MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • PAN Card: పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు

PAN Card: పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు

PAN Card : పాన్ కార్డ్ కేవలం ఐటీ రిటర్న్స్‌కే కాదు, ఈ 5 రకాల పెద్ద ఆర్థిక లావాదేవీలకు కూడా తప్పనిసరి. తప్పు నంబర్ ఇస్తే రూ.10 వేల జరిమానా పడుతుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 16 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాన్ కార్డ్ యూజర్లు ఈ తప్పు చేస్తే బ్యాంక్ అకౌంట్ విండోస్ క్లోజ్
Image Credit : Asianet News

పాన్ కార్డ్ యూజర్లు ఈ తప్పు చేస్తే బ్యాంక్ అకౌంట్ విండోస్ క్లోజ్

ఓటరు కార్డ్, ఆధార్ కార్డ్ తరహాలోనే పాన్ కార్డ్ కూడా మన దేశంలో అత్యంత కీలకమైన పత్రం. అయితే, చాలా మంది పాన్ కార్డ్‌ను కేవలం ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి మాత్రమే అవసరమైన పత్రంగా భావిస్తారు. కానీ వాస్తవానికి, అనేక పెద్ద ఆర్థిక లావాదేవీల నిర్వహణకు పాన్ కార్డ్ చాలా ముఖ్యం. బ్యాంక్ ఖాతా తెరవడం నుండి ఆస్తుల కొనుగోలు, షేర్లలో పెట్టుబడుల వరకు ఎన్నో పనులకు పాన్ నంబర్ ఇవ్వడం చట్టరీత్యా తప్పనిసరి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాన్ నంబర్ ద్వారా ఆదాయపన్ను శాఖ దేశంలో జరిగే పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచుతుంది. ఒక వ్యక్తి ఆదాయం, ఖర్చుల వివరాలు సరిగ్గా నమోదయ్యాయా లేదా అని నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఏ ఏ లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరిగా ఇవ్వాలో తెలుసా? మొత్తం ఐదు రకాల ముఖ్యమైన లావాదేవీలకు పాన్ నంబర్ ఇవ్వడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆస్తుల కొనుగోలు, విక్రయం
Image Credit : Gemini

ఆస్తుల కొనుగోలు, విక్రయం

మీరు ఏదైనా స్థలం, ఇల్లు లేదా ఫ్లాట్ వంటి ఆస్తిని కొనాలన్నా లేదా అమ్మాలన్నా పాన్ కార్డ్ చాలా ముఖ్యం. ఒకవేళ ఆ లావాదేవీ విలువ రూ.20 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, కచ్చితంగా పాన్ కార్డ్ వివరాలను అందించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ లావాదేవీ ముందుకు సాగదు.

Related Articles

Related image1
IRCTC Ayodhya Kashi Tour: ఒక్క టికెట్‌తో అయోధ్య, కాశీ ప్రయాణం.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ
Related image2
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
36
ఖరీదైన వస్తువుల కొనుగోళ్లు
Image Credit : Asianet News

ఖరీదైన వస్తువుల కొనుగోళ్లు

మీరు మార్కెట్‌లో లేదా ఏదైనా షోరూమ్‌లో భారీగా షాపింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన వస్తువులను లేదా సేవలను కొనుగోలు చేస్తే పాన్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి అవుతుంది. ఇది నగదు రూపంలో లేదా డిజిటల్ రూపంలో చేసినా వర్తిస్తుంది.

46
అన్‌లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్
Image Credit : Gemini

అన్‌లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్

షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారికి కూడా పాన్ కార్డ్ నిబంధనలు ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కాని కంపెనీల షేర్లను కొనుగోలు చేసినా లేదా విక్రయించినా పాన్ కార్డ్ అవసరం అవుతుంది. ఈ లావాదేవీల విలువ రూ.1 లక్ష దాటితే పాన్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి.

56
వాహనాల కొనుగోలు, డీమ్యాట్ అకౌంట్
Image Credit : Asianet News

వాహనాల కొనుగోలు, డీమ్యాట్ అకౌంట్

మీరు కొత్తగా కారు లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన మోటార్ సైకిల్ లేదా కారు కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. దీనితో పాటు, షేర్ మార్కెట్ ట్రేడింగ్ కోసం డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి కూడా పాన్ కార్డ్ కచ్చితంగా కావాలి.

66
తప్పు నంబర్ ఇస్తే భారీ జరిమానా
Image Credit : ANI

తప్పు నంబర్ ఇస్తే భారీ జరిమానా

ఆర్థిక లావాదేవీల సమయంలో పొరపాటున లేదా కావాలని తప్పు పాన్ నంబర్ ఇస్తే భారీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిబంధనల ప్రకారం, తప్పుడు పాన్ నంబర్ ఇస్తే రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, టాక్స్ క్రెడిట్ పొందడంలో ఇబ్బందులు, డాక్యుమెంట్లలో తేడాలు వంటి అనేక సమస్యలు వస్తాయి. అందుకే పాన్ నంబర్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆదాయపన్ను శాఖ ప్రస్తుతం డేటా అనలిటిక్స్, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ సమాచారాన్ని నిరంతరం విశ్లేషిస్తోంది. ఒక వ్యక్తి ఆదాయానికి, అతను పెట్టే ఖర్చులకు మధ్య తేడాలు లేదా వ్యత్యాసాలు కనిపిస్తే, ఐటీ శాఖ నోటీసులు జారీ చేసి వివరణ కోరుతుంది. అందుకే పాన్ నిబంధనలను పాటించడం, సరైన సమాచారాన్ని అందించడం ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Related Stories
Recommended image1
IRCTC Ayodhya Kashi Tour: ఒక్క టికెట్‌తో అయోధ్య, కాశీ ప్రయాణం.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ
Recommended image2
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved