Discounts: డీ మార్ట్ లో భారీ డిస్కౌంట్స్.. ఈ ఒక్కరోజు షాపింగ్ వెళ్తే..50 శాతం ఆఫర్
ఒకప్పుడు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన డీమార్ట్‌లు ఇప్పుడు జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాయి. సాధారణంగానే డీమార్టుల్లో డిస్కౌంట్స్ లభిస్తాయి. అయితే షాపింగ్ సమయంలో కొన్ని టిప్స్ పాటిస్తే మీ బిల్లుపై భారీగా డిస్కౌంట్స్ పొందొచ్చు.

వారంలో ఏ రోజులు బెస్ట్.?
సాధారణంగా చాలా మంది డీమార్ట్‌కు శని,ఆదివారాల్లో వెళ్తుంటారు. వీకెండ్ హాలీడే కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కడుతుంటారు. అయితే రద్దీ లేకుండా ప్రశాంతంగా షాపింగ్ చేయాలంటే మంగళవారం నుంచి గురువారం వరకు వెళ్లడం మంచిది. ఈ రోజుల్లో కొత్త స్టాక్ వస్తుంది, కాబట్టి అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువ. అందులోనూ తాజా వస్తువులు లభిస్తాయి.
KNOW
డీమార్ట్ వ్యాల్యూ ప్యాక్ ఆఫర్లు
డీమార్ట్‌లో కొన్ని ప్రోడక్ట్స్ “DMart Value Pack” లేదా “Combo Offer” పేరుతో వస్తాయి. ఇవి సాధారణ ధర కంటే తక్కువ ధరలో ఎక్కువ క్వాంటిటీతో లభిస్తాయి. షెల్ఫ్‌లో ఉన్న ట్యాగ్ ప్రైస్‌ని ప్యాకెట్‌పై ప్రింట్ చేసిన MRPతో పోల్చి చూసి కొనండి. ఒక్కో ఐటంపై రూ.20–30 ఆదా అవుతుంది. ఇలా చేయడం వల్ల మీ మొత్తం బిల్‌లో పెద్ద మొత్తంలో తేడా కనిపిస్తుంది.
సీజనల్ సేల్ టైమ్‌లో షాపింగ్ చేయండి
దుస్తులు, స్కూల్ ఐటమ్స్, పిల్లల కోసం సీజనల్ వస్తువులు కొనుగోలు చేయాలంటే మార్చి లేదా జూలై–ఆగస్టు నెలల్లో వెళ్లండి. ఈ టైమ్‌లో సీజన్ ఎండ్ సేల్స్ జరుగుతాయి. అప్పట్లో టీ-షర్టులు, జాకెట్లు, సాక్స్, బ్యాగ్స్ వంటి వాటిపై 70% వరకు డిస్కౌంట్ లభిస్తాయి. కొత్త సీజన్ స్టాక్ రావడానికి ముందు పాత స్టాక్ క్లియర్ చేస్తారు. ఈ సమయంలోనే పెద్ద ఎత్తున డిస్కౌంట్స్ అందిస్తారు.
ఫెస్టివల్ ఆఫర్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు
దీపావళి, సంక్రాంతి వంటి పండగల సమయంలో లేదా సీజన్ ఎండ్ సేల్స్‌లో DMart కొన్ని బ్యాంకులతో టైఅప్ అవుతుంది. ఈ సమయంలో ఫోన్‌పే, పేటీఎమ్, భీమ్ యూపీఐ వంటి వాటితో పేమెంట్స్ చేస్తే బిల్లింగ్ కౌంటర్‌లో వెంటనే డిస్కౌంట్ చూపిస్తాయి. కొన్ని క్రెడిట్/డెబిట్ కార్డులపై అదనంగా 5–10% డిస్కౌంట్ కూడా ఇస్తారు.
స్టోర్‌లో ఉండే ఇన్‌స్టంట్ ఆఫర్లు గమనించండి
DMartలో బిల్లింగ్ కౌంటర్ దగ్గర లేదా స్టోర్ లోపల డిజిటల్ బోర్డ్స్ మీద తాజా ఆఫర్లు చూపిస్తారు. షాపింగ్ చేసే ముందు వాటిని చూసి ఉపయోగించుకోండి. అంతేకాక, మీ స్వంత బ్యాగ్ తీసుకెళితే రూ.5–15 వరకు ప్లాస్టిక్ బ్యాగ్ ఛార్జ్ సేవ్ అవుతుంది. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ఉదయం తొందరగా లేదా మధ్యాహ్నం తర్వాత వెళ్లడం మంచిది. సాయంత్రం 5 తర్వాత విపరీతమైన రద్దీ ఉంటుంది.
అనవసరమైన వాటి జోలికి వెళ్లకండి
డీమార్ట్ వెళ్లే వారిలో చాలా మంది చేసే తప్పుల్లో అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం. అసలు మన నెలవారీ సరుకుల జాబితాలో లేని వస్తువులను కూడా డీమార్ట్‌లో షాపింగ్ చేసే సమయంలో కొనేస్తుంటారు. దీనివల్ల బిల్ పెరుగుతుంది. అలా కాకుండా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదని మీకు మీరు ఒక నిబంధన పెట్టుకోండి. ఇలా చేస్తే బిల్లులో తేడా మీరే గమనిస్తారు. అలాగే డీమార్ట్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. ఇందులో ఎప్పటికప్పుడు ఆఫర్లకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేస్తుంటారు.