- Home
- Life
- IRCTC Tour Package: IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్ లో ప్రముఖ దేవాలయాల సందర్శన!
IRCTC Tour Package: IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్ లో ప్రముఖ దేవాలయాల సందర్శన!
IRCTC.. ఎప్పటికప్పుడు కొత్త టూర్ ప్యాకేజీలతో అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. మరి తక్కువ బడ్జెట్ లో పూర్తయ్యే ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు మీకోసం. ఓసారి చూసేయండి.

IRCTC దక్షిణ భారత దేవాలయ యాత్ర
ద్రావిడ శిల్పకళా నైపుణ్యానికి, సంస్కృతి వారసత్వానికి ప్రతీకలుగా నిలిచే గొప్ప దేవాలయాలకు దక్షిణ భారతదేశం ప్రసిద్ధి. ఈ దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు. అనేక శతాబ్దాల నాటి కళలు, సంప్రదాయాలు, చరిత్రలకు నిలయాలు.
దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు.. నిత్యం ఈ పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు. అయితే ఈ ఆధ్యాత్మిక యాత్రను సులభతరం చేయడానికి IRCTC కొత్త ప్యాకేజీని ప్రకటించింది.
IRCTC ఆధ్యాత్మిక యాత్ర
ఈ పర్యాటక ప్యాకేజీ.. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలను చూడాలనుకునే వారికి అనువైంది. IRCTC దేవాలయ యాత్ర.. వసతి, భోజనం, ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తూ… అత్యంత ప్రసిద్ధ దేవాలయాలను దర్శించుకునే అవకాశం ఇస్తోంది.
దేవాలయ యాత్ర
ఈ యాత్ర 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈ యాత్రలో మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, తిరుచిరాపల్లిలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
దీంతోపాటు ఈ యాత్రలో ధనుష్కోటి, అబ్దుల్ కలాం స్మారకం, కేరళలోని పద్మనాభస్వామి ఆలయం, పద్మనాభపురం ప్యాలెస్, ఇటీవల ప్రసిద్ధి చెందిన ఆళిమలై శివుని విగ్రహం వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.
ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీ ధర ఎంతంటే?
ఈ దక్షిణ భారత దేవాలయ యాత్ర ప్యాకేజీ ధర ఒకరికి రూ. 35,650. ఇందులో వసతి, భోజనం, విహారయాత్రలు అన్నీ ఉంటాయి. బుక్ చేసుకోవడం కూడా చాలా సులభం. అధికారిక ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేదా సమీప బుకింగ్ కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు.
దక్షిణ భారతదేశ ఆధ్యాత్మికతను అన్వేషించాలి అనుకునేవారికి ఈ ప్యాకేజీ చక్కగా, సౌకర్యవంతంగా ఉంటుంది.