MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK: ‘అభిషేక్ బ్యాట్‌ను గాలికి ఊపుతాడంతే’.. హ‌ర్భ‌జ‌న్ దిమ్మ‌తిరిగే కౌంటర్

IND vs PAK: ‘అభిషేక్ బ్యాట్‌ను గాలికి ఊపుతాడంతే’.. హ‌ర్భ‌జ‌న్ దిమ్మ‌తిరిగే కౌంటర్

IND vs PAK: మ‌రికాసేప‌ట్లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ స‌మ‌యంలో స్టేడియం బ‌య‌ట మాటల యుద్ధం న‌డుస్తోంది. అభిషేక్ శ‌ర్మ‌పై పాకిస్థాన్ మాజీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ఆమిర్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 15 2026, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్ శర్మపై ఆమిర్ వ్యాఖ్యలు..
Image Credit : ANI

అభిషేక్ శర్మపై ఆమిర్ వ్యాఖ్యలు..

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకమైన ఉత్కంఠ. మైదానంలో ఆటగాళ్ల మధ్య పోటీ ఎలా ఉంటుందో, మైదానం బయట మాటల యుద్ధం కూడా అలాగే సాగుతుంది. తాజాగా జరిగిన చర్చల్లో యువ ఆటగాడు అభిషేక్ శర్మపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వాటికి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మాటల తూటాలు
Image Credit : AFP + Getty

మాటల తూటాలు

భారత్, పాకిస్థాన్ జట్లు తలపడే మ్యాచ్‌కు ముందు టాక్ షోలు, చర్చలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన మహ్మద్ ఆమిర్, అభిషేక్ శర్మను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశాడు. అతడు సాంకేతికంగా బలమైన బ్యాటర్ కాదని, సరైన ప్రణాళికతో బౌలింగ్ చేస్తే అతడిని త్వరగా ఔట్ చేయవచ్చని అభిప్రాయపడ్డాడు.

35
‘స్లాగర్’ అంటూ వ్యాఖ్య
Image Credit : Getty

‘స్లాగర్’ అంటూ వ్యాఖ్య

ఆమిర్ వ్యాఖ్యల్లో ముఖ్యంగా “స్లాగర్” అన్న పదం ఎక్కువ చర్చకు దారి తీసింది. అంటే టెక్నిక‌ల్‌గా కాకుండాప్రతి బంతిని బలంగా కొట్టే ఆటగాడిగా అభిషేక్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. ఈ వ్యాఖ్యలపై అభిమానులు తీవ్రంగా స్పందించారు. విమర్శలు పెరగడంతో ఆమిర్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. అభిషేక్ ఇంకా పూర్తిగా తన ప్రతిభను నిరూపించాల్సి ఉందని క‌వ‌ర్ చేసుకున్నాడు.

45
హర్భజన్ ఘాటు కౌంటర్
Image Credit : ANI

హర్భజన్ ఘాటు కౌంటర్

ఈ వ్యాఖ్యలు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ దృష్టికి చేరాయి. ఆయన ఆమిర్ వ్యాఖ్యలను ఖండిస్తూ గట్టిగా స్పందించాడు. అభిషేక్‌ను స్లాగర్ అని పిలవడం సరైంది కాదని, అతడు సంపూర్ణ బ్యాటర్ అని స్పష్టం చేశాడు. అభిషేక్‌కు అన్ని రకాల షాట్లు ఆడే సామర్థ్యం ఉందని, బంతి లైన్, లెంగ్త్‌కు అనుగుణంగా షాట్ ఎంచుకునే తెలివి అతనికి ఉందని హర్భజన్ వివరించాడు. ఓవర్ కవర్, లాంగాన్, లాంగాఫ్, మిడ్ వికెట్ వంటి అన్ని ప్రాంతాల్లో షాట్లు ఆడగలడని ప్రశంసించాడు.

55
అభిషేక్ ప్రతిభపై విశ్వాసం
Image Credit : Getty

అభిషేక్ ప్రతిభపై విశ్వాసం

హర్భజన్ మాటల్లో అభిషేక్‌పై పూర్తి నమ్మకం స్పష్టంగా కనిపించింది. అంతర్జాతీయ స్టేడియంలలో ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్నాడని గుర్తు చేశాడు. ముఖ్యంగా పెద్ద మ్యాచ్‌లలో అతడు ప్రభావం చూపగలడని చెప్పాడు. కొలంబోలో కూడా అతడు మ్యాచ్ ఫలితాన్ని మార్చే సామర్థ్యం ఉన్న ఆటగాడని అభిప్రాయపడ్డాడు.

ఇక ఈ హర్భజన్ ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించాడు. ఏ ఆటగాడినైనా తేలికగా లేబుల్ వేయడం మంచిది కాదని సూచించాడు. నిజమైన స్లాగర్లు ఎవరో చెప్పాలంటే చాలా మందికి అసహనం కలగవచ్చని వ్యాఖ్యానించాడు. మొత్తానికి ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్ ముందు మాటల యుద్ధం మరింత వేడెక్కింది. అభిషేక్ శర్మపై వచ్చిన విమర్శలకు హర్భజన్ ఇచ్చిన సమాధానం అభిమానుల్లో జోష్ నిపింద‌ని చెప్పాలి. మ‌రి అభిషేక్ త‌న బ్యాటుతో ఎలాంటి స‌మాధానం చెప్తాడో చూడాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AFG vs IND: అభిషేక్ శ‌ర్మ విధ్వంసం, ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image2
IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. సంజూ వచ్చేశాడు.. భారత తుది జట్టు ఇదే
Recommended image3
Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్
Related Stories
Recommended image1
Business Ideas: రూ. 2 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో నెల‌కు రూ. 30 వేల ఆదాయం.. ఉన్న ఊరిలో ఉండే సంపాద‌న
Recommended image2
Zodiac sign: ఈ రాశి వారు ఈ వారం జాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.. చిన్న నిర్ల‌క్ష్యం చేసినా పెద్ద మూల్యం త‌ప్ప‌దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved