MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !

ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !

ITR Filing 2026: భారతీయులు ఆదాయం పొందే మార్గాలు గణనీయంగా మారాయి. క్లియర్ టాక్స్ 2026 రిపోర్టు ప్రకారం యువత, ఉద్యోగుల ఆర్థిక అలవాట్లలో సరికొత్త మార్పులు వచ్చాయి. 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు.. ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 03 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐటీఆర్‌ 2026 ట్రెండ్స్‌: భారతీయుల సంపాదన శైలిలో బిగ్ ఛేంజ్
Image Credit : chatgpt

ఐటీఆర్‌ 2026 ట్రెండ్స్‌: భారతీయుల సంపాదన శైలిలో బిగ్ ఛేంజ్

మన దేశంలో ఉద్యోగులు, యువత డబ్బు సంపాదించే విధానంలో, పెట్టుబడులు పెట్టే శైలిలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు నెలాఖరున వచ్చే జీతం మీద మాత్రమే ఆధారపడిన భారతీయులు.. ఇప్పుడు దానికి మించిన అదనపు ఆదాయ మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు.

స్టాక్ మార్కెట్ నష్టాలు వెల్లడించడం దగ్గర నుంచి ఫ్రీలాన్సింగ్, బిజినెస్ వరకూ రకరకాల ఆదాయ మార్గాలను ఐటీఆర్‌లలో స్పష్టంగా లెక్కిస్తున్నారు. క్లియర్ టాక్స్ విడుదల చేసిన 'హౌ ఇండియా ఫైల్డ్ ఇన్ 2026' అనే తాజా వార్షిక రిపోర్టులో భారతీయుల పన్ను చెల్లింపుల అలవాట్లకు సంబంధించి 5 ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జీతం ఒక్కటే కాదు.. మల్టీపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ పెరిగాయి
Image Credit : Getty

జీతం ఒక్కటే కాదు.. మల్టీపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ పెరిగాయి

ఒకే ఉద్యోగం, ఒకటే జీతం అనే కాలం మారినట్లు పన్ను రిటర్నుల డేటా చెబుతోంది. అసెస్మెంట్ ఇయర్ 2026-27లో స్వయంగా ఐటీఆర్ ఫైల్ చేసిన వారిలో 47.3 శాతం మంది తమ ఉద్యోగం కాకుండా కనీసం మరొక అదనపు మార్గం ద్వారా ఆదాయం పొందుతున్నట్లు పేర్కొన్నారు. AY 2022-23లో ఇది కేవలం 9.5 శాతంగా మాత్రమే ఉండేది.

అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇతర మార్గాల ద్వారా సంపాదిస్తున్న పన్ను చెల్లింపుదారుల వాటా 3.5 శాతం నుంచి ఏకంగా 24.4 శాతానికి పెరిగింది. రెగ్యులర్ ఉద్యోగంతో పాటు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు, సైడ్ బిజినెస్ లేదా క్రిప్టోకరెన్సీ ద్వారా భారతీయులు అదనపు రాబడి పొందుతున్నారు.

36
యంగ్ జెనరేషన్ సంచలనం.. కాంప్లెక్స్ ఐటీఆర్ల వైపే మొగ్గు
Image Credit : PR

యంగ్ జెనరేషన్ సంచలనం.. కాంప్లెక్స్ ఐటీఆర్ల వైపే మొగ్గు

25 ఏళ్ల లోపు వయసున్న యంగ్ టాక్స్ పేయర్స్ తమ జీతానికే పరిమితం కాకుండా వైవిధ్యమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. AY 2026-27లో 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో ఏకంగా 75 శాతం మంది కాంప్లెక్స్ పన్ను రిటర్న్ లు ఫైల్ చేశారు. క్రిందటి అసెస్మెంట్ ఇయర్‌లో ఈ సంఖ్య 60 శాతంగా ఉండేది.

ముఖ్యంగా ఐటీఆర్-3 ఫైల్ చేసిన యంగ్ పీపుల్ శాతం 28 శాతం నుండి 44 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఐటీఆర్ -1 ఫైలింగ్ శాతం 41 శాతం నుండి 25 శాతానికి పడిపోయింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఫ్రీలాన్సింగ్, చిన్న తరహా వ్యాపారాల వైపు యువత ఎక్కువగా మొగ్గు చూపుతుండటమే దీనికి ప్రధాన కారణం.

46
రూ. 1 లక్ష లోపు ఆదాయం ఉన్నా క్లిష్టమైన ఫైలింగ్‌లే
Image Credit : our own

రూ. 1 లక్ష లోపు ఆదాయం ఉన్నా క్లిష్టమైన ఫైలింగ్‌లే

వార్షిక ఆదాయం తక్కువగా ఉన్నంత మాత్రాన ఐటీఆర్ ఫైలింగ్ సులభంగా ఉంటుందని చెప్పలేము. గ్రోస్ ఆదాయం రూ. 1 లక్ష కంటే తక్కువగా నమోదైన పన్ను చెల్లింపుదారులలో 73 శాతం మంది కాంప్లెక్స్ ఐటీఆర్‌లనే ఫైల్ చేసినట్లు క్లియర్ టాక్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది. రూ. 50 లక్షల వరకు ఉన్న ఏ ఇతర ఆదాయ వర్గం కంటే ఇది చాలా ఎక్కువ.

రూ. 1 లక్ష నుండి 2.5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారిలో 69 శాతం, రూ. 2.5 లక్షల నుండి 5 లక్షల మధ్య ఉన్న వారిలో 60 శాతం మంది కాంప్లెక్స్ రిటర్న్ లు దాఖలు చేశారు. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు, ఫ్రీలాన్స్ సంపాదన వల్ల ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ రిటర్నుల ప్రక్రియ క్లిష్టంగా మారుతోంది.

56
మార్కెట్ నష్టాల్లోనూ వెనక్కి తగ్గని యువ ఇన్వెస్టర్లు
Image Credit : Asianet News

మార్కెట్ నష్టాల్లోనూ వెనక్కి తగ్గని యువ ఇన్వెస్టర్లు

పెద్ద వయస్కులతో పోలిస్తే యంగ్ ఇన్వెస్టర్లే క్యాపిటల్ నష్టాలను ఎక్కువగా ఐటీఆర్‌లో రిపోర్ట్ చేస్తున్నారు. AY 2026-27లో క్యాపిటల్ గెయిన్స్ లేదా నష్టాలను వెల్లడించిన 25 ఏళ్ల లోపు పన్ను చెల్లింపుదారులలో 37 శాతం మంది నష్టాలు వచ్చాయని తెలిపారు. అన్ని వయో సమూహాలలో ఇదే అత్యధికం.

వయస్సు పెరిగే కొద్దీ ఈ నష్టాల శాతం తగ్గుతూ వచ్చింది. 25-30 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 29 శాతం, 60 ఏళ్లు దాటిన వారిలో 21 శాతం మాత్రమే నష్టాలు చూపించారు.

అలాగే రూ. 1 లక్ష కంటే తక్కువ రాబడి ఉన్న వారిలో 35 శాతం మంది నష్టాలు చూపించగా, రూ. 50 లక్షలకు పైగా సంపాదించే వారిలో ఇది 19 శాతంగా ఉంది. నష్టాలు వచ్చినా యువత మార్కెట్లలో పెట్టుబడులు కొనసాగిస్తోంది. క్లియర్ టాక్స్ ఎక్స్‌పర్ట్ సేవలు పొందిన కొత్త ఫైలర్లలో 82 శాతం మంది కాంప్లెక్స్ రిటర్న్లనే ఎంచుకున్నారు.

66
రిటైర్మెంట్ అయినా ఆగని ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రయాణం
Image Credit : Asianet News

రిటైర్మెంట్ అయినా ఆగని ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రయాణం

ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా భారతీయులు పెట్టుబడులు పెట్టడం ఆపడం లేదు. AY 2026-27లో 60 ఏళ్లు దాటిన వారిలో 40 శాతం మంది క్యాపిటల్ గెయిన్స్ పొందుతున్నట్లు ఐటీఆర్లలో చూపించారు. 40-50 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో ఇది 35 శాతంగా మాత్రమే ఉంది.

అయితే రాబడి విషయంలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. 40-50 ఏళ్ల వారిలో 44 శాతం మంది రూ. 20 లక్షలకు పైగా ఆదాయాన్ని రిపోర్ట్ చేయగా, 60 ఏళ్లు దాటిన వారిలో ఈ సంఖ్య కేవలం 9 శాతంగానే ఉంది. అంతేకాకుండా, 60 ఏళ్లు పైబడిన వారిలో సగానికి పైగా కాంప్లెక్స్ రిటర్న్లు ఫైల్ చేయడం వారి యాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్టైల్ ను సూచిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
స్టాక్ మార్కెట్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: డాలర్ బలహీనపడటంతో బంగారానికి ఊతం.. మళ్లీ పెరుగుతున్న గోల్డ్
Recommended image2
Gold Price Hike: ఇరాన్-అమెరికా చర్చల్లో ప్రతిష్టంభన.. పసిడి ధరల్లో మళ్లీ జోరు
Recommended image3
EPFO: పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవ‌డం ఇప్పుడు మ‌రింత ఈజీ.. వాట్సాప్ ద్వారా
Related Stories
Recommended image1
Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Recommended image2
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved