Dmart Shopping: డిమార్ట్‌లో మరింత చవకధరకు సరుకులు కావాలా? ఈ చిట్కాలు పాటించండి
డిమార్ట్ లో సరుకులు కొంటే ఎంతో ఆదా. అందుకే అందరూ డిమార్ట్ కే వెళ్లి నెలవారీ సరుకులు ఒక్కసారే తెచ్చుకుంటారు. అయితే డిమార్ట్ షాపింగ్ లో కొన్ని చిట్కాలు పాటిస్తే మరింత చవకగా వస్తువులు లభిస్తాయి.

ఈ వారాల్లోనే వెళ్లండి
డిమార్ట్ కి వెళ్ళాలనుకునే వారు వారాంతాల్లో ప్లాన్ చేసుకోకండి. మిగతా ఐదు రోజులు డిమార్ట్ కి వెళ్లేందుకు ప్రయత్నించండి. ఆ సమయంలో రద్దీ తక్కువగా ఉంటుంది. రాయితీ ఎక్కువ ఏ వస్తువులపై ఉన్నాయో మీరు గుర్తించగలరు. అలాగే కొన్ని వస్తువులపై సాధారణ రోజుల్లోనే రాయితీ అధికంగా ఉంటుంది. అలాగే డిమార్ట్ లేబుల్ ఉన్న బ్రాండ్ల సరుకులను కొంటే మీకు ఇంకా తక్కువ ధరకే లభిస్తాయి.
ఇలా కొంటే లాభం
డిమార్ట్ లో తక్కువ ధరలకు మంచి నాణ్యత ఉన్న సరుకులు లభిస్తాయి. అందుకే అందరూ అక్కడికి వెళతారు. అయితే మీరు సబ్బులు, డిటర్జెంట్లు వంటివి కొనాలనుకుంటే తక్కువ మొత్తంలో కొనకండి. అవి ఎక్కువ మొత్తంలో కొంటే అదనంగా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని ఉత్పత్తులు ఎక్స్పైరీ తేదీకి కాస్త దగ్గరగా ఉంటాయి. వాటిపై డిమార్ట్ లో 30 నుంచి 50 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. మీరు వాటిని ఎక్స్పైరీ డేట్ లోపు వాడే అవకాశం ఉంటే వాటిని తీసుకుంటే మీకు డబ్బు చాలా ఆదా అవుతుంది.
సీజన్ ప్రకారం
పండగల సీజన్లో డిమార్ట్ లో భారీ తగ్గింపులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దీపావళి, దసరా, సంక్రాంతి వేళల్లో డిమార్ట్ లో తక్కువ ధరకు సరుకులు లభిస్తాయి. అలాగే వేసవి, వర్షాకాలం, శీతాకాలంలో కూడా పరిస్థితులకు తగ్గట్టు డిమార్ట్ లో భారీ తగ్గింపు ఇస్తూ ఉంటుంది. ఈ ధరలు వారానికి ఒకసారి మారుతూ ఉంటాయి. కాబట్టి మీకు వాటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా అవగాహన పెంచుకొని సరైన సమయానికి వెళ్లి కొనుగోలు చేస్తే మీకు డబ్బులు మరింత ఆదా అవుతాయి.
ఆన్ లైన్ తో పోల్చుకోండి
డీమార్ట్ ఆన్లైన్లో ఖరీదుగా ఉండి స్టోర్లో తక్కువ కాస్ట్ తో ఉండే వస్తువులు ఎన్నో ఉంటాయి. అవి ఏంటో ముందుగానే ఒక అంచనాకు రండి. దాన్ని పోల్చుకొని షాపింగ్ చేసుకుంటే మీకు ఆదా చేసే అవకాశం పెరుగుతుంది. ఆన్లైన్లో ఎంత తక్కువగా వస్తువులనుకుంటే అంతగా ఆదా చేసుకోవచ్చు. డిమార్ట్ లో కొన్ని ఆ సంస్థకు చెందిన వస్తువులు ఉంటాయి. మీ బిల్లులో డి అనే కోడ్ ఉంటే అది డిమార్ట్ కి చెందిన వస్తువు అని అర్థం. దానిపై డిస్కౌంట్ లో కూడా అధికంగానే ఉంటాయి. కాబట్టి అలాంటి వస్తువుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నెలకు సరిపడా ఒక్కసారే
చాలామంది వారానికి సరిపడా సరుకులు తెచ్చుకుంటారు. తిరిగి వారాంతంలో వెళుతూ ఉంటారు. మీరు వారాంతంలో డిమార్ట్ కు వెళ్లడం వల్ల జనాభా రద్దీ తప్ప ఏమీ ఉండదు. వీలైనంతవరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు షాపింగ్ చేయండి. అలాగే డిమార్ట్ లో నెలవారీ సరుకులను తెచ్చుకుంటే మీకు ఎక్కువ మొత్తంలో ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్లేటప్పుడు వారానికి సరిపడా కాకుండా నెలకు సరిపడా సరుకులు ప్లాన్ చేసుకొని వెళితే మంచిది.