MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • ఏ ప‌ని చేయ‌కుండానే ప్ర‌తీ నెల రూ. 20 వేలు.. రిటైర్మైంట్ త‌ర్వాత మీ లైఫ్ బిందాస్‌గా ఉండాలంటే

ఏ ప‌ని చేయ‌కుండానే ప్ర‌తీ నెల రూ. 20 వేలు.. రిటైర్మైంట్ త‌ర్వాత మీ లైఫ్ బిందాస్‌గా ఉండాలంటే

Post Office: రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం చాలామంది సురక్షిత పెట్టుబడులను చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ హామీతో నడిచే సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒకేసారి పెట్టుబడి పెడితే ప్రతి త్రైమాసికం వడ్డీ వస్తుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 15 2026, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అసలేంటీ సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్‌.?
Image Credit : Getty

అసలేంటీ సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్‌.?

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్ స్కీమ్ (SCSS) అనేది వృద్ధులకు లక్ష్యంగా రూపొందించిన చిన్న పొదుపు పథకం. ఈ ప‌థ‌కంలో చేరడానికి కొన్ని అర్హ‌త‌ల‌ను పేర్కొన్నారు. అవేంటంటే..

* 60 ఏళ్లు పూర్తి చేసిన వారు.

* 55–60 ఏళ్ల మధ్య వయస్సులో VRS తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు.

* 50–60 ఏళ్ల మధ్య రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది

* వ్యక్తిగత అకౌంట్ లేదా భార్యాభర్తల జాయింట్ అకౌంట్ ప్రారంభించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వడ్డీ రేటు ఎంత? ఆదాయం ఎలా వస్తుంది?
Image Credit : Getty

వడ్డీ రేటు ఎంత? ఆదాయం ఎలా వస్తుంది?

ప్రస్తుతం ఈ పథకంపై వార్షిక వడ్డీ రేటు 8.2%గా ఉంది. వడ్డీని త్రైమాసికం వారీగా చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక వ్య‌క్తి ఈ ప‌థ‌కంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే 8.2% ప్రకారం సంవత్సరానికి వడ్డీ రూ.2,46,000 ల‌భిస్తుంది. ఈ మొత్తాన్ని 12 నెలలకు విభజిస్తే నెలకు సుమారు రూ.20,500 వస్తుంది. బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లతో పోలిస్తే ఈ రాబడి ఎక్కువగా ఉంటుంది.

పెట్టుబడి పరిమితి, కాలపరిమితి

* గరిష్ట పెట్టుబడి పరిమితి: రూ.30 లక్షలు వ‌ర‌కు పెట్టొచ్చు.

* మెచ్యూరిటీ కాలం: 5 సంవత్సరాలు ఉంటుంది.

* అవసరమైతే మరింత కాలం పొడిగించుకునే అవకాశం ఉంటుంది

* రిటైర్మెంట్ తర్వాత క‌చ్చితమైన క్యాష్ ఫ్లో కావాలనుకునే వారికి ఇది బలమైన ఆప్షన్.

35
పన్ను ప్రయోజనాలు
Image Credit : Getty

పన్ను ప్రయోజనాలు

ఈ పథకంలో పెట్టిన మొత్తం మీద ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. అయితే వడ్డీ ఆదాయం పన్నుకు లోబడి ఉంటుంది. నిర్దిష్ట పరిమితి దాటితే TDS కూడా కట్ అవుతుంది. కాబట్టి పన్ను ప్రణాళికను ముందుగానే ఆలోచించడం మంచిది.

45
అకౌంట్ ఎలా ప్రారంభించాలి.?
Image Credit : Post Office\Twitter

అకౌంట్ ఎలా ప్రారంభించాలి.?

సమీప పోస్టాఫీస్ శాఖలో SCSS అకౌంట్ తెరవవచ్చు. ఇందుకోసం అవసరమైన పత్రాలు:

* ఆధార్

* పాన్

* వయస్సు రుజువు

* రిటైర్మెంట్ సర్టిఫికేట్ (అర్హత ఉన్నవారికి)

ముందస్తు క్లోజింగ్ నిబంధనలు:

* 1 సంవత్సరం లోపు మూసితే వడ్డీ లభించదు

* 1–2 సంవత్సరాల మధ్య మూసితే డిపాజిట్‌పై 1.5% తగ్గింపు

* 2–5 సంవత్సరాల మధ్య మూసితే 1% తగ్గింపు

55
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు తీసుకునే సౌలభ్యం ఉన్నా..
Image Credit : Generated by google gemini AI

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు తీసుకునే సౌలభ్యం ఉన్నా..

మొత్తం మీద రిస్క్ తీసుకోకుండా స్థిర ఆదాయం కోరుకునే వృద్ధులకు SCSS మంచి మార్గం. పెద్ద మొత్తం పెట్టుబడి పెడితే ప్రతి నెల ఖర్చులకు సరిపడే ఆదాయం వస్తుంది. ప్రభుత్వ భద్రత, ఆకర్షణీయ వడ్డీ, పన్ను ప్రయోజనాలు – ఇవన్నీ కలిపి ఈ పథకాన్ని విశ్వసనీయ ఎంపికగా నిలబెడుతున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Recommended image2
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Recommended image3
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Related Stories
Recommended image1
IND vs PAK: ‘అభిషేక్ బ్యాట్‌ను గాలికి ఊపుతాడంతే’.. హ‌ర్భ‌జ‌న్ దిమ్మ‌తిరిగే కౌంటర్
Recommended image2
Business Ideas: రూ. 2 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో నెల‌కు రూ. 30 వేల ఆదాయం.. ఉన్న ఊరిలో ఉండే సంపాద‌న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved