- Home
- Business
- Tatkal Ticket: తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే..ఈ IRCTC మాస్టర్ ట్రిక్ కచ్చితంగా తెలిసుండాలి
Tatkal Ticket: తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే..ఈ IRCTC మాస్టర్ ట్రిక్ కచ్చితంగా తెలిసుండాలి
Tatkal Ticket: IRCTCలో తత్కాల్ టికెట్ బుక్ చేయడమంటే పెద్ద సవాలే. అవుతుందో లేదో అని ఓ టెన్షన్. ఒక్కోసారి క్షణంలో టిక్కెట్లు అయిపోతాయి. కానీ ఈ చిన్న ట్రిక్‍తో కన్ఫర్మ్ గా టికెట్ అవుతుంది. మరి బుకింగ్ టైమ్‌లో ఏం చేయాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?.

తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్స్
హాలిడేస్ ముఖ్యంగా వేసవి సెలవుల్లో ట్రైన్స్ చాలా రద్దీగా ఉంటుంది. టికెట్ బుక్ చేసుకొందామన్నా...కుదరదు. పోనీ జనరల్ లో పోదామంటే రైళ్లలో కాలు పెట్టడానికి కూడా చోటు ఉండదు. చాలా సందర్భాల్లో సడెన్ జర్నీ చేయాల్సి వస్తే మనకున్న ఏకైక ఆప్షన్ తత్కాల్ టికెట్. కానీ, బుకింగ్ మొదలైన క్షణాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోతాయి. లాగిన్ చేసి, వివరాలు నింపేలోపే 'వెయిటింగ్' లిస్ట్ వచ్చేస్తుంది. మీక్కూడా ఇలాగే జరుగుతోందా? అయితే ఇప్పుడా టెన్షన్ వదిలేయండి. కేవలం 2 నిమిషాల్లో కన్ఫర్మ్ తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి ఉపయోగపడే IRCTC 'మాస్టర్ ట్రిక్' గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తత్కాల్ టికెట్ బుకింగ్ సమయం చూసుకోవాలి
తత్కాల్ బుకింగ్ అంటే టైమింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో ప్రతి సెకన్ ఎంతో కీలకం. ఏసీ క్లాస్ టికెట్లు 2AC, 3AC, 1AC కోసం తత్కాల్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. స్లీపర్ వంటి నాన్-ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్ ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతుంది. ఆ వేళలు తెలుసుకోవాలి.
ఈ ట్రిక్‌తో టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్
తత్కాల్ టికెట్ దొరక్కపోవడానికి ముఖ్య కారణం.. ప్రయాణికుల పేర్లు, వయసు, బెర్త్ వంటి వివరాలు టైప్ చేయడానికి పట్టే సమయమే. మీరు ఇవన్నీ టైప్ చేసి ముగించేలోపే, వేరేవాళ్లు టికెట్ కొనేస్తారు. దీనికి సులభమైన పరిష్కారమే IRCTC 'మాస్టర్ లిస్ట్' (Master List Feature) ఫీచర్. బుకింగ్ మొదలవడానికి ముందే మీరు ఒక చిన్న పని చేసిపెడితే చాలు.
రైలు టికెట్ బుక్ చేసే విధానం
తత్కాల్ బుకింగ్ సమయానికి (ఉదయం 10 లేదా 11 గంటలకు) సుమారు 15-20 నిమిషాల ముందే IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మీ అకౌంట్‌లోని 'My Account' సెక్షన్‌కి వెళ్లి, అక్కడ 'My Master List' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ, మీరు ఎవరికైతే టికెట్లు బుక్ చేయాలనుకుంటున్నారో, వాళ్ల పేర్లు, వయసు, జెండర్ వంటి వివరాలను 'Add Passenger' ఆప్షన్ ద్వారా ముందే సేవ్ చేసుకోండి.
ఇప్పుడు, బుకింగ్ సమయంలో మీరు ప్యాసింజర్ వివరాల పేజీకి రాగానే, పేర్లు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ 'Add Existing' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే, మీరు సేవ్ చేసిన మాస్టర్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. పేర్లను సెలెక్ట్ చేసి, నేరుగా పేమెంట్ పేజీకి వెళ్లిపోవచ్చు!
టికెట్ బుకింగ్‌లో మరో 2 ముఖ్యమైన టిప్స్
నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు OTP రావడం, పాస్‌వర్డ్ ఎంటర్ చేయడానికి సమయం పడుతుంది. తత్కాల్ టికెట్ కోసం ఎప్పుడూ UPI (BHIM, పేటీఎం, ఫోన్‌పే లేదా జీపే) ఉపయోగించండి. దీనివల్ల మీ ఫోన్‌కు నేరుగా రిక్వెస్ట్ వస్తుంది, పిన్ ఎంటర్ చేయగానే పేమెంట్ అయిపోతుంది. ఇంకా వేగంగా పేమెంట్ చేయడానికి, IRCTC వాలెట్‌లో ముందే డబ్బులు వేసి ఉంచుకుంటే, క్షణాల్లో పేమెంట్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మొదలవడానికి సరిగ్గా 2-3 నిమిషాల ముందు లాగిన్ చేయండి. అరగంట ముందే లాగిన్ చేసి కూర్చుంటే, సరిగ్గా 10 లేదా 11 గంటలకు యాప్ మిమ్మల్ని ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని బుకింగ్ చేయండి. ఇది తెలియక చాలా మంది గంటల తరబడి ఓపెన్ చేసి ఉంచుతారు. దానివల్ల సమయానికి లాగ్ అవుట్ అయిపోయే అవకాశం ఉంది.
