MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Hydrogen Train : పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కాదు... సరికొత్త ఇంధనంతో నడిచే రైలు రెడీ

Hydrogen Train : పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కాదు... సరికొత్త ఇంధనంతో నడిచే రైలు రెడీ

భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలును విజయవంతంగా పరీక్షించారు. దీంతో త్వరలోనే ఇది పట్టాలెక్కనుంది. ఇంతకూ ఏమిటీ హైడ్రోజన్ రైలు? దీని ప్రత్యేకతలేమిటి? ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 28 2025, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది...
Image Credit : stockphoto

హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది...

Railway : పొగలు కక్కుతూ బొగ్గుతో నడిచే ఆవిరి ఇంజన్ల స్థాయినుండి జెట్ స్పీడ్ తో దూసుకుపోయే వందేభారత్ రైళ్ళ వరకు ఇండియన్ రైల్వే ప్రయాణం అద్భుతం. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఇలా అత్యంత వేగంగా నడిచే బుల్లెట్ రైళ్ళనే కాదు పర్యావరణహితమైన హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టుపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.

భారతీయ రైల్వే మరో అరుదైన రైలును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో భారతీయ రైల్వేలు దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్‌తో నడిచే కోచ్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

DID YOU
KNOW
?
భారత్ లో హైడ్రోజన్ రైలు కూత
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంగ్లాండ్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ దేశాల్లో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే భారతదేశం కూడా ఈ జాబితాలో చేరనుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రైల్వే మంత్రి కీలక ప్రకటన
Image Credit : X/LegacY IAS

రైల్వే మంత్రి కీలక ప్రకటన

''చెన్నైలోని ఐసిఎఫ్‌లో హైడ్రోజన్‌తో నడిచే మొట్టమొదటి కోచ్ విజయవంతంగా పరీక్షించబడింది. దేశం 1,200 హార్స్‌పవర్స్ తో నడిచే హైడ్రోజన్ రైలుపై పనిచేస్తోంది... ఇది హైడ్రోజన్ పవర్ ట్రైన్ టెక్నాలజీలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో సహాయపడుతుంది'' అని అశ్విని వైష్ణవ్ అన్నారు.

First Hydrogen powered coach (Driving Power Car) successfully tested at ICF, Chennai.

India is developing 1,200 HP Hydrogen train. This will place India among the leaders in Hydrogen powered train technology. pic.twitter.com/2tDClkGBx0

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 25, 2025

2023లో పర్యావరణ పరిరక్షణ కోసం ''హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్" ప్రాజెక్ట్ కింద 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఒక్కో రైలుకు రూ. 80 కోట్లు, ఒక్కో మార్గానికి గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 70 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఈ హైడ్రోజన్ రైళ్లను వివిధ హెరిటేజ్, కొండ మార్గాల్లో నడపాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది.

35
జింద్-సోనిపట్ మధ్య మొదటి హైడ్రోజన్ రైలు
Image Credit : X-@Indianinfoguide

జింద్-సోనిపట్ మధ్య మొదటి హైడ్రోజన్ రైలు

అదనంగా భారతీయ రైల్వే రూ. 111.83 కోట్ల వ్యయంతో గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ను అమర్చడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా సిద్దం చేసింది. ఇది రైలును ఉత్తర రైల్వేలోని జింద్-సోనిపట్ సెక్షన్‌లో నడపాలని ప్రణాళిక చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు.

45
హైడ్రోజన్ రైలుతో గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్
Image Credit : @Indianinfoguide

హైడ్రోజన్ రైలుతో గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్

ప్రారంభంలో ఈ హైడ్రోజన్ రైళ్లను నడిపేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది... క్రమేపి వీటి సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఖర్చు తగ్గుతుంది. ఇది వాతావరణ కాలుష్యాన్ని కలిగించే కర్బన ఉద్గారాలను విడుదల చేయదు... కాబట్టి హైడ్రోజన్ వాడకం క్లీన్ ఎనర్జీ సోర్స్ గా పేర్కొంటున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు మద్దతుగా గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ ప్రయోజనాలను అందిస్తుంది.

జింద్ లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్లాంట్ ను రెడీ చేస్తున్నారు. అయితే ఈ హైడ్రోజన్ చాలా ప్రమాదకరమైన గ్యాస్.... దీనికి రంగు, వాసన, రుచి ఉండదు... కానీ మండే స్వభావం గల వాయువు. అందుకే జింద్ లోని హైడ్రోజన్ ప్లాంట్ ను రెండు భాగాలుగా విభజించారు... ఒకటి అల్ప పీడనంతో 2320 కిలోల సామర్థ్యం గలది... ఇంకోటి అధిక పీడనంతో 680 కిలోల సామథ్యం గలది.

55
హైడ్రోజన్ రైలు నడుస్తున్న దేశాలివే
Image Credit : X/Indian Raiway

హైడ్రోజన్ రైలు నడుస్తున్న దేశాలివే

ఇండియాలో నడవనున్న హైడ్రోజన్ రైలులో 10 బోగీలు ఉంటాయి. ఇతర దేశాల్లో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఇన్ని బోగీలు ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంగ్లాండ్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ దేశాల్లో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే భారతదేశం కూడా ఈ జాబితాలో చేరనుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Recommended image2
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Recommended image3
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Related Stories
Recommended image1
Delhi Metro Rail: ఢిల్లీ మెట్రో నయా రికార్డు.. 
Recommended image2
MMTS Train: హైద‌రాబాద్ టూ యాద‌గిరిగుట్ట‌.. రూ. 20 టికెట్‌, గంట‌లోపే ప్ర‌యాణం. ట్రాఫిక్ స‌మ‌స్య కూడా ఉండ‌దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved