MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో రూమ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వస్తే.! చట్టం ఏం చెబుతోంది.

గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో రూమ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వస్తే.! చట్టం ఏం చెబుతోంది.

OYO Room: 18 ఏళ్లు నిండిన మేజర్లు హోటల్ గదుల్లో జంటగా ఉండటం నేరం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మేజర్‌కు వ్యక్తిగత గోప్యత(Right to Privacy) ఉంటుంది. మరి ఆ వివరాలు ఏంటి ఒకసారి చూసేద్దాం.. 

2 Min read
Author : Pavithra D
Published : Feb 25 2026, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓయోలను ఆశ్రయించడం..
Image Credit : OYO.com

ఓయోలను ఆశ్రయించడం..

ప్రస్తుతం జంటలు ఏకాంతం కోసం ఓయోలను ఆశ్రయించడం సాధారణమైంది. అయితే, అప్పుడప్పుడు పోలీసులు ఇలాంటి చోట్ల తనిఖీలు చేసినప్పుడు, అవివాహిత జంటలు భయాందోళనలకు గురవుతారు. ఈ నేపథ్యంలో, 18 ఏళ్లు నిండిన మేజర్లు తమ చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని న్యాయ నిపుణులు అంటున్నారు.

25
రాజ్యాంగం కల్పించిన రక్షణ
Image Credit : AI Meta

రాజ్యాంగం కల్పించిన రక్షణ

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ప్రతి పౌరుడికి 'జీవించే హక్కు', 'వ్యక్తిగత స్వేచ్ఛ'(Right to Privacy) ఉన్నాయి. 18 ఏళ్లు నిండిన మేజర్లు తమకు ఇష్టమైన వారితో సమయం గడిపే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. హోటల్ గదిలో పరస్పర అంగీకారంతో ఉండటం నేరం కాదు. పోలీసులకు దీన్ని అడ్డుకునే అధికారం లేదు.

Related Articles

Related image1
Business Ideas: 4 నెల‌లు క‌ష్ట‌ప‌డితే ల‌క్షాధికారి కావొచ్చు.. ఈ బిజినెస్‌తో స‌మ్మ‌ర్‌లో సిరులు కురుస్తాయి
Related image2
Business Ideas: రూ. 2 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో నెల‌కు రూ. 30 వేల ఆదాయం.. ఉన్న ఊరిలో ఉండే సంపాద‌న
35
పోలీసులు రైడ్ చేస్తే ఏం చేయాలి?
Image Credit : Oyo

పోలీసులు రైడ్ చేస్తే ఏం చేయాలి?

ఐడీ ప్రూఫ్: పోలీసులు వచ్చినప్పుడు మీరు మేజర్లు అని నిరూపించుకోవడానికి ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ లాంటి గుర్తింపు కార్డులను చూపించాలి. పోలీసులు మీ పేరెంట్స్‌కు ఫోన్ చేయమని అడిగితే, అది కేవలం ఒక రిక్వెస్ట్ మాత్రమే. మీరు మేజర్లు అయినప్పుడు, ఇంట్లో వారికి ఫోన్ చేయాలని బలవంతం చేసే చట్టపరమైన అధికారం పోలీసులకు లేదు. అది పూర్తిగా మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

45
భయం అక్కర్లేదు..
Image Credit : Google

భయం అక్కర్లేదు..

చట్టవిరుద్ధమైన పనులు చేయనంత వరకు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడం లేదా స్టేషన్‌కు తరలించడం వంటివి చేయకూడదు. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని భయపెట్టినా, చట్టవిరుద్ధంగా స్టేషన్‌కు తీసుకెళ్లినా, లేదా అసభ్యంగా ప్రవర్తించినా, మీరు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

55
పోలీసులు అతిగా ప్రవర్తిస్తే
Image Credit : OYO

పోలీసులు అతిగా ప్రవర్తిస్తే

బీఎన్ఎస్(BNS) సెక్షన్లు 126, 127, 351 లేదా ఐపీసీ సెక్షన్ 166 కింద వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అధికారాన్ని దుర్వినియోగం చేసిన పోలీసులకు కనీసం రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అవివాహిత జంటలకు గదులు ఇవ్వకూడదని ఎక్కడా చట్టం లేదు. హోటల్ యాజమాన్యం కూడా రూల్స్ పాటిస్తూ గదులు కేటాయించవచ్చు. కాబట్టి, చట్టంపై అవగాహన ఉంటే అనవసరమైన వేధింపుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate in Hyderabad: ఉగాది గుడ్‍న్యూస్...తగ్గిన బంగారం, వెండి ధరలు, ఎంతో తెలుసా?
Recommended image2
High Court: ఒక్కడే కూర్చుని అడల్ట్ సైట్‌లు చూస్తున్నారా.! హైకోర్టు ఏం చెప్పిందంటే.?
Recommended image3
Property Registration: అగ్రిమెంట్ అయినా రిజిస్ట్రేషన్ చెయ్యట్లేదా.. ఇలా చేస్తే దెబ్బకు కాళ్ల బేరానికి వస్తారు
Related Stories
Recommended image1
Business Ideas: 4 నెల‌లు క‌ష్ట‌ప‌డితే ల‌క్షాధికారి కావొచ్చు.. ఈ బిజినెస్‌తో స‌మ్మ‌ర్‌లో సిరులు కురుస్తాయి
Recommended image2
Business Ideas: రూ. 2 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో నెల‌కు రూ. 30 వేల ఆదాయం.. ఉన్న ఊరిలో ఉండే సంపాద‌న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved