Asianet News TeluguAsianet News Telugu

Delhi Metro Rail: ఢిల్లీ మెట్రో నయా రికార్డు.. 

Delhi Metro:  ఢిల్లీ మెట్రో నయా రికార్డు నెలకొల్పింది.  ఫిబ్రవరి 13న ఢిల్లీ మెట్రో చరిత్రలోనే అత్యధికంగా ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తాజాగా వెల్లడించింది. ఇంతకీ ఎంతమంది ప్రయాణించారంటే.? 
 

Delhi Metro registers highest-ever daily ridership on Feb 13 KRJ
Author
First Published Feb 15, 2024, 5:31 AM IST | Last Updated Feb 15, 2024, 5:31 AM IST

Delhi Metro Rail: అధికంగా రద్దీ ఉన్న నగరంలో ప్రయాణం చేయడం అంత సులభం కాదు. కొంతదూరం ప్రయాణమైనా.. గంటలు గంటలు వేచించాల్సి ఉంటుంది. దీంతో సులభంగా ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా.. సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు మెట్రో రైలు ఎంతో అనువుగా ఉంటుంది. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలెదుర్కొకుండా..చల్లటి ఏసీలో మెరుపు వేగంతో గమ్యాన్ని చేరుకోవచ్చు. అందుకే చాలా మంది స్వంత వాహనాలున్నా.. మెట్రో రైళుకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలోనే మెట్రోలో ప్రయాణించేవారికి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 

తాజాగా ఓ ఢిల్లీ మెట్రో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఒక్కరోజు ఏకంగా 71 లక్షల మందికిపైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారు. ఇది దేశ మెట్రోలోనే సరికొత్త రికార్డు. ఈ రికార్డును ఢిల్లీ మెట్రో సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 13న ఢిల్లీ మెట్రో చరిత్రలోనే అత్యధికంగా ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తాజాగా వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే ఢిల్లీ మెట్రో రైళ్లలో 71.09 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.  

రైతుల ఉద్యమం కారణంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నిరసన తెలిపిన రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు రాజధాని సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లతో పాటు పలు రహదారులను మూసివేశారు. దీంతో రోడ్డు మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఇలా ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఒక్కరోజు ఏకంగా 71 లక్షల మందికిపైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారు. గత రికార్డులు బద్దలయ్యాయి.  మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రికార్డు బద్దలైంది.

మంగళవారం రికార్డ్‌తో గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన రికార్డ్ బద్దలైంది.గత ఏడాది సెప్టెంబర్ 4న కూడా ఢిల్లీ మెట్రోలో రికార్డు స్థాయిలో ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. ఏకంగా 71.03 లక్షల మంది ప్రయాణించారు. అంతకుముందు  ఫిబ్రవరి 10, 2020న  66,18,717 మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించగా.. ఆగస్టు 28, 2023న 68, 16,252 మంది ప్రయాణికులు , ఆ మరుసటి రోజే ఆగస్టు 29న  69.94 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో సాధారణంగా నిత్యం 50 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఢిల్లీతోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాలను కలుపుతూ ఢిల్లీ మెట్రో విస్తరించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios