MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Toll Plaza: టోల్ ఫీజు క‌డితే ఇన్ని లాభాలున్నాయా? ఉచితంగా పెట్రోల్ కూడా ఇస్తారని తెలుసా

Toll Plaza: టోల్ ఫీజు క‌డితే ఇన్ని లాభాలున్నాయా? ఉచితంగా పెట్రోల్ కూడా ఇస్తారని తెలుసా

Toll Plaza: హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ గేట్ల వద్ద ఫీజు చెల్లించడం సాధారణ విషయం. అయితే మ‌నం చెల్లించే టోల్ ఫీజు కేవ‌లం రోడ్డుపై ప్ర‌యాణించినందుకే అనుకుంటాం. కానీ ఈ టోల్ చెల్లింపుతో ఇత‌ర లాభాలు కూడా ఉంటాయ‌ని మీకు తెలుసా.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 11 2026, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టోల్ ట్యాక్స్ అంటే ఏమిటి?
Image Credit : Asianet News

టోల్ ట్యాక్స్ అంటే ఏమిటి?

టోల్ ట్యాక్స్ అనేది ఎక్స్‌ప్రెస్ వేలు, బ్రిడ్జ్‌లు, టన్నెల్‌లు, నేషనల్ హైవేలు లేదా స్టేట్ హైవేలను ఉపయోగించినందుకు వాహనదారులు చెల్లించే రుసుము. భారతదేశంలో రహదారి వ్యవస్థ, టోల్ విధానాలను నేష‌న‌ల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పర్యవేక్షిస్తుంది. టోల్ వసూలు చేసే విధానం, రేట్లు, మినహాయింపులు వంటి అంశాలపై NHAI ప్రత్యేక నియమాలు రూపొందించింది. ఈ నియమాల ప్రకారం టోల్ వసూలు జరుగుతుంది.

25
టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తారు?
Image Credit : stockPhoto

టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తారు?

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద రహదారి నెట్‌వర్క్ కలిగిన దేశాల్లో ఒకటి. ఈ రహదారులను సక్రమంగా నిర్వహించడానికి భారీగా ఖర్చు అవుతుంది. అందుకే టోల్ ఫీజు ద్వారా నిధులు సేకరిస్తారు. ఈ డబ్బుతో రహదారి మరమ్మతులు, నిర్వహణ, కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తారు. దీని వల్ల ప్రయాణం వేగంగా, సురక్షితంగా సాగుతుంది. అయితే ప్రతి హైవే లేదా ఎక్స్‌ప్రెస్ వేపై టోల్ రేట్లు ఒకేలా ఉండవు. వాహనం రకం, రోడ్డు పొడవు వంటి అంశాల ఆధారంగా ఛార్జీల‌ను నిర్ణయిస్తారు.

Related Articles

Related image1
Premium Rice: ప్ర‌పంచంలో అత్యంత ఖరీదైన బియ్యం ఇదే.. కిలో రైస్ ధ‌ర రూ. 12,000
Related image2
Viral Video: CBSE క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌లో క్యూఆర్ కోడ్‌... స్కాన్ చేసి చూడ‌గా దిమ్మ‌తిరిగే షాక్
35
టోల్ ఫీజు చెల్లించే వారికి లభించే సౌకర్యాలు
Image Credit : Asianet News

టోల్ ఫీజు చెల్లించే వారికి లభించే సౌకర్యాలు

టోల్ గేట్ల వద్ద ఫీజు చెల్లించిన ప్రయాణికులకు కొన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి.

* ప్రయాణం సమయంలో అనుకోకుండా ఆరోగ్య సమస్య తలెత్తితే, టోల్ రసీదు వెనుక ఇచ్చిన నంబర్‌కు కాల్ చేస్తే సుమారు 10 నిమిషాల్లో అంబులెన్స్ సహాయం అందుతుంది.

* వాహనం టైర్ పంక్చర్ అవడం లేదా వాహనం మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురైతే కూడా సహాయక సిబ్బంది త్వరగా చేరుకుని సహాయం చేస్తారు.

* అలాగే ప్రయాణం మధ్యలో వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ అయిపోయినా, 5 నుండి 10 లీటర్ల వరకు ఇంధనం ఏర్పాటు చేసే సదుపాయం కూడా ఉంటుంది. ఈ సేవలన్నీ టోల్ ఫీజులో భాగంగా పొందొచ్చు.

45
టోల్ ట్యాక్స్‌కు సంబంధించిన ముఖ్యమైన నియమాలు
Image Credit : Google

టోల్ ట్యాక్స్‌కు సంబంధించిన ముఖ్యమైన నియమాలు

టోల్ వసూలు చేసే విధానంపై NHAI కొన్ని కీలక నియమాలు అమలు చేస్తుంది.

టోల్ రేట్లు: వాహనం రకం, ప్రయాణించిన దూరం, సమయం ఆధారంగా రుసుము నిర్ణయిస్తారు. ఒకే రకం వాహనాలకు ఒకే రేటు ఉంటుంది.

టోల్ గేట్ల స్థానం: టోల్ ప్లాజాలను ఎక్కడ పడితే అక్కడ నిర్మించరు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా, భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తారు.

చెల్లింపు విధానం: టోల్ ఫీజును నగదు లేదా డిజిటల్ విధానాల్లో చెల్లించవచ్చు. ప్రస్తుతం FASTag ద్వారా కూడా చెల్లించే సౌకర్యం ఉంది.

GNSS సౌకర్యం: నేషనల్ హైవేలపై ప్రయాణించే ప్రైవేట్ వాహనాలకు రోజుకు మొదటి 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు మినహాయింపు ఉండే విధంగా GNSS ఆధారిత వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ దూరం దాటితే ప్రయాణించిన కిలోమీటర్ల ఆధారంగా టోల్ వసూలు చేస్తారు.

55
టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందే వాహనాలు
Image Credit : Freepik

టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందే వాహనాలు

కొన్ని ప్రత్యేక వాహనాలకు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

* అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్ వంటి అత్యవసర వాహనాలు

* ఆర్మీ లేదా రక్షణ శాఖ వాహనాలు

* రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు వంటి ప్రముఖుల వాహనాలు

* ద్విచ‌క్ర వాహ‌నాలకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

టోల్ ఫీజు ఎలా నిర్ణయిస్తారు?

టోల్ రుసుము నిర్ణయించేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. వాహనం రకం, బరువు, లోడ్ సామర్థ్యం ఆధారంగా రేటు మారుతుంది. ట్రక్కులు, బస్సులు వంటి భారీ వాహనాలు రహదారికి ఎక్కువ నష్టం కలిగిస్తాయి కాబట్టి వాటికి ఎక్కువ టోల్ వసూలు చేస్తారు. ప్యాసింజర్ కార్ యూనిట్ ఆధారంగా కూడా టోల్ రేట్లు నిర్ణయిస్తారు

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయిన గుడ్ల ధరలు.. ట్రే ఎంతంటే?
Recommended image2
Induction stove: గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఎంతైనా పెర‌గ‌ని.. ఈ స్ట‌వ్ మీ ఇంట్లో ఉంటే బిందాస్‌. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Recommended image3
Today Gold Rate In Hyderabad: బంగారం ధరల్లో మళ్లీ ట్విస్ట్, ఇప్పుడు కొనాలా? వద్దా?
Related Stories
Recommended image1
Premium Rice: ప్ర‌పంచంలో అత్యంత ఖరీదైన బియ్యం ఇదే.. కిలో రైస్ ధ‌ర రూ. 12,000
Recommended image2
Viral Video: CBSE క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌లో క్యూఆర్ కోడ్‌... స్కాన్ చేసి చూడ‌గా దిమ్మ‌తిరిగే షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved