MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • టీవీలు, ఫోన్లు కొనాలంటే వెంటనే కొనేయండి. చైనాపై ట్రంప్ పన్నుల మోత.. ధరలు ఎంత పెరుగుతాయంటే..?

టీవీలు, ఫోన్లు కొనాలంటే వెంటనే కొనేయండి. చైనాపై ట్రంప్ పన్నుల మోత.. ధరలు ఎంత పెరుగుతాయంటే..?

US China Trade War: అమెరికా, చైనా మధ్య జరుగుతున్న పన్నుల యుద్ధం కొన్ని దేశాలకు ఉపయోగకరంగానూ, కొన్ని దేశాలకు తీవ్ర నష్టాన్ని కలిగించేదిగా మారింది.  ఈ రెండు దేశాల మధ్య దిగుమతి పన్నుల సుంకాలు భారీ స్థాయిలో పెరగడంతో ఈ విషయం ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. దీనివల్ల టీవీలు, ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ధరలు ఎక్కడ పెరుగుతాయి. ఎక్కడ తగ్గుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 12 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఏ ధైర్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 125% పన్నును ప్రకటించారో తెలియదు కాని ఈ అంశం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ పన్ను వెనుక ఉన్న లక్ష్యం చైనా నుండి ఉత్పత్తిని తొలగించడమే అయినప్పటికీ చాలా మంది నిపుణులు ఇది రోజువారీ ఎలక్ట్రానిక్ పరికరాల ధరలను ప్రభావితం చేస్తుందని నమ్ముతున్నారు. అంటే దీని వల్ల కొన్ని దేశాల్లో వస్తువుల ధరలు తగ్గుతాయి. అమెరికా వంటి కొన్ని దేశాల్లో ఎలక్ట్రానిక్స్ ధరలు పెరుగుతాయని సమాచారం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇండియాలో ధరలు తక్కువ.. అమెరికాలో ఎక్కువ

అమెరికా పన్నుల విధింపు కారణంగా భారతదేశంతో సహా ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో కొన్ని దిగుమతి చేసుకున్న పరికరాలు చౌకగా లభించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో ధరల పెరుగుదల ఎక్కువగా ఉంటుందని అంచనా. ఉదాహరణకు, దిగుమతి పన్నులు పెరగడం వల్ల అమెరికాలో ఆపిల్ ఐఫోన్‌ల ధర 30 % కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది.

34

ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి?

అమెరికాలో చాలా దశాబ్దాలుగా తక్కువ ధర దిగుమతులకు ముగింపు పలకడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే చైనా వస్తువులపై భారీ పన్నుల ప్రభావం అమెరికాపైనే ఎక్కువ పడేలా ఉంది. ఈ చర్య వల్ల ఆటోమొబైల్స్ ధర 15% వరకు పెరిగే అవకాశం ఉంది. దుస్తులు వంటి ప్రాథమిక వస్తువులు కూడా 33% పెరుగుతాయి. దీంతో ప్రజలు, కంపెనీలు, దుకాణదారులు, చిల్లర వ్యాపారులు కూడా ఇప్పుడు డిమాండ్ వస్తువుల ధరల్లో మార్పులకు సిద్ధమవుతున్నారు.

44

మొబైల్ ఫోన్ల ఉత్పత్తిపై ప్రభావం

అమెరికా, చైనా మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత వల్ల భారతదేశానికి కొంచెం ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రపంచ తయారీదారులు కార్యకలాపాలను పన్ను రహిత దేశాలకు మార్చినట్లయితే చాలా పేపర్ వర్క్స్ తగ్గిపోతాయి.

ఉదాహరణకు ఆపిల్ ఇప్పటికే భారతదేశానికి ఎక్కువ ఐఫోన్ ఉత్పత్తిని తరలిస్తోంది. ఈ సుంకాలను విధించడం వల్ల కలిగే నిజమైన ప్రభావం రాబోయే నెలల్లో స్పష్టంగా తెలుస్తుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
చైనా
ప్రపంచం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image2
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image3
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved