MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన: రూ.15,000 ఇస్తున్న ప్రభుత్వం.. ఎలా పొందాలి? ఎవరు అర్హులు?

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన: రూ.15,000 ఇస్తున్న ప్రభుత్వం.. ఎలా పొందాలి? ఎవరు అర్హులు?

PM Viksit Bharat Rozgar Yojna: ఉద్యోగ అవకాశాలు పెంచే పీఎం వికసిత్ భారత్ ఉపాధి యోజనలో ఉద్యోగులకు రూ.15,000, కంపెనీలకు నెలకు రూ.3,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. దీనికి ఎవరు అర్హులు, ఎలా పొందాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 20 2025, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ఏమిటి? ఈ పథకం ఎందుకు తీసుకొచ్చారు?
Image Credit : Freepik@jcomp

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ఏమిటి? ఈ పథకం ఎందుకు తీసుకొచ్చారు?

దేశంలో కొత్త ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి జూలై 1, 2025న కేబినెట్ ఆమోదం లభించింది.

ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన (PMVBRY) ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. రెండు సంవత్సరాల పాటు అమలయ్యే ఈ పథకం ద్వారా 3.5 కోట్లకుపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకానికి రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనతో ఉద్యోగులకు కలిగే లాభాలు
Image Credit : Getty

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనతో ఉద్యోగులకు కలిగే లాభాలు

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఈపీఎఫ్ఓలో మొదటిసారిగా నమోదు చేసుకున్న ఉద్యోగులకు ఈ పథకం రెండు విడతలుగా రూ. 15,000 వరకు ఒక నెల జీతాన్ని అందిస్తుంది.

  • ఒకసారి గరిష్టంగా రూ.15,000 వరకు లభిస్తుంది.
  • దీనిని రెండు విడతలుగా చెల్లిస్తారు.
  • ఉద్యోగి నెలవారీ వేతనం (Basic + DA) ఆధారంగా ప్రోత్సాహకం నిర్ణయిస్తారు.
  • గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు జీతం పొందే ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు.
35
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన తో కంపెనీలకు కలిగే ప్రయోజనాలు
Image Credit : Getty

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన తో కంపెనీలకు కలిగే ప్రయోజనాలు

యజమానులు కూడా పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం ద్వారా కొన్ని ప్రయోజనాలు అందుకుంటారు. కొత్త ఉద్యోగులను నియమించుకున్న సంస్థలకు:

  • రూ.10,000 జీతం కలిగిన ఉద్యోగి పై నెలకు రూ.1,000
  • రూ.10,000 నుంచి 20,000 జీతం ఉంటే రూ.2,000
  • రూ.20,000 నుంచి 30,000 జీతం ఉంటే రూ.3,000 వరకూ సబ్సిడీ ఇస్తారు.

తయారీ రంగంలో ఉన్న కంపెనీలకు ఈ ప్రయోజనం రెండేళ్ల బదులు నాలుగేళ్ల పాటు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

45
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అర్హత ప్రమాణాలు ఏమిటి?
Image Credit : Getty

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అర్హత ప్రమాణాలు ఏమిటి?

  • 50 మందికిపైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం 5 కొత్త ఉద్యోగులను,
  • 50 మందికి తక్కువ ఉన్న సంస్థలు కనీసం ఇద్దరిని కొత్తగా ఉద్యోగంలో నియమించుకోవాలి.
  • కొత్తగా చేరిన ఉద్యోగులు కనీసం 6 నెలలు అదే సంస్థలో కొనసాగాలి.
  • సామాజిక భద్రతా చట్టం అయిన EPF & MP చట్టం 1952 కింద మినహాయింపు పొందిన సంస్థలు కూడా ఈ పథకానికి అర్హులుగా ఉన్నాయి.
55
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Image Credit : Getty

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం కింద ప్రయోజనం పొందడానికి ఉద్యోగులు అధికారిక పోర్టల్ లేదా UMANG యాప్ ద్వారా తమ UAN నంబర్ నమోదు చేసుకోవాలి. యజమానులు ECR (Electronic Challan-cum-Return) సమర్పించాలి. కొత్త, ప్రస్తుత ఉద్యోగులందరికీ యూఏఎన్ తప్పనిసరిగా తెరవాలి.

మొత్తంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన దేశంలో ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా, ఉద్యోగులకు ఆర్థిక భరోసా, కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
ప్రభుత్వ పథకాలు
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
మీ క్రెడిట్ స్కోరు పెంచుకునే సీక్రెట్ ట్రిక్స్ అండ్ సింపుల్ ఎఫెక్టివ్ టిప్స్
Recommended image2
దసరా సెలవులు.. ఏపీలో ఎన్ని రోజులు, తెలంగాణలో ఎన్ని రోజులో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved