MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Gold Price Fall: మళ్లీ గోల్డ్ రేట్లు ఢమాల్...తులంపై ఎంత తగ్గిందో తెలుసా?

Gold Price Fall: మళ్లీ గోల్డ్ రేట్లు ఢమాల్...తులంపై ఎంత తగ్గిందో తెలుసా?

Gold Price Fall: బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట దొరికింది. రెండు రోజుల పెరుగుదల తర్వాత ఒక్కసారిగా గోల్డ్ రేట్లు పతనమయ్యాయి. ఇప్పుడు బంగారం కొనచ్చా? లేక ఇంకా ధరలు పడిపోతాయా? హైదరాబాద్ నుంచి చెన్నై వరకు తాజా ధరలు చూసి షాక్ అవ్వాల్సిందే. 

2 Min read
Author : Nandini Arava
Published : May 21 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట
Image Credit : Getty

బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట

బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈరోజు కొంత ఊరట లభించింది. గత రెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, గ్లోబల్ ఎకానమీపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గోల్డ్‌కు ఏమాత్రం తగ్గని డిమాండ్
Image Credit : Asianet News

గోల్డ్‌కు ఏమాత్రం తగ్గని డిమాండ్

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఒక రోజు భారీగా పెరిగిన ధరలు.. మరుసటి రోజు తగ్గిపోతుండటంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు మార్కెట్‌పై నిశితంగా గమనిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కొనసాగుతుండటంతో గోల్డ్‌కు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.

Related Articles

Related image1
Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Related image2
Gold Price Hike: పసిడి ప్రియులకు బిగ్ షాక్...మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం ధరలు
34
తులంపై రూ.1080 తగ్గిన బంగారం
Image Credit : Getty

తులంపై రూ.1080 తగ్గిన బంగారం

మే 21 ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1080 తగ్గి రూ.1,58,360గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.990 పతనమై రూ.1,45,160 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా భారీ స్థాయిలోనే ఉంది. కిలో వెండి ధర రూ.2,84,900గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,510గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,310గా ఉంది. అక్కడ కిలో వెండి ధర రూ.2,79,900గా కొనసాగుతోంది.

ముంబై మార్కెట్‌లో కూడా బంగారం ధరలు హైదరాబాద్‌తో సమానంగా నమోదయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,58,360గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,160గా ఉంది. వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది.

ఇక చెన్నైలో మాత్రం బంగారం ధరలు దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,900గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,47,490గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,84,900గా నమోదైంది. 

44
జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నిపుణుల సూచన
Image Credit : Getty

జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నిపుణుల సూచన

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరల్లో ఇంకా ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ధరలు తగ్గినప్పటికీ భారీ స్థాయిలోనే ఉండటంతో కొనుగోలుదారులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Recommended image2
Gold Price Hike: పసిడి ప్రియులకు బిగ్ షాక్...మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved