసి పని చేసే అవకాశం వస్తే భలే ఉంటుంది కదూ.!

సుమా ఫిల్మీ ఆర్ట్స్‌లో ఉద్యోగాలు
సుమా ఫిల్మీ ఆర్ట్స్ అనేది సినిమా కంటెంట్, డిజిటల్ మీడియా, బ్రాండ్ ప్రమోషన్స్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ సంస్థ. సినిమా వార్తలు, రివ్యూలు, ప్రమోషనల్ కంటెంట్, బ్రాండ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్‌లో నాణ్యమైన పనితీరుతో ముందుకెళ్తోంది. యువతకు అవకాశాలు కల్పిస్తూ, సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇచ్చే ప్లాట్ ఫామ్ గా ఈ సంస్థ పేరు సంపాదించింది.
ప్రస్తుతం ఉన్న ఖాళీలు
సుమా ఫిల్మీ ఆర్ట్స్ ప్రస్తుతం అనుభవం ఉన్న, నైపుణ్యాలతో కూడిన అభ్యర్థులను నియమించుకుంటోంది. ప్రస్తుతం కంటెంట్ రైటర్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్లు, ఎడిటర్స్ పోస్టులు ఉన్నాయి. సినిమా రంగం, బ్రాండ్ మార్కెటింగ్‌కు సంబంధించిన కంటెంట్ రూపొందించడం, మేనేజ్‌మెంట్ బాధ్యతలు నిర్వహించడం ఈ ఉద్యోగాల ప్రధాన లక్ష్యం.
జాబ్ ప్రొఫైల్ – బాధ్యతలు
కంటెంట్ రైటర్స్:
సినిమాలు, సెలబ్రిటీలు, బ్రాండ్లకు సంబంధించిన ఆకట్టుకునే ఆర్టికల్స్, స్క్రిప్ట్స్, ప్రమోషనల్ కంటెంట్ రాయాలి. భాషపై పట్టు, క్రియేటివ్ ఆలోచనలు అవసరం.
బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్లు:
బ్రాండ్ క్లయింట్స్‌తో సమన్వయం, కొత్త బిజినెస్ అవకాశాల గుర్తింపు, మార్కెటింగ్ స్ట్రాటజీల రూపకల్పన వంటి బాధ్యతలు ఉంటాయి.
ఎడిటర్స్:
రాసిన కంటెంట్‌ను ఎడిట్ చేయడం, నాణ్యతను మెరుగుపరచడం, ఫాక్ట్ చెక్ చేయడం, ప్రచురణకు సిద్ధం చేయడం ప్రధాన పని.
అర్హతలు, అవసరమైన నైపుణ్యాలు
* సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
* భాషపై బలమైన పట్టు ఉండాలి.
* సినిమా, డిజిటల్ మీడియా, బ్రాండ్ మార్కెటింగ్‌పై ఆసక్తి.
* టైమ్ మేనేజ్‌మెంట్, టీమ్‌తో పని చేసే సామర్థ్యం
* కంటెంట్ ట్రెండ్స్‌పై అవగాహన
* అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఉద్యోగ స్థలం, అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగాలన్నీ హైదరాబాద్ కేంద్రంగా ఉంటాయి. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ: జనవరి 31. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను teamsumakanakala@gmail.com కు మెయిల్ చేయాలి. క్రియేటివిటీ, కంటెంట్ పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి కెరీర్ అవకాశంగా చెప్పొచ్చు.

