MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Smartphone: అమెరికాలో ఇండియన్ ఫోన్ల హవా.. చైనా ఆధిపత్యానికి భారత్ చెక్..

Smartphone: అమెరికాలో ఇండియన్ ఫోన్ల హవా.. చైనా ఆధిపత్యానికి భారత్ చెక్..

Smartphone: ఒకప్పుడు మొబైల్‌ ఫోన్లు (Mobile) అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్‌ నేడు ఎగుమతి చేసే దేశంగా నిలిచింది. అగ్రదేశం అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసే అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. చైనాను వెనక్కి నెట్టి మరీ..

2 Min read
Author : Rajesh K
Published : Jul 30 2025, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో చైనాను అధిగమించిన భారత్
Image Credit : Getty

స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో చైనాను అధిగమించిన భారత్

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా దేశీయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లకు భారత ఉత్పత్తులు వినియోగంలో విశేష ప్రాధాన్యం సంపాదించుకున్నాయి. ఈ  పథకం ఫలితంగా భారత్ అనేక ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది.  ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాను వెనక్కునెట్టి, అమెరికాకు అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి చేసే దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేడ్ ఇన్ ఇండియా విజయం!
Image Credit : Asianet News

మేడ్ ఇన్ ఇండియా విజయం!

2025 రెండో త్రైమాసికంలో భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 240% మేర పెరిగాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్లోకి వచ్చే స్మార్ట్‌ఫోన్‌లలో 44% 'మేడ్ ఇన్ ఇండియా' ఫోన్లే కావడం విశేషం. గత ఏడాది ఇదే కాలంలో ఈ శాతం 13% మాత్రమే ఉండగా, ఒక్క ఏడాది కాలంలోనే భారత్ చైనాను వెనక్కు నెట్టింది. ఈ గణాంకాలు మేక్ ఇన్ ఇండియా పథకం విజయంగా చెప్పవచ్చు. 

35
అదే సమయంలో చైనాకు ఎదురుదెబ్బ!
Image Credit : stockphoto

అదే సమయంలో చైనాకు ఎదురుదెబ్బ!

2024 రెండో త్రైమాసికంలో చైనా అమెరికాకు 61% స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసింది. కానీ 2025 రెండో త్రైమాసికంలో ఈ ఎగుమతులు 25% తగ్గి, చైనా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఈ స్థానాన్ని భారత్ ఆక్రమించింది. భారత్ మాత్రం 44% వాటాతో చైనాను అధిగమించి అగ్రస్థానంలో నిలువడం గర్వకారణం.

45
చైనాకు క్షీణత కారణాలు
Image Credit : stockphoto

చైనాకు క్షీణత కారణాలు

2025లో భారతదేశం అమెరికాకు అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి చేసే దేశంగా అవతరించగా, చైనా ఈ రంగంలో వెనుకబడింది. ఈ మార్పుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం.

ఒకటి అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం. డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం చైనా పడింది. ఈ యుద్ధంలో చైనా ఎగుమతులు దెబ్బతిన్నాయి. మరో కారణం భారతదేశంలో ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తి కేంద్రం పనిచేస్తోంది. ఇప్పుడు ఆపిల్ చైనా కంటే భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టింది

55
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ హాబ్ గా భారత్
Image Credit : motorola G35 5G Smartphone

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ హాబ్ గా భారత్

ఆపిల్‌తో పాటు శామ్‌సంగ్, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌లను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ మార్పుతో  స్మార్ట్‌ఫోన్ తయారీ  భారత్ కీలక భాగస్వామిగా నిలుస్తోంది. మోటరోలా ఇప్పటికీ తన చైనా ఫ్యాక్టరీల ద్వారా అమెరికాకు ఎక్కువ ఫోన్లను ఎగుమతి చేస్తూనే ఉంది. అయితే, ఇటీవల భారతదేశంలో మోటరోలా ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. ఇలా  భారత్‌లో తయారుచేసి నేరుగా అమెరికా మార్కెట్‌కి ఎగుమతి చేస్తోంది. ఇక శామ్‌సంగ్ ఇప్పటికే భారత్‌లో తన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను పెద్దస్థాయిలో విస్తరించి, గ్లోబల్ ఎగుమతులకు కేంద్రంగా మలుచుకుంటోంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
భారత దేశం
చైనా
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Smart phone: పక్కవారు మీ ఫోన్‌లో ఏం చూశారో ఎలా తెలుసుకోవాలా.? ఎవరికీ తెలియని ట్రిక్‌
Recommended image2
Now Playing
Smart Phone: ఇండియన్స్ రోజుకు ఎన్ని గంటలు ఫోన్‌ వాడుతున్నారో తెలుసా? | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved