MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలా? ఇక ఏజెంట్లతో పనిలేదు. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్

Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలా? ఇక ఏజెంట్లతో పనిలేదు. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్

New Tatkal Ticket Booking Rules: తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలంటే చాలా మంది ఏజెంట్లను ఆశ్రయిస్తారు. వారైతే ఎలాగైనా టికెట్స్ కన్ఫర్మ్ చేస్తారని నమ్మకం. కాని ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. ఇకపై ఏజెంట్లతో పనిలేకుండా నేరుగా తత్కాల్ టికెట్స్ ఈజీగా బుక్ చేసుకొనే సదుపాయాన్ని ఇండియన్ రైల్వే శాఖ తీసుకొస్తోంది. మరి ఆ రూల్స్ లో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా?

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 12 2025, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తత్కాల్ టికెట్స్ బుకింగ్ లో ఏజెంట్ల దందాలకు అడ్డుకట్ట వేయడానికి రైల్వే శాఖ గట్టి చర్యలు తీసుకుంది. ఎందుకంటే తత్కాల్ టికెట్స్ బుకింగ్ స్లాట్స్ ఓపెన్ అవ్వగానే కొందరు ఏజెంట్లు వాటికి బ్లాక్ చేసేసి ఎక్కువ ధరకు విక్రయిస్తుండటంతో నిజంగా, అర్జెంటుగా ప్రయాణం చేయాలనుకున్న వారికి టికెట్స్ దొరకడం లేదు. దీంతో ఎంతో మంది ప్రయాణికులు డబ్బులు, టైమ్ రెండూ నష్టపోతున్నారు. ఈ సమస్యకు చెక్ చెప్పడానికి రైల్వే శాఖ ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్ ఇవే..

ఇంతకు ముందు ఏసీ క్లాస్ అంటే 1ఏ, 2ఏ, 3ఏ, సీసీ క్లాస్ బుకింగ్ టైమ్ ప్రతి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేది. ఏప్రిల్ 15 నుంచి ప్రతి రోజు ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతుంది. 

నాన్ ఏసీ టికెట్లు అంటే స్లీపర్ క్లాస్, 2ఎస్ లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ప్రతి రోజు ఉదయం 11 గంటలకు సైట్ ఓపెన్ అయ్యేది. ఏప్రిల్ 15 నుంచి 12 గంటలకు బుకింగ్ టైమ్ ప్రారంభమవుతుంది. 

35

ఇక ప్రీమియం తత్కాల్ టికెట్స్ అయితే ప్రతి రోజు ఉదయం 10 గంటలకు బుకింగ్ టైమ్ అయ్యేది. ఏప్రిల్ 15 తర్వాత ఉదయం 10.30 గంటలకు బుకింగ్స్ ప్రారంభమవుతాయి. 

ముఖ్యమైన రూల్ ఏంటంటే.. ప్రతి రోజు తత్కాల్ బుకింగ్ టైమ్ లో అంటే.. 10 నుంచి 12 గంటల మధ్య ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయడానికి వీలు లేదు. 

మరి ఏజెంట్లు లేకుండా తత్కాల్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలని కంగారు పడుతున్నారు. సింపుల్.. ఇకపై తత్కాల్ టికెట్లు మీరే చాలా సింపుల్ గా బుక్ చేసుకోవచ్చు. ఏజెంట్ల రద్దీ లేకపోవడం వల్ల టికెట్లు త్వరగా బుక్ అవడానికి అవకాశం ఉంటుంది. 

45

తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే..

IRCTC వెబ్‌సైట్ అయిన www.irctc.co.in
కు వెళ్లి బుక్ చేసుకోండి. లేదా IRCTC మొబైల్ యాప్ లో కూడా తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 

IRCTC వెబ్ సైట్ లేదా యాప్ ఓపెన్ చేసి మీరు ఎక్కాలనుకొనే ట్రైన్, మీకు నచ్చిన తరగతి (AC లేదా నాన్-AC) సెలెక్ట్ చేసుకోండి. 

55

కనిపించే ఆప్షన్స్ లో తత్కాల్ కోటాను సెలెక్ట్ చేసుకోండి. ప్రయాణీకుల వివరాలు, ID ప్రూఫ్ నంబర్‌ను నమోదు చేయండి. తర్వాత బుకింగ్‌ను కన్ఫర్మ్ చేస్తూ పేమెంట్ చేసేయండి. అంతే తత్కాల్ టికెట్స్ ఈజీగా బుక్ అయిపోతాయి. ఏజెంట్లకైతే టికెట్ పై ఎక్కువ డబ్బులు కట్టి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి ఇక ఏజెంట్లతో పని లేకుండా తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి ఈ ట్రైన్ లో ప్రయాణిస్తే మీకు ఫుడ్ ఫ్రీ.. ఇది ఏ రూట్ లో ప్రయాణిస్తుందో తెలుసా?

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రయాణం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Recommended image2
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Recommended image3
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved