Oyo: ఓయోలో ఇంత మోసం జరుగుతోందా? తప్పుడు దారిలో డబ్బులు సంపాదిస్తున్న యాజమాన్యం
ప్రముఖ హోటల్ బుకింగ్ సంస్థ ఓయోకు దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 80కిపైగా దేశాల్లో విస్తరించింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకున్న ఓయో నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజగా ఓయో రూమ్స్ మోసానికి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఓయో రూమ్స్‌లో జరిగిన ఆ మోసం ఏంటి.? కంపెనీ హోటల్స్‌ను ఎలా మోసం చేసింది.? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
OYO Room
ఓయో.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హోటల్ రూమ్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసిన ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇదిలా ఉంటే తరచూ వార్తల్లో నిలిచే ఓయో ఈసారి రూ. 22 కోట్ల మోసం వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కింది. నకిలీ బుకింగ్‌ల పేరుతో ఓయో డబ్బులు సంపాదిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓయో యజమాని రితేష్ అగర్వాల్ పై రూ.22 కోట్ల మోసం కేసు నమోదైంది.
oyo rooms
అసలేంటీ మోసం.?
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని కొంతమంది హోటల్ యజమానులు ఓయో మోసం చేశారని ఆరోపించారు. ఓయో తమ హోటళ్లలో నకిలీ బుకింగ్‌లు చేయడం ద్వారా డబ్బు సంపాదించిందని ఆరోపణలు వచ్చాయి. ఓయో తప్పుడు విధానంలో హోటళ్లను బుక్ చేసుకోవడం ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుంది, దీని కారణంగా హోటళ్లు తీవ్రంగా నష్టపోయాయని వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై హోటల్ ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ అధ్యక్షుడు హుస్సేన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది హోటల్ యజమానులకు పెద్ద సమస్యగా మారిందన్నారు. ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పై ఒక హోటల్ నిర్వాహకుడు రూ.22 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. జోధ్‌పూర్‌లోని 10 కి పైగా హోటళ్ల యజమానులకు రాష్ట్ర జీఎస్టీ, కేంద్ర జీఎస్టీ నుంచి నోటీసులు అందాయి.
మోసం ఎలా జరుగుతుంది.?
ఓయో ద్వారా హోటళ్లను మొదట ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, కొంత సమయం తర్వాత రద్దు చేస్తున్నారని హోటల్ యజమానులు ఆరోపించారు. దీనికి జీఎస్టీ వసూలు చేస్తారు, దీనిని హోటల్ యజమానులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అడ్డదారిలో ఓయో డబ్బులు సంపాదిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి విచారణ జరుగుతోంది.