MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Gold Rate: పసిడి ప్రియలకు గుడ్ న్యూస్...బంగారం, వెండి ధరలు భారీగా పతనం

Gold Rate: పసిడి ప్రియలకు గుడ్ న్యూస్...బంగారం, వెండి ధరలు భారీగా పతనం

Gold Rate: మొన్నటివరకు రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా మళ్లీ దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మార్పుల కారణంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ ధరలు ఏ స్థాయిలో పతనమైందంటే.. 

2 Min read
Author : Nandini Arava
Published : May 16 2026, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గణనీయంగా పడిపోయిన బంగారం
Image Credit : Asianet News

గణనీయంగా పడిపోయిన బంగారం

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఇటీవల ధరలు పెరగడంతో కొనుగోలు వాయిదా వేసుకున్న వారికి కొంత ఊరట లభించినట్టైంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పతనం దిశగా పసిడి
Image Credit : Gold Price\Twitter

పతనం దిశగా పసిడి

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గి రూ.1,56,930 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆభరణాల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా గణనీయంగా తగ్గి రూ.1,43,850కు చేరింది. గత కొన్ని రోజులుగా పెరుగుదల దిశగా పయనించిన పసిడి ఒక్కసారిగా తగ్గడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. 

Related Articles

Related image1
Gold Price Hike: బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం..షాకిస్తున్న వెండి ధరలు, ఆందోళనలో పసిడి ప్రియులు
Related image2
Today Gold Rate: పసిడి దిగుమతులపై కేంద్రం పరిమితులు..ఒక్కరోజులో కుప్పకూలిపోయిన బంగారం ధరలు
35
బంగారం బాటలోనే వెండి
Image Credit : Getty

బంగారం బాటలోనే వెండి

వెండి ధరల్లో అయితే మరింత భారీ పతనం నమోదైంది. దేశీయ మార్కెట్‌లో గ్రాము వెండి ధర రూ.290కి తగ్గింది. దీంతో 10 గ్రాముల వెండి రూ.2,900, 100 గ్రాముల వెండి రూ.29 వేలుగా నమోదయ్యాయి. ఇక కిలో వెండి ధర ఒక్కరోజులోనే భారీగా పడిపోయి రూ.2.90 లక్షలకు చేరింది. గతంతో పోలిస్తే కిలోపై రూ.15 వేల వరకు తగ్గుదల కనిపించింది.

45
మళ్లీ పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు
Image Credit : ChatGPT

మళ్లీ పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు

ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగడం, అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇంకా ఎక్కువ కాలం పెంచిన స్థాయిలో కొనసాగించే అవకాశాలపై సంకేతాలు రావడంతో డాలర్ బలపడుతోంది. అదే సమయంలో అమెరికా ట్రెజరీ యీల్డ్‌లు పెరగడం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతోంది.

55
 భవిష్యత్తులో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం
Image Credit : AI

భవిష్యత్తులో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం

కేంద్ర నిర్ణయాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు బంగారం దిగుమతులను నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో బంగారం, వెండి దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. ప్లాటినంపై కూడా సుంకాలను పెంచడంతో విలువైన లోహాల మార్కెట్‌లో భవిష్యత్తులో మరింత హెచ్చుతగ్గులు ఉండే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారుతాయన్నదానిపై రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లలో ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా పసిడి మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Price Hike: బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం..షాకిస్తున్న వెండి ధరలు, ఆందోళనలో పసిడి ప్రియులు
Recommended image2
Today Gold Rate: పసిడి దిగుమతులపై కేంద్రం పరిమితులు..ఒక్కరోజులో కుప్పకూలిపోయిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved