MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • DMart : మీరు డీమార్ట్ తో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకిదే అద్భుత అవకాశం

DMart : మీరు డీమార్ట్ తో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకిదే అద్భుత అవకాశం

డీమార్ట్ తో కలిసి వ్యాపారం చేసే అద్భుత అవకాశం మీకు కావాలా..?  అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకొండి. 

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 29 2025, 06:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వినియోగదారులకే కాదు వ్యాపారులకు డీమార్ట్ సూపర్ ఛాయిస్..
Image Credit : Pixabay

వినియోగదారులకే కాదు వ్యాపారులకు డీమార్ట్ సూపర్ ఛాయిస్..

DMart : భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు డీమార్ట్... తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను అందించే ఈ సూపర్ మార్కెట్ మధ్యతరగతి ప్రజలకు బాగా చేరువయ్యింది. ఇలా దేశంలోని మెజారిటీ మిడిల్ క్లాస్ వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తుండటంతో డీమార్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రత్యర్థి సూపర్ మార్కెట్స్ నష్టాలపాలై మూతపడుతున్నా డీమార్ట్ మార్ట్ మరింత వేగంగా విస్తరిస్తోంది... వేలకోట్ల వ్యాపారాన్ని చేస్తోంది.

ఇలా రిటైల్ వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించిన డిమార్ట్ స్టోర్లు ప్రస్తుతం భారతదేశంలోని అనేక నగరాల్లో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయనే కారణంగానే ప్రజలు ఎక్కువగా డీమార్ట్ లో షాపింగ్ ను ఇష్టపడుతున్నారు. అయితే వినియోగదారుల మాదిరిగానే చిన్న వ్యాపారవేత్తలకు కూడా డీమార్ట్ ఒక శుభవార్త అందిస్తోంది. తమ ఉత్పత్తులను డీమార్డ్ లో అమ్ముకోవాలంటే వ్యాపారవేత్తలు నిశ్చింతగా ఆపని చేయవచ్చు... ఇలా డీమార్ట్ తో కలిసి వ్యాపారం చేసి మంచి లాభాలను పొందవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మీ వస్తువులను డీమార్ట్ లో అమ్ముకోండిలా..
Image Credit : Dmart

మీ వస్తువులను డీమార్ట్ లో అమ్ముకోండిలా..

డిమార్ట్ అన్ని స్టోర్లలో ఆహారం, గృహోపకరణాలు, కిరాణా, దుస్తులు వంటి అనేక రకాల వస్తువులను అమ్ముతోంది. దీనివల్ల స్థానిక ఉత్పత్తిదారులు లేదా చిన్న వ్యాపారులు తమ బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు మీరు మసాలా దినుసులు, ప్యాకెట్ ఫుడ్, ప్లాస్టిక్ వస్తువులు, టీ-షర్టులు లేదా రోజువారీ ఉపయోగించే వస్తువులను తయారుచేస్తుంటే, డిమార్ట్ మీ వస్తువులను వినియోగదారులకు చేరవేయడంలో సహాయపడుతుంది.

Related Articles

Related image1
Dmart Shopping: డిమార్ట్‌లో మరింత చవకధరకు సరుకులు కావాలా? ఈ చిట్కాలు పాటించండి
Related image2
DMart : మీ స్థలంలోనే డీమార్ట్ పెట్టవచ్చు.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
35
డీమార్ట్ తో కలిసి వ్యాపారం చేయాలంటే ఏంచేయాలి?
Image Credit : Dmart India

డీమార్ట్ తో కలిసి వ్యాపారం చేయాలంటే ఏంచేయాలి?

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరున్న బ్రాండ్సే కాదు లోకల్ వస్తువులు కూడా డీమార్ట్ లో లభిస్తాయి. అయితే మీరు ఏదైనా వస్తువు తయారుదారు అయితే దాన్ని డీమార్ట్ లో అమ్ముకోవచ్చు. ఇందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం మీరు ఉత్పత్తిచేసే వస్తువుల వివరాలతో పాటు మీ పర్సనల్ డిటెయిల్స్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. డీమార్ట్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఈ పని చేయాలి. ఇక్కడ వ్యాపారి తన కంపెనీ వివరాలతో పాటు డీమార్ట్ లో అమ్మాలనుకునే ప్రోడక్ట్ డిటెయిల్స్ అందించాలి.

ఇలా దరఖాస్తు చేసుకున్న వ్యాపారులను డీమార్ట్ అధికారులు సంప్రదిస్తారు. ప్రతి మంగళవారం డీమార్ట్ తో కలిసి వ్యాపారం చేయాలనుకునేవారితో సమావేశం అవుతారు అధికారులు. వీరి వస్తువుల నాణ్యత, ధర, ఇతర వివరాలను తెలుసుకుంటారు. ఇలా ఇద్దరూ ఓ ఒప్పందానికి వస్తే ఆ వస్తువు డీమార్ట్ లో అమ్మకానికి పెడతారు... వినియోగదారులకు ఆ వస్తువు మరింత దగ్గర అవుతుంది. ఇలా డీమార్ట్ తో కలిసి వ్యాపారం చేయడంద్వారా మంచి లాభాలను పొందవచ్చు.

డీమార్ట్ తో వ్యాపారం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకొండి.  

45
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొండి..
Image Credit : DmartIndia

మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొండి..

మీ వస్తువులు వినియోగదారుల వరకు చేర్చేందుకు డీమార్ట్ మంచి ప్లాట్ ఫామ్ కల్పిస్తోంది. ఉత్పత్తిదారులతో చేయిచేయి కలిసి ఎదగాలన్నదే డీమార్ట్ బిజినెస్ సీక్రెట్. మంచి క్వాలిటీ వస్తువులను అందించేవారితో లాంగ్ టర్మ్ పార్టనర్ షిప్ కొనసాగిస్తామని డీమార్ట్ చెబుతోంది. ఇలా డీమార్ట్ తో చేతులుకలిసి వ్యాపారాన్ని మరింత పెంచుకునే అవకాశం వచ్చింది.. దీన్ని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. ఇది వ్యాపారాన్ని రాష్ట్రవ్యాప్తంగా, తదుపరి దశలో దేశవ్యాప్తంగా విస్తరించడానికి సహాయపడుతుంది.

డిమార్ట్ తన వినియోగదారులకు ఎల్లప్పుడూ నమ్మకమైన, నాణ్యమైన వస్తువులను తక్కువ ధరకే అందించాలని కోరుకుంటుంది. అందువల్ల డీమార్ట్ తో వ్యాపారం చేయాలనుకునేవారు కూడా అదే ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది... అంటే వారి వస్తువులు బయట మార్కెట్ కంటే తక్కువధరలో ఉండాలి. ముఖ్యంగా ఆహారం, కిరాణా వస్తువుల నాణ్యత చాలా ముఖ్యం. నాణ్యతా ధ్రువపత్రాలు లేకుండా డిమార్ట్ వస్తువుల అమ్మకానికి అంగీకరించదు. ఇది వినియోగదారుల నమ్మకాన్ని కాపాడే ప్రయత్నం.

చిన్న వ్యాపారవేత్తలకు ఇది చాలా పెద్ద అవకాశం. సాధారణ దుకాణాలు లేదా ఆన్‌లైన్ మార్కెట్‌లో పోటీ పడటం కష్టంగా ఉండే పరిస్థితుల్లో, డిమార్ట్ వంటి పెద్ద రిటైల్ చైన్ మీ వస్తువులకు ఖచ్చితమైన మార్కెట్‌ను సృష్టిస్తుంది. మీ వస్తువులు వినియోగదారులకు చేరుతాయి. అందువల్ల మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటే, డిమార్ట్ వంటి పెద్ద కంపెనీలతో కలిసి పనిచేయడం ఉత్తమ పరిష్కారం. నాణ్యత, ధర, నమ్మకాన్ని కాపాడుకుంటే మీరు కూడా త్వరలోనే ప్రముఖ వ్యాపారిగా మారవచ్చు.

55
డీమార్ట్ ఫ్రాంచైజీలు ఇవ్వదు.. నమ్మి మోసపోకండి
Image Credit : Dmart

డీమార్ట్ ఫ్రాంచైజీలు ఇవ్వదు.. నమ్మి మోసపోకండి

తాము సొంతంగానే వ్యాపారాలు చేస్తామని... ఎవరికీ ఫ్రాంచైజీలు ఇవ్వడంలేదని డీమార్ట్ స్పష్టం చేస్తోంది. ఇలా డీమార్ట్ ఫ్రాంచైజీ పేరిట ఎవరైనా సంప్రదిస్తే నమ్మవద్దని సూచిస్తోంది. అవసరమైన భూమిని కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకుని స్టోర్ట్స్ ఏర్పాటుచేస్తామే తప్ప ఫ్రాంచైజీలు ఇవ్వబోమని డీమార్ట్ స్పష్టం చేస్తోంది. అలాగే వ్యాపారులు తమ వస్తువులు డీమార్ట్ స్టోర్స్ లో అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది.

అయితే డీమార్ట్ మార్కెట్ చాలా విస్తృతమైంది... అందుకే దీని పేరును వాడుకునే ప్రయత్నాలు మార్కెట్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. సేమ్ ఈ పేరును పోలి ఏ మార్ట్, బి మార్ట్, సి మార్ట్ వంటి సూపర్ మార్కెట్లు వెలుస్తున్నాయి... వీటితో డీమార్ట్ కు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని స్పష్టం చేసేందుకే ఎలాంటి ఫ్రాంచైజీలు ఇవ్వడంలేదని డీమార్ట్ స్పష్టం చేస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
భారత దేశం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్
విశాఖపట్నం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Dmart Shopping: డిమార్ట్‌లో మరింత చవకధరకు సరుకులు కావాలా? ఈ చిట్కాలు పాటించండి
Recommended image2
DMart : మీ స్థలంలోనే డీమార్ట్ పెట్టవచ్చు.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved