- Home
- Business
- Pension scheme: రూ.55తో రూ. 3వేల పెన్షన్ పొందొచ్చు.. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే
Pension scheme: రూ.55తో రూ. 3వేల పెన్షన్ పొందొచ్చు.. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే
ఉద్యోగ విరమణ తర్వాత నెలనెలా పెన్షన్ పొందాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం అని అనుకుంటాం. కానీ అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారు కూడా పెన్షన్ పొందే అవకాశం ఉందని మీకు తెలుసా.?

సీనియర్ సిటిజన్ల కోసం పెన్షన్ పథకం
చాలా మంది వృద్ధులు ఉద్యోగం లేదా పనిని 60 ఏళ్ల వయసులో వదిలేస్తారు. ఆ తర్వాత వారికి స్థిరమైన ఆదాయం ఉండదు. దీనివల్ల రోజువారీ ఖర్చులకు కూడా కష్టమవుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి శ్రం యోగి మాన్‌ధన్ యోజన (PMSYM) అనే పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది.
KNOW
ఈ పథకం ఎవరి కోసం?
ఈ స్కీమ్ ప్రత్యేకంగా అనధికారిక రంగంలో పనిచేసే కార్మికుల కోసం తీసుకోచ్చారు. వీరిలో కూలీలు, ఆటో/రిక్షా డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, చిన్న వ్యాపారులు, ఇంటి పనిమనుషులు, వీధి వ్యాపారులు, బీడి కార్మికులు ఉన్నారు. 60 ఏళ్ల తర్వాత వారికి నెలవారీ ఆదాయం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
రూ. 55 చెల్లిస్తే చాలు
ఈ పథకంలో చేరడానికి వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు కేవలం రూ. 55 చెల్లించాలి. 29 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ. 100 చెల్లించాలి. అదే విధంగా 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. మీరు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది (50:50 కాంట్రిబ్యూషన్). 60 ఏళ్లు వచ్చిన తర్వాత నెలకు రూ. 3,000 పెన్షన్ లభిస్తుంది.
ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
* నెలవారీ ఆదాయం రూ. 15,000 లోపు ఉండాలి.
* EPFO, NPS, ESIC వంటి ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాలలో సభ్యులు కాకూడదు.
* దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, మొబైల్ నంబర్ అవసరం.
* దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
* లేదా ఆన్‌లైన్‌లో https://maandhan.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
ఈ పథకంలోని ప్రయోజనాలు
* 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ. 3,000 పెన్షన్ లభిస్తుంది.
* లబ్ధిదారు మరణిస్తే, సతీమణికి 50% పెన్షన్ (₹1,500) కుటుంబ పెన్షన్‌గా లభిస్తుంది.
* తక్కువ పెట్టుబడితో జీవితాంతం స్థిరమైన ఆదాయం పొందే అవకాశం.