MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price: రెండు రోజుల్లో భారీ పతనం...గ్రాము ఎంతంటే..?

Gold Price: రెండు రోజుల్లో భారీ పతనం...గ్రాము ఎంతంటే..?

Gold Price: అంతర్జాతీయంగా ఎక్కడ ఏం జరిగినా మొదటగా ప్రభావం చూపించేది బంగారం, వెండిపైనే. అందుకే మొన్నటివరకు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో రేట్లు పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు కంగారు పడ్డారు. కానీ ఊహించని స్థాయిలో  పసిడి రేట్లు దిగొస్తున్నాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Mar 04 2026, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యుద్ధ భయాలతో మార్కెట్లపై ఒత్తిడి
Image Credit : Asianet News

యుద్ధ భయాలతో మార్కెట్లపై ఒత్తిడి

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, వాటిపై ఇరాన్ ప్రతిదాడులు, దీంతో ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్తతలు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం, వెండివైపు మొగ్గు చూపుతారు. అందుకే ప్రారంభంలో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అయితే పరిస్థితులు కొంత స్థిరపడుతున్న సంకేతాలు కనిపించడంతో పాటు డాలర్ బలపడటంతో ఇప్పుడు ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి.

25
రెండు రోజుల్లో రూ.5వేలు పతనం
Image Credit : Asianet News

రెండు రోజుల్లో రూ.5వేలు పతనం

దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 2,650 తగ్గి రూ. 1,54,650 వద్దకు చేరింది. కిందటి రోజు రూ.2,350 మేర పతనమైంది. అంటే రెండు రోజుల్లో కలిపి పసిడి ధర దాదాపు రూ.5,000 వరకు తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,890 తగ్గి ప్రస్తుతం రూ. 1,67,620 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు రోజు కూడా ఇది రూ. 2,580 మేర పడిపోయింది. ఇప్పుడు శుభకార్యాలు జరిగే సమయం కావడంతో ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది.

Related Articles

Related image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Related image2
Gold Bracelet: తక్కువ బడ్జెట్ లో 9 క్యారెట్ లో గోల్డ్ బ్రేస్ లెట్స్
35
స్థిరంగా వెండి
Image Credit : Asianet News

స్థిరంగా వెండి

ఇక సిల్వర్ రూట్ చూస్తే పెద్ద మార్పేం లేదు. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3.15 లక్షల వద్దే ఉంది. అయితే మార్చి 2న సిల్వర్ రేటు రూ. 10,000 మేర తగ్గింది. అంతకు ముందు వారం మాత్రం వెండి ధర దాదాపు రూ. 35,000 వరకు పెరిగింది. అంటే వెండి కూడా కొద్ది రోజులుగా ఊగిసలాడుతోంది.

45
బలపడిన డాలర్..ఫలితంగా క్షీణించిన ధరలు
Image Credit : Getty

బలపడిన డాలర్..ఫలితంగా క్షీణించిన ధరలు

బంగారం భారీగా తగ్గడానికి ప్రధాన కారణం యూఎస్ డాలర్ బలపడటమే. డాలర్ ఇండెక్స్ ఒక నెల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ పెరిగింది. డాలర్ బలపడితే బంగారం, వెండి వంటి కమోడిటీల కొనుగోలు విదేశీ ఇన్వెస్టర్లకు ఖరీదవుతుంది. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు క్షీణించే అవకాశం ఉంటుంది.

55
యుద్ధ భయాల మధ్య దిగొచ్చిన పసిడి
Image Credit : Getty

యుద్ధ భయాల మధ్య దిగొచ్చిన పసిడి

మొత్తానికి యుద్ధభయాలు ఒకవైపు కొనసాగుతున్నా, డాలర్ బలం , లాభాల స్వీకరణ కారణంగా ప్రస్తుతం పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ కదలికలపై ఆధారపడి మార్కెట్ దిశ నిర్ణయమవుతుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image2
Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Recommended image3
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ కావాలంటే మీ జీతం ఎంత ఉండాలి? నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Related Stories
Recommended image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Recommended image2
Gold Bracelet: తక్కువ బడ్జెట్ లో 9 క్యారెట్ లో గోల్డ్ బ్రేస్ లెట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved